విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి... విడిపోయిందా? తెగిపోయిందా?
x
ప్రధాన భాగం నుంచి విడివడిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి... విడిపోయిందా? తెగిపోయిందా?

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విశాఖ ఫ్టోటింగ్ బ్రిడ్జి సందర్శకులకు అనుమతించాలనుకున్న రోజే సముద్రంలోకి విడివడింది. దీనిపై రకరకాల ఊహగానాలు వస్తున్నాయి.


(తంగేటి నానాజీ విశాఖపట్నం)


“ఆదిలోనే హంసపాదు”
విశాఖ బీచ్ లో అట్టహాసంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్(అలలపై తెలియాడే వంతెన) ఒక్కరోజులోనే తెగిపోయింది. పర్యాటకులను ఆకర్షించేందుకు, అహ్లాదపరిచేందుకు విశాఖ మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్ధీఏ) ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి పర్యాటకులను అనుమతించాల్సిన రోజే తెగిపోయింది.
రెండు మొక్కలై ఒక ముక్క సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జి తెగిన సమయంలో పర్యాటకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అలల ఉధృతి ఎక్కువగా ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఇది ట్రయల్ రన్ అని, సాంకేతిక పరిశీలనలో భాగంగా తామే ఆ బ్రిడ్జ్ ను వేరు చేసామని చెబుతున్నారు.
“వీఏంఆర్ఢీఏ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు”
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రాజెక్టును వీఎంఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కోటి 60 లక్షల రూపాయల నిధులతో విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఏటా 15 లక్షల రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.


అలలపై తేలియాడే వంతెన పర్యాటకులకు ఓ మధురానుభూతిని మిగులుస్తుంది అనడంలో సందేహం లేదు. అలలపై నడుస్తూ బీచ్ అందాలతో పాటు విశాఖ నగర అందాలను వీక్షించే అవకాశం పర్యాటకులకు కల్పించారు. పర్యాటకుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతలో బ్రిడ్జి రెండు ముక్కలు కావడం విమర్శలకు దారి తీసింది. ఇది మాక్ డ్రిల్ అంటూ కలెక్టర్ వివరణ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియా లోనూ ప్రముఖ పత్రికల్లోనూ కథనాలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. దీంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అప్రతిష్ట పాలయ్యింది.
“ఏది నిజం”
విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రెండు ముక్కలై ఒక ముక్క దూరంగా విడిపోవడం తీరం నుంచి చూస్తే అందరికీ కనిపించే దృశ్యం.. దీంతో ప్రతి ఒక్కరూ ప్రారంభించిన మరుసటి రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అలల ఉధృతికి మొక్కలు అయిపోయిందని భావిస్తున్నారు.



ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రమాద వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేయడంతో జిల్లా కలెక్టర్, వీఎంఆర్డీఏ కమిషనర్ మల్లికార్జున్ స్పందించారు. ఇది ప్రమాదం కాదని మాక్ డ్రిల్ లో భాగంగా తామే బ్రిడ్జ్ ను విడదీశామని వివరణ ఇచ్చారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగి పడటం ప్రమాదమా? ప్రమాదాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ వత్తిడితో కలెక్టర్ మాక్ డ్రిల్ అంటూ మాయ చేస్తున్నారా తెలియాల్సి ఉంది.



Read More
Next Story