దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. వచ్చే ఆరు గంటల్లో తుపానుగా మరే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాన్ ప్రమాదం పొంచి ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది తుపానుగా మారే ప్రమాదం ఉంది. రానున్న మరో ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కిమీ, పుదుచ్చేరికి 470కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల్లో ఉత్తర ఆగ్నేయ దిశలోనే ఇది ప్రయాణించి తమిళనాడు తీరంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో 35కిలోమీటర్ల నుంచి 55కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.