అయోధ్య రాముడికి తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం
x

అయోధ్య రాముడికి తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం

తిరుమల నుంచి అయ్యోధ్య కు ప్రత్యేకంగా తయారైన శ్రీవారి లడ్డులు వెళ్తున్నాయి


దేశమంతా ఆధ్యాత్మిక శోభవెల్లివిరిస్తోంది. ఎక్కడ చూసిన అయోధ్యలో జనవరి 22 న జరగబోయే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించే చర్చ. టీవీల్లో ప్రత్యేక ప్రోగ్రాములు, పేపర్లలో రామమందిర విశేషాలు. ఇంతేనా హైదరాబాద్ నుంచి పాదయాత్రలు, రామయ్య కోసం చేయించిన బంగారు చెప్పులు ఇలా తమకు తోచిన రీతిలో రాములవారి సేవ లో తరించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అయోధ్య అక్షతల పంపిణీ కార్యక్రమం దాదాపుగా పూర్తయింది.




ఇప్పుడిక అయోధ్య రామయ్య సేవలు చేయడానికి తిరుమల వేంకటేశుడు కూడా సిద్దం అయ్యాడు. తనంటే భక్తులు ఎంత ఇష్టపడతారో, తనకు ఇష్టమైన లడ్డూ ప్రసాదాన్ని సైతం అంతే భక్తితో సేవిస్తారు. అందుకే రామయ్య ప్రాణ ప్రతిష్ట పాల్గొనే భక్తుల కోసం కూడా తిరుపతి వెంకన్న ప్రసాదాలు అయోధ్యకు తరలి వెళ్తున్నాయి.




జనవరి 22 న అయోధ్యలో జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ తరఫును కూడా తనకు తోచిన రీతిలో సేవలు చేయాలని సంకల్పించింది. అందుకోసం ప్రత్యేకంగా 25 గ్రాముల బరువు గల లడ్డూలను తయారు చేసి ప్యాక్ చేయింది.




తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున లక్ష లడ్డూలను అయోధ్య రామమందిరం సందర్భంగా వచ్చే భక్తులకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో కవర్ లో రెండు చిన్న చిన్న లడ్డూలు వేసి ప్యాక్ చేసి సిద్దం చేశారు.




గురువారం తిరుమల లోని శ్రీవారి సేవా సదన్-1 లో శ్రీవారి సేవకులు అయిన 350 మంది, 350 బాక్స్ లలో లక్ష లడ్డూలను ప్యాక్ చేశారు. వీటిని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగే సమయానికి అక్కడి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

Read More
Next Story