అమరావతి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మంగళవారం ఆయన అమరావతి సచివాలయంలో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు, అధికారులకు దిశా నిర్థేశం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకు గాను వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు అందుకున్నామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 2081 కోట్ల వేతన బకాయిలు జమ చేశామన్నారు. 2024–25 ఏడాదికిగాను రూ.4,500 కోట్ల నిధులతో పనులకు గ్రామ సభల ఆమోదం తెలిపాయన్నారు. 30 వేల పనులకి పల్లె పండుగలో శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఏడాదిలో కనీసం 100 రోజులు వేతన ఉపాధి, మెరుగైన జీవనోపాధి కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజురైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజ ఉంటుందన్నారు. ఉపాధి, ఆర్థిక సంఘం నిధులతో సంక్రాంతికల్లా పూర్తి చేయడమే లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, డ్వామా పీడీలు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఉపాధి ఏపీవోలు పాల్గొన్నారు.
Next Story