యూ ట్యూబ్‌లో పోర్న్ వీడియోలు చూడటం ఒక బలహీనత అని.. అదొక అడిక్షన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలు వాటిని చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్ల పట్ల, ల్యాబ్ ట్యాప్‌ల పట్ల పిల్లలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ చూడటం కూడా ఒక వ్యసనమని అన్నారు. బాపట్లలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆయన ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్లు, ల్యాబ్ ట్యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిల్లలకు, తల్లిదండ్రులకు సూచించారు. ఎక్కడ చూసినా సైబర్ నేరగాళ్లు తయారయ్యారు. వారు పిల్లలతో ఫ్రెండిషిప్‌లు చేయడం, మాయ మాటలు చెప్పడం, మభ్యపెట్టడం, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. స్నేహమనే పేరుతో మోసం చేస్తున్నారు. అశ్లీలమైన ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. టెక్నాలజీ కూడా అవసరం. అదే సమయంలో సైబర్ నేరగాళ్లు చెలరేగి పోతున్నారు. మోసం చేస్తున్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఇరవై నాలుగు గంటలూ సెల్ ఫోన్ చూడటం కూడా వ్యసనమే అన్నారు. యూట్యూబ్‌లో పోర్న్ వీడియోలు చూడటం ఒక అడిక్షన్.. అదొక బలహీనత అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువులు పాడైపోతాయి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. టీచర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ కూడా చాలా ప్రమాదకరమన్నారు. డ్రగ్స్ అనేవి పెద్ద మత్తు. పెద్ద వ్యసనం అన్నారు. ఆ వ్యసనంలో పడితే మామూలు మనిషిగా మారడం చాలా కష్టం. ఆ వ్యసనం సర్వ నాశనం చేస్తుందని, వీటి పట్ల పిల్లలు, పేరెంట్స్, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ద పెడితే వారి జీవితాలు బాగుపడుతాయి. అలాంటప్పుడు వారి చదువు ఎలా ఉందనేది చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంది. చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జి ఎకానమీలో చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. వారు పెరిగి ప్రయోజకులైతే దేశం అభివృద్ధవుతుంది. ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఇది మీ పిల్లలకు, మీ కుటుంబాలను రావాలంటే చదువు అనేది చాలా కీలకం. అందుకనే ఈ రోజు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో దేశంలో అతి పెద్ద తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. కసీనం మీలో ఒక ఆలోచన విధానంలో మార్పు తీసుకొని రావడానికి మీ పిల్లలను పెంచి పోషించడమే కాకుండా వారి మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులను చేయడం మీ బాధ్యత అని తల్లిదండ్రులకు సూచించారు. అలా ప్రయోజకులను చేయాలంటే పిల్లలను బాగా చదవించాలి. అలా బాగా చదివించాలంటే స్కూలుకు వచ్చినప్పుడు పిల్లలు ఏమి చేస్తున్నారో కూడా మీకు తెలిస్తే దాని వల్ల మీకు పిల్లలకు కూడా టీచర్స్‌కి సహకరిస్తారని అన్నారు. చిన్న పిల్లలకు కాబట్టి వారికి ఇప్పుడు తెలియదు. బాగా చదువుకుంటే వారి జీవితాలు బాగుపడుతాయని పేరెంట్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు.