వైఎస్సార్సీపీ ఇన్చార్జిలు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎవరైనా బాగోలేదన్నారో వారికి మూడినట్లే. ఇన్చార్జిల దెబ్బకు బలవుతున్న వారిలో ఎక్కువమంది పోలీసులు వుండటం విశేషం.


మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన దౌర్భాగ్యం ఇది. మీదగ్గర డబ్బుందా? పాలకులు కావాలనుకుంటున్నారా? అధికార పార్టీ టిక్కెట్ ఖరారు చేసిందా? అయితే మీ పంట పండినట్లే. మీ చుట్టూ పోలీసులు, మందీ మార్బలం. జైకొట్టేవారు, అభినందించేవారు, సన్మనాలు చేసే వారు ఒకరేమిటి సవాలక్ష మంది మీ వెంట వుంటారు. ఇక మీరు చేయాల్సింది అధికార పార్టీ టిక్కెట్ దక్కించుకోవడమే. ఈ ఆర్భాటం ఐదేళ్లు ఉంటుందో, ఉండదో చెప్పలేము కానీ ప్రస్తుతానికి మాత్రం ఉంటుంది.

గెలవకపోయినా పెత్తనం వారిదే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 నియోజకవర్గాల్లలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గాల్లో పెత్తనం మాత్రం వైఎస్సార్సీపీ ఇన్చార్జిలే చేస్తున్నారు. అక్కడ గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు డమ్మిలుగా మారారు. కారణం ఆ నియోజకవర్గాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకుండా పోవడమే. ఒకవేళ ఏదైనా సాయం అందించాలనుకుంటే ఇన్చార్జిల ద్వారానే అందిస్తున్నారు. అంటే అధికార పార్టీకి ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట కూడా గెలిచిన వారితో సమానమేనని చెప్పొచ్చు.

ప్రతిపక్షంలో తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు మా ఖర్మ ఇంతే అనుకుంటున్నారు తప్ప రాజ్యాంగం పరంగా నియోజకవర్గానికి కావాల్సిన సౌకర్యాలు సాధించే విషయంలో సీఎంను ప్రశ్నించడం కానీ, కనీసం అడగటం కానీ చేయడం లేదు. అది వారి భయమో లేక భక్తో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా జరుగుతున్నది ఇదే కాబట్టి చెబుదామనిపించి చెప్పాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు చెబుతున్నారనుకుంటున్నారా? ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన అంశం కాబట్టి.


బదిలీ స్థానాల్లో ఇన్ చార్జిల హవా

వైఎస్సార్సీపీ ఓటమి చెందిన నియోజకవర్గాలే కాకుండా, ఇటీవల జరిగిన రాజకీయ మార్పుల్లో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ట్రాన్స్ ఫర్స్ కూడా చెప్పుకోదగ్గ అంశమే. ఉదాహరణకు మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ నియోజకవర్గం ఎర్రగొండపాలెంను తీసుకుందాం. సురేష్ ను నియోజకవర్గ బదిలీల్లో భాగంగా కొండపికి బదిలీ చేశారు. ఆ స్థానంలో ప్రజలతో ఎటువంటి సంబంధం లేని తాడిపర్తి చంద్రశేఖర్ ను ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ అంటూ నియమించారు. నిజానికి మే నెల వరకు సురేశ్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. ఆయన కొండెపికి బదిలీ ఎప్పుడయ్యడో అప్పటి నుంచే ఎర్రగొండపాలెంను మంత్రి మరిచిపోయాడు. ఇప్పుడు చంద్రశేఖర్ ఎమ్మెల్మేగా పెత్తనం చెలాయిస్తున్నాడు. ఇటువంటి వైచిత్రి ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు.

ఇక్కడ మరో విషయం కూడా మనం ప్రస్తావించవచ్చు. ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గా ఎరిక్షన్ బాబు ఉన్నాడు. ఆయనకు మాత్రం దిక్కు దివానం లేదు. రాత్రులు చెంచుగూడేలకు వెళ్లినా ఏ పోలీసు పట్టించుకోవడం లేదు.


కారు ముందు సెక్యూరిటీగా పోలీస్ ఉండాల్సిందే..

ఈయనకు సకల సౌకర్యాలు కావాల్సి ఉంది. ఆ సౌకర్యాలు ఏమిటనుకుంటున్నారా? పోలీస్ సెక్యూరిటీ ప్రధానమైంది. ఆయన కారుకు ముందు ఒక పోలీసు వాహనం కుయ్.. కుయ్.. మంటూ సైరన్ తో ముందు వెళ్ళాలి. మధ్యలో చంద్రశేఖర్ కారు ఉంటుంది. ఆ తరువాత ఆయన మందీ, మార్బలం కార్లలో ఉంటారు. ఈ దేశంలో ప్రధాన మంత్రికి మినహా ఏ ఒక్కరికీ ట్రాఫిక్ క్లయరెన్స్ చేయాల్సిన అవసరం లేదనే నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో ఈ నిబంధనలు ఏవీ పనిచేయడం లేదు. పైగా చంద్రశేఖర్ ఎక్కడ తిరిగినా ఆయనతో పాటు పోలీసులు కూడా ఉండటం విశేషం. ఒకవేళ పోలీసు వాహనం ముందు వెళ్లకుంటే ఆ స్టేషన్ లో ఎవరు పనిచేస్తున్నారో కనుక్కుని మరుసటి రోజు బదిలీ బహుమానంగా ప్రభుత్వం పంపిస్తున్నది. దీనిని దౌర్భాగ్యం అనక ఏమంటారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

సెక్యూటరీగా ఉండలేదని బదిలీల బహుమానం

చంద్రశేఖర్ వై పాలెం ఇన్ చార్జిగా నియమితులైన వెంటనే ఎర్రగొండపాలెం చేరుకున్నారు. గతంలో యర్రగొండపాలెం ఎస్ఐగా పనిచేసిన రాజేష్ చంద్రశేఖర్ కోరిక మేరకు సెక్యూరిటీగా కానిస్టేబుల్ ను పంపడంతో పాటు అప్పుడప్పుడు ఎస్ఐ కూడా సెక్యూరిటీ కార్యక్రమాలు చూసేవాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన డీఎస్పీ రాజేష్ ను మార్చి త్రిపురాంతకం ఎస్ఐగా పనిచేస్తున్న సుదర్శన్ ను ఎర్రగొండపాలెం ఎస్ఐగా వేయించుకున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ కు సుదర్శన్ నమ్మిన బంటుగా ఉంటున్నాడని స్థనాకులు చెబుతున్నారు. నిజానికి రాజేష్ మూడు నెలల క్రితమే పొన్నలూరు నుంచి ఎర్రగొండపాలెం ఎస్ఐగా వచ్చారు. మూడు నెలలకే బదిలీ బహుమానంగా రాజేష్ కు అందింది, ఇక పెద్దారవీడు ఎస్ఐ పరిస్థితి కూడా అంతే. గతంలో పనిచేసిన ఎస్ఐ పులి రాజేష్ ను వీఆర్ నుంచి ఎర్రగొండపాలెం ఎస్ఐగా నియమించారు. చంద్రశేఖర్ కు సెక్యూరిటీ కల్పించడం లేదని రాజ్ కుమార్ ను బదిలీ చేయించడంలో చంద్రశేఖర్ సఫలీక్రుతుడయ్యాడు.

Next Story