వక్ఫ్ చట్టం రక్షణకు జాయింట్ యాక్షన్ కమిటీ
x

వక్ఫ్ చట్టం రక్షణకు జాయింట్ యాక్షన్ కమిటీ

భారతదేశంలో లక్షలాది కోట్ల రూపాయల వక్స్ సంపదను కాపాడే లక్ష్యంగా కడప జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ని త్వరలో ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి.


భారతదేశంలో లక్షలాది కోట్ల రూపాయల వక్స్ సంపదను కాపాడే లక్ష్యంగా కడప జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ని త్వరలో ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. అలాగే కేంద్ర రాష్ట్రాల్లోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించాయి. కడప రహమతీయ ఫంక్షన్ హాల్ లో శనివారం ఆప్ కి ఆవాజ్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జేఏసీ కన్వీనర్ బాబు భాయ్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా రక్త చట్టానికి 40 సవరణలు ప్రతిపాదించడం దారుణమన్నారు. అంతే కాకుండా వక్స్ బోర్డు కౌన్సిల్లో ముస్లిం ఇతర సభ్యులను నియమించాలని మైనార్టీలను అణగదొక్కడమేనని విమర్శించారు. జిల్లా కలెక్టర్లకు విచక్షణాధికారులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వాధికారాలను పూర్తిగా తగ్గించడంతో దేశంలోని లక్షలాది కోట్ల సంపదను దురాక్రమణ చేసేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. అంతేకాకుండా ఇప్పటికీ దురాక్రమణలో ఉన్న ఆస్తులను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కాగా వర్క్ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఏకంగా 40 సవరణలు తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఇండియా విపక్ష కూటమి సభ్యులు తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించారన్నారు. వీలైనంత త్వరగా భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టి సంకీర్ణ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పిస్తామన్నారు. మైనార్టీల అభివృద్ధికి దేశంలో మూడో స్థానంలో సంపద కలిగిన బోర్డులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే తలవంచబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రజాసంఘాల నేతల మైనుద్దీన్ , జాకీర్ మౌలానా, హమీద్ మౌలాలి ఆప్ కి ఆవాజ్ నగర అధ్యక్షులు అబీద్ హుసేన్ అబ్దుల్లా మత గురువులు సిరాజ్ బుఖారి బషీర్ తదితరులు పాల్గొన్నారు

Read More
Next Story