ముఖేష్ కుమార్ మీనా

నేటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదు. ప్రభుత్వ వెబ్ సైట్స్ నుంచి ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు తొలగించాలి. 24 గంటల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలి.


ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనునట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఎపి సెక్రటేరియట్ నుంచి ఆయన మాట్లాడారు. ఏపీలో మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఏపీలో 46 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరుగుతుంది.

85 ఏళ్లు దాటిన వారికి ఓటు ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. వీరు నోటిఫికేషన్ వెలువడిన అయిదు రోజుల లోపు 12 D దరఖాస్తు చేసుకున్న వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు పంపిణీ చేస్తారు.. ఓటరు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డులు చూపించి ఓటు వినియోగించుకోవ్చు. ఇదే విధంగా అంగవౌకల్యం 40 శాతం మించి ఉన్న వారు కూడా ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు.

ఈ మధ్య కేంద్ర న్యాయ శాఖ పోస్టల్ బ్యాలెట్ ఆశిస్తున్న సీనియర్ సిటిజన్ నిర్వచాన్ని సవరించింది. పాత నియమాల ప్రకారం 80 ఏళ్లు పైబడిన వాళ్లకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే వారు. ఇపుడు దీనిని 80 నుంచి 85 ఏళ్లు పైబడిన వారికి పెంచారు. అంటే 85 సంవత్సరాలు పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఎంచుకోవడానికి అర్హులని 1961 ఎన్నికల నియమావళిని సవరించింది.

మార్చి 10, 2024 నాటికి దేశంలో 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు 81,87,999 మంది ఉన్నార. వారూ 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 2,18,442 మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది.

ఆంధ్రా ఎన్నికల విశేషాలు

ఏపీలో తాజా ఓటర్ల సంఖ్య 4,09,37,352 ఇందులో సర్వీస్ ఓటర్లు సంఖ్య 67393

రాష్ర్టంలో 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన ఓటర్లు 9,01,863 మంది వున్నారు

ఏపీలో జనవరి ఒకటి నాటికి 4.07 కోట్ల మంది ఓటర్లు ఉంటే. తాజాగా 1,97,000 మంది పెరిగారు


ఏపీలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.


ఇందులో 179 పోలింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తాం.


పోలింగ్‌కు ఐదు రోజుల ముందు ఓటర్ల స్లిప్ కూడా పంపిణీ చేస్తాం.


85 సంవత్సరాలు పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం.



3.82 లక్షలు ఉద్యోగులను ఎన్నికల కోసం‌ వినియోగిస్తాం.


ఏపీ ఎన్నికలకు 50 మంది జనరల్ అబ్జర్వర్స్ ఉంటారు.


ప్రతి అసెంబ్లీకి మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఉంటాయి.

50 శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు.


నేటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ అమలుల్లో ఉంటుంది.


బహిరంగ ప్రదేశాలలో 48 గంటలలోపు పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలి.


ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి వచ్చే 24 గంటలలోపు అన్ని ఫొటోలు తీసేయాల్సి ఉంటుంది.


కొత్త పనులకు పర్మిషన్ లేదు.. జరుగుతున్న పనులకు ఇబ్బంది లేదు.


మంత్రులు సమీక్షలు చేయకూడదు, మంత్రులకు ప్రోటోకాల్ ఉండదు.


కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేయడానికి వీలు లేదు.

Next Story