సామాజిక మాధ్యమాల్లో జగన్‌మోహన్‌రెడ్డిపై వినూత్న రీతిలో టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియాలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కనీసం రోజుకో పోస్టర్ అప్‌లోడ్ చేస్తుంటారు. జగన్ మోహన్‌రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాల్లో అయితే వీటి సంఖ్య ఇంకా ఎక్కువుగా ఉంటుంది. తాజాగా ఆదివారం ఒక వెరైటీ పోస్టు పెట్టారు. ప్రత్యేకంగా డిజైన్ చేసి పోస్టు చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని జగన్ ఏ ఆత్మకథలు రాశాడో.. ఏ ప్రేతాత్మ ఆటో బయోగ్రఫీ రాశాడో.. కట్టు కథలు ప్లాన్ చేశాడో తెలియదు కానీ.. పెన్ను పేపర్ల పేరుతో రూ. 9,84 కోట్లు కోటేశాడు. అని మెస్సేజ్ పెడుతూ పోస్టు చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆ పోస్టర్‌లో పెన్‌ను చేతిలో పట్టుకొని పేపర్‌పైన జగన్ ఏదో రాస్తున్నట్లు డిజైన్ చేశారు. తాడేపల్లిలో కూర్చుని క్రైమ్ స్టోరీలు రాశావా? సైకో థ్రిల్లర్స్ రాశావా? ఆత్మల కథలు రాశావా? లేక దొంగ లెక్కలు రాశావా జగన్ రెడ్డి అంటూ ప్రశ్నలు సంధించారు. ఐదేళ్లలో పెన్ను, పేపర్ కోసం రూ. 9.84 కోట్లు ఖర్చు ఎలా అయ్యింది? ప్రజా ధనం అంటే అంత లక్కలేని తనమా జగన్? అంటూ నిలదీస్తూ ఖర్చు పెట్టిన రూ. 9,84,09,679 మొత్తాన్ని కూడా అడుగు భాగంలో చిత్రీకరించారు. చూసిన ప్రతి ఒక్కరు సులువుగా గుర్తించే విధంగా దానిని రెడ్ సర్కిల్‌లో చూపిస్తూ డిజైన్ చేయడం గమనార్హం.