Fake SI in Nellore | ఎస్ఐ వేషంలో వసూల్ రాజా..
x

Fake SI in Nellore | ఎస్ఐ వేషంలో వసూల్ రాజా..

సులభంగా సంపాదించాలని ఎస్ఐ డ్రస్ వేసిన . దర్జాగా వసూళ్లకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వద్ద వెలుగు చూసింది.


వాహనదారుల భయం. పోలీసులతో పరిచయం. ఈ రెండిని అలుసుగా తీసుకున్న ఓ నిరుద్యోగి ఎస్ఐ అవతారం ఎత్తారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్ పరిధిలో సంగం చెక్ పోస్టు వద్ద వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ, పోలీసులకు అడ్డంగా దొరికాడు.

జాతీాయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఆ యువకుడు వేసుకున్న యూనిఫాం చూశారు. కానీ, ఆ నకిలీ ఎస్ఐ చేతికి గరుడబ్యాడ్జీ లేదనే విషయం మాత్రం గమనించకుండా మోసపోయి. డబ్బు సమర్పించుకున్నారు.

నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువ. కలకత్తా హైవే. చెన్నై వెళ్లే మార్గం. ఇటు తిరుపతి మీదుకు బెంగళూరుకు మరో మార్గం. ఒక రోజు రాత్రి మాత్రే కనీసంగా 500 లారీలు సరుకు రవాణా చేస్తుంటాయి. ఈ ట్రాఫిక్ ఓ యువకుడి బుర్రలో మెదిలిన ఆలోచనతో పోలీస్ యూనిఫాం ధరించాడు. ట్రాఫిక్ ఎస్ఐ అవతారం ఎత్తాడు. నిరాటంకంగా వసూళ్లు సాగించడం ప్రారంభించాడు. జాతీయ రహదారులపైనే కాదు. టోల్ ప్లాజాలు, చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ నిఘా నేత్రాలు కూడా ఆ నకిలీ ఎస్ఐ వసూళ్ల పర్వాన్ని పోలీస్ యంత్రాంగం పసిగట్టలేదు. పెట్రోలింగ్ ఉందో లేదో తెలియని స్థితిలో పోలీసులు కూడా ఆ నకిలీ ఎస్ఐ చేతివాటాన్ని గమనించలేకపోవడం ద్వారా పోలీస్ శాఖ డొల్లతనం బయటపడింది.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం చెక్ పోస్టు వద్ద నకిలీ ఎస్ఐ హల్ చల్ ఎలా సాగిందంటే...
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సిద్ధిపురం గ్రామానికి చెందిన హరీష్ కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాధించాలని భావించాడు. మెదడలో వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. పోలీస్ యూనిఫాం. తలపై ఎస్ఐ టోపీ. భుజంపై ఎస్ఐని తలపించే విధంగా రెండు నక్షత్రాలు. కాళ్లకు బూట్లు ధరించాడు. సంగం చెక్ పోస్టు వద్ద మకాం వేశాడు. దారిన వెళ్లే వాహనదారులను నిలపి, రికార్డులు ఇవ్వమని అడగడం. అలవాటుగా మార్చుకున్నాడు. వాహనదారులు పోలీస్ యూనిఫాం చూడగానే కాస్తా కలవరం చెందడం సహజం. వారి ఆ సహజ లక్షణాలను ఆసరాగా చేసుకున్న ఆ నిరుద్యోగి వసూల్లకు పాల్పడడం ప్రారంభించాడు.
డ్రస్సు చూశారు... పట్టీ చూడలేదు..
పోలీస్ యూనిఫాం ధరించిన అల్లూరు మండలం సిద్ధిపురం గ్రామానికి చెందిన హరీష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతి తెలివితో పోలీస్ వేషం వేసి, వాహనదారుల నుంచి వసూళ్లు సాగించడం అలవాటుగా మార్చుకున్నాడు. హరీష్ ధరించిన యూనిఫాం అయితే వాహనదారులు గమనించారు. కానీ అతని యూనిఫాం చేతికి ఉన్న పట్టీ మాత్రం గమనించలేదు. అది ఏపీకి సంబంధించిన పట్టీ కాదనే విషయం గమనించలేకపోయారు. సాధారణంగా నిందితులు ఎంత తెలివిగా వ్యవహరించిన, నేరం చేసే సమయంలో ఏదో ఒక లాజిక్ మిస్ అవుతారు. అదే ఆధారంగా అడ్డంగా దొరికిపోతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సంగం చెక్ పోస్టు వద్ద ఎస్ఐ వేషంలో సాగుతున్న వసూళ్ల పర్వంపై అసలైన పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఆత్మకూరు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చెక్ పోస్టు వద్ద వాహనదారుల రికార్డులు పరిశీలిస్తున్న నకిలీ ఎస్ఐ హరీష్ ను అరెస్టు చేశారు. అతని నుంచి ఎస్ఐ నకిలీ టోపీ, యూనిఫాం, బెల్టు, భుజంపై ఉన్న మూడు సింహాల స్టార్లు, నేం బ్యాడ్జ్, స్వాధీనం చేసుకున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ మీడియాకు చెప్పారు.
పోలీసులతో పరిచయం..
నకిలీ ఎస్ఐ అవతారమెత్తి పోలీసులకు అడ్డంగా దొరికిన హరీష్ కు సంగం, ఆత్మకూరు పట్టణాల్లోని పోలీసులతో ఉన్న పరిచయాలు ఉన్నాయి. దీనిపై ఆత్మకూరు సీఐ వేమారెడ్డి 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి కొన్ని వివరాలు చెప్పారు.
"నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తిన హరీష్ యువకులకు పోలీస్ శిక్షణ ఇస్తున్నట్లు కొన్నాళ్లు కేంద్రం నడిపారు. దీంతో మా సిబ్బందితో పరిచయాలు ఏర్పడ్డాయి. రెండు బ్యాచీలకు శిక్షణ తరువాత కోచింగ్ కేంద్రం కనిపించలేదు" అనే విషయం దర్యాప్తులో తేలిందని సీఐ వేమారెడ్డి చెప్పారు. పరిచయాలు ఉన్నాయి కదా అని, వక్రబుద్ధితో వ్యవహరించి, నకిలీ అవతారం ఎత్తినట్లు ఉంది. అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలను మోసం చేసే వారెవ్వరినైనా, వదిలే ప్రసక్తి ఉండదని సీఐ వేమారెడ్డి హెచ్చరించారు. చెక్ పోస్టు వద్ద సీపీ కెమెరాలు ఉన్నా, నకిలీ ఎస్ఐ హరీష్ అక్రమ వసూళ్లకు పాల్పడడం ఇందులో కొసమెరుపు.
Read More
Next Story