విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న విద్యాసంస్థలపై శాసన సభ్యులు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ అడిగిన ప్రశ్నలపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ మాట్లాడారు.
రెండేళ్లలో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తిచేస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ యూనివర్సిటీ స్థలం మార్చి, ఐదేళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేశారని, రాజకీయంగా తమకు మంచిపేరు వస్తుందనే జగన్ ప్రభుత్వం ఆ స్థలాన్ని మార్చారని అన్నారు. 2019లో నిర్ణయించిన స్థలంలోనే యూనివర్శిటీని నిర్మిస్తామని, వచ్చే రెండేళ్లలో దానిని పూర్తి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న విద్యాసంస్థలపై శాసన సభ్యులు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి లోకేష్ సమాధానమిస్తూ వివరాలను వెల్లడించారు. 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సెక్టార్ వైజ్ ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.