అమరావతికి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలతో కనెక్టవిటీనీ ఏర్పాటు చేయనున్నారు.


రాజధాని అమరావతికి 57కిమీ మేర కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ప్రకటించారు. రూ. 2,245 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్, కోల్‌కత్తా, చెన్నైతో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో అమరావతిని కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. కృష్ణా నదిపై 3.2కిమీ పొడవైన వంతెన నిర్మాణం కూడా చేపట్టనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానం చేస్తూ ఈ రైల్వే లైన్‌ ఏర్పాటు చేయనున్నారు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు మధ్య ఈ కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ, మధ్య, ఉత్తర భారతదేశంతో అనుసంధానం మరింత సులువు అవుతుంది. అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వరసామి ఆలయం, ధ్యాన బుద్ద ప్రాజెక్టుకు వెళ్లే వారికి సులువైన రైల్వే మార్గంగా దీనిని డెవలప్‌ చేయనున్నారు. ఈ ప్రాజెక్టును నాలుగేళ్లల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.

Next Story