ఆంధ్రప్రదేశ్ లో యుపీ, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన గ్యాంగులు ఎక్కువ అయిపోయాయి. ఏపీకి రావడం చోరీలకు పాల్పడటం వీరికి పరిపాటిగా మారింది.


ఆంధ్రప్రదేశ్‌లో మధ్యప్రదేశ్, యుపీ ముఠాల ఆగడాలు మితిమీరి పోయాయి. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాళాలేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలను పాల్పడుతున్న ముధ్యప్రదేశ్‌కు చెందిన ధార్‌ గ్యాంగ్‌ను ఇటీవలె అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరు దక్షణాది రాష్ట్రాల్లో వీరి మీద 32కుపైగా కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కేరళలో వీరు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారారు. ఇటీవల వీరిని అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు వీరి నుంచి కోట్ల విలువనై వజ్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అలాంటి మరో ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడ నగరంలో రూ. 2.5 కోట్ల విలువన ఐ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాల దొంగతనం కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2.5 కోట్ల విలువైన ఐ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీసులు ఏర్పాటు చేసిన సురక్ష పథకమే చోరీని ఛేదించేలా చేసింది. దొంగలను పట్టించడానికి ఉపయోగపడింది. దొంగతనానికి పాల్పడిన వాళ్లంతా ఉత్తరాదికి చెందిన వారు. యుపీకి చెందిన ముఠా ఈ చోరీకి పాల్పడింది. చోరీకి పాల్పడిన వారంతా చిన్న, చిన్న పనులు చేసుకునే రోజు వారీ కూలే. వీరంతా ఓ ముఠాకు చెందిన వారే. చాలా పకడ్బందీగా చోరీలకు పాల్పడుతుంటారు. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎలక్ట్రానికి వేర్‌హౌస్‌లు ఉన్నాయో తెలుసుకొని వాటి వివరాలు సేకరిస్తారు. ఆయా ప్రాంతాల్లో ముందుగా రెక్కీ నిర్వహిస్తారు. తర్వాత రంగంలోకి దిగుతారు. ఎవరికీ అనుమానాలు రాకుండా చోరీలు చేస్తారు.
ఫిబ్రవరి 6న విజయవాడ ఎనికేపాడులో గద్దె దుర్గ ప్రసాదరావుకు చెందిన ఇన్‌గ్రామ్‌ మైక్రో ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ వేర్‌హౌస్‌ గోడౌన్‌లో కూడా ఇదే విధంగా ఈ యుపీ ముఠా దొంతగనానికి పాల్పడింది. పైన ఐరన్‌ రూఫ్‌ షీట్‌ను కట్టర్‌తో కట్‌ చేసి దీనిలోకి చొరబడ్డారు. తర్వాత సీసీ కెమేరాల కనెక్షన్‌ను కట్‌ చేశారు. అట్టపెట్టెలోని రూ.2,51,23,072,86 విలువ గల 271 ఐ ఫోన్లు, వివిధ రకాల 373 ఎలక్ట్రానిక్‌ పరికరాలను చాకచక్యంగా దొంగిలించారు. దీని మీద వేర్‌హౌస్‌ ఇన్‌చార్జి ఎండీ ఫరూక్‌ అహ్మద్‌ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పటమట పీఎస్‌లో కేసు నమోదు చేసుకున్నారు. తర్వాత ఈ కేసును సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులకు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ ఆధారాలను సేకరించారు.
ఆ ప్రాంతాల్లోని సీసీ కెమేరాలను పరిశీలించారు. తెల్ల మారుతీ ఎర్టిగా కార్‌ అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. తర్వాత ఈ కారు వివరాలను సేకరించారు. ఇది ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్‌గా గుర్తించారు. దొంగతనం వివరాలను ఆ రాష్ట్ర పోలీసులకు తెలియజేశారు. అక్కడకు వెళ్లిన విజయవాడ పోలీసులు ఉత్తప్రదేశ్‌తో పాటు బీహార్‌ పోలీసుల సహకారం తీసుకున్నారు. యుపి 62 సీకే 1404 కారుతో పాటు అందులో ప్రయాణిస్తున్న నేరస్తులను అరెస్టు చేశారు.
వీరితో పాటు విజయవాడ గోడౌన్‌లో దొంగతనం చేసిన ఐఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కోర్టులో వారిని హాజరు పరిచారు. వారి అనుమతులతో నేరస్తులను, దోపిడీ సొమ్మును విజయవాడకు తరలించారు. అయితే దోపిడీ చేసిన ఐఫోన్లు, ఇతర సామాగ్రిని నేపాల్‌లోని ఖాట్మండులో అమ్మేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ లోపల విజయవాడ పోలీసులు వారిని ఛేదించి పట్టుకున్నారు. మొత్తం డీప్‌ చంద్‌ ప్రజాపతి, మాయ జయప్రకాష్, సునీల్‌కుమార్‌ సరోజ్, బ్రిజేష్‌ కుమార్‌ ఉగ్ర, మిథిలేష్‌కుమార్, సురేంద్రకుమార్‌ పటేల్, రంజిత్‌ ఏడుగురు ఈ చోరీకి పాల్పడగా రంజిత్‌ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. తక్కిన వారిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు అభినందించారు.
Next Story