మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని అందులో సందేహం లేదని సీఎం చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మరో సారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది చట్టాన్ని ఉల్లంఘించారని, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో త్వరలోనే రెడ్‌బుక్ మూడో చాప్టర్‌ను కూడా తెరుస్తామన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్నిఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువగళం పాత్ర యాత్ర చేస్తున్న సయమంలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెడ్‌బుక్‌కు భయపడుతున్నారని అన్నారు.
గుడ్‌బుక్ తీసుకొస్తానని చెబుతున్న జగన్‌కు ఆ బుక్‌లో ఏమి రాయాలో అర్థకం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్‌ఆర్‌ఐలు కష్టకాలంలో టీడీపీకి అండగా నిలబడ్డారని, గత ప్రభుత్వం తాలూకు కేసులకు భయపడకుండా నిలబడ్డారని అభినందించారు. ఎన్‌ఆర్‌లను ఇక నుంచి ఎంఆర్‌ఐలు అని పిలుస్తానని, ఎంఆర్‌ఐలు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్ అని అర్థమని లోకేష్ అన్నారు. ఏపీలో కూటమి గెలుపునకు ఎన్‌ఆర్‌ఐలు కష్టపడి పని చేశారని, ఈ విజయం ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారిదన్నారు. ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ సమయంలో హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. మంత్రి లోకేష్‌తో పాటు ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, ఎన్‌ఆర్‌ఐ నాయకుడు కోమటి జయరాం, ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.