'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ఎడిషన్ ప్రారంభం
ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ప్రారంభమైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. భారత దేశ సమాఖ్య తత్వాన్ని ప్రతిబింబించడానికే..
ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ప్రారంభమైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ది ఫెడరల్ గ్రూపు నుంచి వచ్చిన మూడో రాష్ట్ర ఎడిషన్ ఇది. అన్ని వైపుల నుంచి వచ్చిన స్పందన, అందిన ప్రోత్సాహం, ఉత్సకత, ప్రేరణే 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్' ప్రారంభానికి మూలకారణం. భారత దేశ సమాఖ్య తత్వాన్ని ప్రతిబింబించాలన్న 'ది ఫెడరల్' ఆంకాక్షను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాల సమున్నత, న్యాయమైన ఆకాంక్షలను, దేశ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ మూలస్తంభాలైన రాష్ట్రాల న్యాయమైన వాటాలో సమాచార స్రవంతి కూడా ఉండాలన్న లక్ష్యంతో ఈ ఎడిషన్ ను ప్రారంభించాం.
2019 మార్చిలో ఇంగ్లీషు ఎడిషన్ ను ప్రారంభించినప్పటి నుంచి ది ఫెడరల్ తన ప్రత్యేకతను నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. వార్తలు ఇచ్చే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతోంది. జర్నలిజంలో తనదైన ముద్రను వేసేందుకు తపన పడుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా...
నిష్పక్షపాత వార్తలు ఇచ్చేందుకు ఇంతకు ముందు ది ఫెడరల్ తెలంగాణ ఎడిషన్ ప్రారంభించిన మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఎడిషన్ ను ప్రారంభించాం. రెండు ఎడిషన్లు తెలుగులోనే ఉంటాయి. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా సమగ్ర కవరేజీని అందిస్తాయి. దశాబ్దం కిందట రెండు రాష్ట్రాలుగా విడివడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వేర్వేరుగా ఎడిషన్లు ఉండడం వల్ల ఆయా రాష్ట్రాల సమస్యలపై ప్రత్యేక దృష్డి కేంద్రీకరించి వార్తలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన విభిన్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై కథనాలు ఇచ్చేందుకు ఈ కొత్త ఎడిషన్ తోడ్పడుతుంది అని ది ఫెడరల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్.శ్రీనివాసన్ చెప్పారు.
రాష్ట్రాల ఎడిషన్లకు తలమానికమైన ది ఫెడరల్ ఇటీవలే కన్నడ ఎడిషన్ ను కూడా ప్రారంభించింది. ఇంగ్లీషు సహా అన్ని ఎడిషన్లలో సాధారణ అంశాలన్నీ మామూలుగానే ఉంటాయి. ఇటీవలే ది ఫెడరల్ కన్నడ ఎడిషన్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడిది మూడో రాష్ట్ర ఎడిషన్.
మా ప్రధాన లక్ష్యమేమిటంటే...
ది ఫెడరల్ ముఖ్యోద్దేశమేమిటంటే.. సాధారణ ఇతివృత్తాలను అందరూ అందిస్తారు. ది ఫెడరల్ మాత్రం రాష్ట్రాలకు సంబంధించిన కీలక వార్తలను అందించడంతో పాటు ఏదైనా వార్తా కథనానికి సంబంధించిన అన్ని కోణాలు ఇవ్వడంతో పాటు నిష్పక్షపాతంగా, సమగ్రతను అందిస్తుంది. రాష్ట్ర నిర్ధిష్ట భాషలో ఆ వార్తా కథనాన్ని అర్ధవంతంగా ఇవ్వడం ఫెడరల్ ముఖ్యోద్దేశం. కొన్ని నెలలుగా పని చేస్తున్న ఇతర ఎడిషన్లకు వస్తున్న ప్రోత్సాహం, స్పందనను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ను వేరుగా తేవాలన్న నిర్ణయానికి వచ్చాం. రాబోయే రోజుల్లో మరికొన్ని కొత్త ఎడిషన్లు కూడా ప్రారంభించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్‌ను చూడండి.