వైజాగ్ తేలే దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని: వైసీపీ కొత్త ప్లాన్?
x
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వైజాగ్ తేలే దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని: వైసీపీ కొత్త ప్లాన్?

హైదరాబాద్ మరికొన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండబోతుందా? మూడు రాజధానులపై సీఎం జగన్ ఏమనుకుంటున్నారు? ఈ ప్రతిపాదనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా?


అమరావతి నుంచి రాజధానిని బయటకు తరలిచేందుకు చేసిన ప్రయత్నాలేవీ సఫలంకాకపోవడంతో ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి కొత్త వ్యూహం గురించి యోచిస్తున్నట్లు సమాచారం.

రాజధాని వికేంద్రీకరణ అంటూ ముూడురాజధానులు ప్రకటించారు. కర్నూలులో న్యాయరాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అని ప్రతిపాదించారు. అయితే, ఇది నెరవేరలేదు. అమరావతే రాజధానిగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఆయన కొత్త రాజధాని వ్యూహం రూపొందిస్తున్నారు.వివరాలు:

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపుపై కేంద్రం పెట్టిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ తో ముగియబోతోంది. ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా మారబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదును కొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా ఉత్తర్వులు ఇమ్మని కేంద్రాన్ని కోరేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. వైజాగ్‌లో పరిపాలన రాజధాని ఏర్పాటు అయ్యే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని కొనసాగించే అంశంపై కేంద్రంతో చర్చించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి హింట్ ఇచ్చారు.

ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, పైగా ప్రస్తుతం రాజధాని నిర్మాణం కొనసాగించే పరిస్ధితులు లేవని కేంద్రానికి చెప్పేందుకు వైసీసీ ప్రభుత్వం సిద్దమవుతోంది. వీటిపై ముందుగా రాజ్యసభలో ప్రస్తావించి అనంతరం కేంద్రం ఒప్పుకోకపోతే లాబీయింగ్ చేసేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ కూలిపోనుందంటూ ప్రకటన చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై కచ్చితంగా ప్రతికూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తిన్నాయి.

Read More
Next Story