శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ముగుర్గు భక్తులు, తూర్పుగోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.


మహాశివరాత్రి పర్వదినం రోజున ఆంధ్రప్రదేశ్‌లో విషాధం చోటు చేసుకుంది. ఒక చోట పవిత్ర స్నానాలకు వెళ్లిన ముగ్గురు భక్తులు గల్లంతు కాగా, సరదాగా ఈతకు వెళ్లిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఒక ఘటన శ్రీశైలంలో చోటు చేసుకోగా, తూర్పు గోదావరి జిల్లాలో రెండో దుర్ఘటన చోటు చేసుకుంది. రెండు చోట్ల గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. గల్లంతైన వారి కోసం గాలింపులు చేపట్టారు. శివరాత్రి పర్వదినం రోజు ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో శ్రీశైలం ఆలయ పరిసర ప్రాంతాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

శివరాత్రి పర్వదినం సందర్భంగా స్నేహితులైన ముగ్గురు భక్తులు శ్రీశైలం పుణ్యక్ష్రేతానికి వెళ్లారు. పవిత్ర స్నానం చేసి స్వామి, అమ్మ వార్లను దర్శించుకొని వారి అనుగ్రహం పొందాలని ఆశించారు. బుధవారం వేకువజాము నుంచే భక్తులు శ్రీశైలం స్వామి, అమ్మ వార్ల దర్శనానికి పోటెత్తారు. పుణ్యస్నానాలను ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామి, అమ్మ వార్లను దర్శించుకుంటున్నారు. ఇదే క్రమంలోనే శ్రీశైలం దర్శనం కోసం వెళ్లిన ఆ ముగ్గురు భక్తులు పవిత్ర స్నానాలు చేసి స్వామి, అమ్మ వార్లను దర్శించుకోవాలని భావించారు.

అందులో భాగంగా లింగాల గట్టు వద్ద పవిత్ర స్నానాలు ఆచరించేందుకు నీటిలోకి దిగారు. స్నాన్నం చేస్తుండగా స్నేహితులైన ఈ ముగ్గురు భక్తుల్లో ఒకరు నీటిలో మునిగిపోయారు. మునిగి పోతున్న స్నేహితుడుని రక్షించేందుకు ఇద్దరు స్నేహితులు వెళ్లగా ఆ ఇద్దరు కూడా నీటిల్లో మునిగిపోయి గల్లంతయ్యారు. దీనిని గమనించిన తోటి భక్తులు ఒక్క సారి షాక్‌ అయ్యారు. దానిలో నుంచి తేరుకొని ఈ ప్రమాదాన్ని గుర్తించిన తోటి భక్తులు శ్రీశైలం ఆలయ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. నీటిలో మునిగిపోయిన స్నేహితులైన ముగ్గురు భక్తులను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. గజ ఈతగాళ్లు గల్లంతైన ఆ ముగ్గురు భక్తుల కోసం జల్లెడపడుతున్నారు. నీటిలో మునిగిపోయిన భక్తుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

మహాశివరాత్రి పండుగ రోజు తూర్పు గోదావరి జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. శివరాత్రి పండుగతో పాటు బుధవారం సెలవు కావడంతో ఐదుగురు యువకులు సరదాగా ఈత కోసం గోదావరి నదిలోకి వెళ్లారు. సరదా ఈతకు వెళ్లిన ఈ ఐదుగురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో ఈ విషాధ సంఘటన చోటు చేసుకుంది. గల్లంతైన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. అటు పోలీసులు ఇటు గజ ఈత గాళ్ల సహాయంతో పరిసర ప్రాంతాల్లో గల్లంతైన ఐదుగురు యువకుల కోసం జల్లెడపడుతున్నారు.

గోదావరిలో గల్లైంతైన ఐదుగురు యువకులు తిరుమలశెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, అనిశెట్టి పవన్, గర్రె ఆకాష్, పడాల సాయిలుగా గుర్తించారు. వీరు గోదావరి నదిలో గల్లంతైనట్లు విషయం తెలుసుకున్న ఆ ఐదుగురు యువకుల కుటుంబాల్లో విషాధం నెలకొంది. ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గల్లంతైన యువకులు అందరూ కొవ్వూరు, తాళ్లపూడి, రాజమండ్రిలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, పైగా వీరందరూ ఒకే గ్రామానికి చెందిన వారు. దీంతో ఆ గ్రామంలో ఒక్క సారిగా విషాధం అలుముకుంది. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, డిఎస్పీ దేవకుమార్ ల ఆధ్వర్యంలో గాలింపులు మమ్మరంగా సాగుతున్నాయి. గల్లంతైన యువకుల్లో దుర్గాప్రసాద్ డెడ్ బాడీ దొరకగా.. తక్కిన వారి కోసం తీవ్రంగా గాలింపులు చేపట్టారు.

Next Story