విజయవాడలో యూపీ గ్యాంగ్ భారీ దోపిడీ
x

విజయవాడలో యూపీ గ్యాంగ్ భారీ దోపిడీ

ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన సాదాసీదా కూలీలు విజయవాడలో భారీ చోరికి పాల్పడ్డారు. పక్కాప్లాన్ తో సినీపక్కిలో దోపిడీ చేసి దొరికిపోయారు.


ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన సాదాసీదా కూలీలు విజయవాడలో భారీ చోరికి పాల్పడ్డారు. పక్కాప్లాన్ తో సినీపక్కిలో దోపిడీ చేసి దొరికిపోయారు. దొరికిన సొత్తు విలువ దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు చెప్పిన వివరాల ప్రకారం..
వాళ్లంతా చిన్న చిన్న పనులు చేసుకునే రోజువారీ కూలీలు. కానీ, దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలక్ట్రానిక్‌ వేర్‌హౌస్‌లు ఉన్నాయో వీళ్లకు తెలుసు. ముందుగా రెక్కీ నిర్వహించి.. ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు పక్కా ప్లాన్‌తో దోపిడీ చేస్తారు.
తాజాగా విజయవాడ నగరంలో సంచలనం రేపిన రూ.3కోట్ల విలువైన ఐ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ (Vijayawada) పోలీసులు ఏర్పాటు చేసిన సురక్ష పథకం నిందితులను పట్టించింది. వారి నుంచి రూ.2.5కోట్ల విలువైన ఐ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మరికొంత నగద స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన deepchand దీప్ చంద్ ప్రజాపతి కార్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. అతని స్నేహితులైన సునీల్ కుమార్, జయప్రకాష్‌ విజయవాడలోని వేర్‌ హౌసింగ్‌లో ఐఫోన్లు చోరీకి ప్లాన్ చేశారు. ఈనెల 5న చోరీ చేసేందుకు విజయవాడకు చేరుకున్నారు. మొత్తం ఆరుగురు కలిసి దోపిడీ చేసేందుకు స్కెచ్ వేశారు. ముందుగా రెక్కీ నిర్వహించారు. మొదట గోడౌన్ రేకులు కట్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సీసీ కెమెరా వైరును కట్ చేశారు. దర్జాగా రూ.3కోట్ల విలువ చేసే సరుకును దోచేశారు. వేర్‌ హౌస్‌ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా నిందితుల కారును గుర్తించి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కారు బిహార్‌లో ఉన్నట్లు గుర్తించి.. అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. బిహార్ పోలీసుల సాయంతో నిందితులను అరెస్ట్ చేశారు. రెండు గంటలు ఆలస్యమైతే నిందితులు సెల్ ఫోన్లను నేపాల్‌లో విక్రయించే వారని సీపీ రాజశేఖర బాబు తెలిపారు. రంజిత్ అనే వ్యక్తి నిందితులకు గోడౌన్ల వివరాలు అందిస్తారని పోలీసులు గుర్తించారు. విజయవాడ సిటీ పరిధిలో సురక్ష పథకంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతో నిందితులను సులువుగా గుర్తించగలిగారు.
Read More
Next Story