టీటీడీ చరిత్రలో 2025 జనవరి 8 బుధవారం బ్లాక్‌డేగా నిలిచి పోయింది.


ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో తొక్కిసలాట దుర్ఘటన మాయని మచ్చగా నిలిచి పోయింది. టీటీడీ చర్రితలోనే 2025 జనవరి 8 బుధవారం బ్లాక్‌డేగా మారిపోయింది. టీటీడీ పాలక మండలి అనుచిత నిర్ణయాలు, సమన్వయ లోపాలు వెరసి భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఒక పక్క అధికారులను సస్పెండ్‌ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే..మరో వైపు సారీ చెప్పినంత మాత్రానా తొక్కిసలాటలో చనిపోయిన వారు తిరిగి రారు కాదా.. తొక్కిసలాటలో పాలక మండలి తప్పేమి లేదు అని బాధ్యతాయుతమైన టీటీడీ చైర్మన్‌ చైర్‌లో ఉన్న బీఆర్‌ నాయుడు చేసిన వ్యాఖ్యలు..ఆయన బాధ్యతా రాహిత్యాన్ని.. ప్రజలు..భక్తులపై ఆయనకున్న చిత్త శుద్ధిని ప్రపంచానికి చాటి చెప్పాయి. మరి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యాఖ్యలు చేసిన టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీద ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కానీ.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కానీ..ఎన్డీఏ పక్షమైన బీజేపీ ప్రభుత్వ పెద్దలు కానీ చర్యలు తీసుకునే దమ్ము..ధైర్యం ఉందా? అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే తిరుపతి తొక్కిసలాట దుర్ఘటన ప్రజా వ్యాజ్యంగా మారింది. న్యాయం తేల్చాలని ఆంధ్రప్రదేశ్‌ కోర్టు మెట్లెక్కింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం దీనిపైన స్పందించిన తీరు కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. చివరికి దీనిపై విచారణ జరిపి ఏవిధమైన తీర్పును వెలువరిస్తుందో అనేది సర్వత్ర ఉత్కంఠగా మారింది.
తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనపై విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం హైకోర్టులో ప్రజా వ్యాజ్యాన్ని(పిల్‌)ను దాఖలు చేశారు. దారుణమైన తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో కానీ మాజీ న్యాయమూర్తితో కానీ విచారణ జరపాలని ప్రభాకర్‌రెడ్డి తన పిటీషన్‌లో హైకోర్టును కోరారు. ఈ పిల్‌ మీద్‌ పిటీషనర్‌ తరపున న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనపై అత్యవసర విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అయితే న్యాయవాది శివప్రసాద్‌ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసి పుచ్చింది. దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పేర్కొంది. వెకేషన్‌ బెంచ్‌లో విచారణ చేపడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై జనవరి 17న తిరిగి విచారణ చేపట్టే అవకాశం ఉంది.
పిటీషనర్‌ హైకోర్టును ఏమి కోరారంటే..
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించడంతోపాటు 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై సిట్టింగ్‌ జడ్జి లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలి. తొక్కిసలాట ఘటనపై 30 రోజుల్లో నివేదికను గవర్నర్‌కి సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలి. భవిష్యత్తులో దేవాలయాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలి. టీడీపీ యంత్రాంగం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరమైన తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలో కోల్పోయారు. కాబట్టి వారందరినీ బాధ్యులను చేయాలి. సీఎం చంద్రబాబు పాలనలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరగడం, భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో గోదావరి పుష్కరాల సందర్భంగా తొక్కిసలాటలు జరిగాయి. దారుణమైన ఆ దుర్ఘటనలో 29 మంది భక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అని పిటీషనర్‌ తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
Next Story