టీటీడీ చైర్మన్ గా టీవీ5 బీఆర్ నాయుడు నియామకం
కమ్మ సామాజిక వర్గానికి తొలిసారి TTD చైర్మన్ పదవి దక్కింది. Tv5 నాయుణ్ణి ఈ పదవి వరించింది.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల తరువాత టీటీడీ పాలక మండలిని నియమిస్తూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 24 మందిని బోర్డు సభ్యులుగా నియమించారు. ఆ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్ల కాలపరిమితిలో కలిగిన పాలక మండలిలో ఆంధ్రా, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్ ప్రాంతాల వారికి సభ్యులుగా అవకాశం కల్పించారు.
అందరూ ఊహించిన విధంగానే టీటీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా టీవీ-5 చైర్మన్ బిఆర్. నాయుడు నియమితులయ్యారు. ఈయనతో పాటు 24 మంది పాలకమండలి సభ్యులుగా అవకాశం కల్పించారు. టీటీడీ చరిత్రలో మొదటిసారి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ అయ్యారు.
రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత కీలకమైన టీటీడీ బోర్డు చైర్మన్గా మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపించింది. అంతకు ముందు నుంచే విపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి అండగా నిలిచిన టీవీ-5చైర్మన్ బిఆర్. నాయుడు పేరు సీఎం చంద్రబాబు మదిలో ఉన్నట్లు వెల్లడి అయింది. అయితే టీవీ 5 చైర్మన్ బీఆర్. నాయుడుకు పదవి దక్కకుండా మరో ఇద్దరు చానల్స్ ప్రతినిధులు అడ్డంకిగా మారారనే వార్తలు వినిపించాయి.
టీటీడీ చైర్మన్ పదవి తీసుకునేందుకు మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక గజపతిరాజు సుముఖత చూపని నేపథ్యంలో టీవీ5 చైర్మన్ బీఆర్. నాయుడు అభ్యర్థిత్వానికి సీఎం ఎన్. చంద్రబాబు మొగ్గు చూపినట్లు స్పష్టమైంది. కూటమిలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కూడా ఉండడం వల్ల సమన్వయం సాధించడం, పాలకమండలి సభ్యుల కూర్పులో సీఎం ఎన్. చంద్రబాబు ఆచితూచి వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఎట్టకేలకు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
24 మంది సభ్యులు
టీటీడీ పాలకమండలి సభ్యుల ఎంపికలో కూడా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసినట్లు కనిపిస్తోంది. అందులో ప్రధానంగా పాలకమండలిలో సభ్యులను 24 మందికి మాత్రమే పరిమితం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జెంబోజట్ స్థాయిలో సభ్యులను నియమించడం ద్వారా విమర్శలకు గురయ్యారు. అలాంటి పరిస్థితి లేకుండా సీఎం ఎన్. చంద్రబాబు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు పాలకమండలి సభ్యుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్లు కనిపిస్తోంది.
వేమిరెడ్డి ప్రశాంతికి ధమాకా..
పాలకమండలిలో సభ్యులుగా ముందుగా ఊహించినట్టుగానే నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్థానం దక్కింది. ఆమె సభ్యరాలు కావడం ఇది మూడోసారి. వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈమె రెండు పాలక మండలలో సభ్యురాలిగా పని చేశారు. సభ్యులుగా రంగ శ్రీ ఆనంద సాయి, నరేష్ కుమార్, డాక్టర్ ఆదిత్ దేశాయ్ , జ్యోతుల నెహ్రూ, ఎమ్మెస్ రాజు , కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి, సుచిత్ర ఎల్లా, సౌరబ్ హెచ్ దొర, కోటేశ్వరరావు రాజశేఖరగౌడ్, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, రామ్మూర్తి, జానకీదేవి, మహేందర్ రెడ్డి, నరేష్ కుమార్, నర్సిరెడ్డి సాంబశివరావు, రాజశేఖర్ గౌడ్ ఉన్నారు. వారిలో గుజరాత్ లోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. మొదట్లో వైసీపీ నుంచి రాజీనామా చేసిన వచ్చిన బీసీ నేత జంగా కృష్ణమూర్తి పేరు వినిపించినా, ఆయనకు సభ్యుడిగా మాత్రమే అవకాశం దక్కింది.
Next Story