పవన్ గెలుపు కోసం ఆయన వీరాభిమానులు ఏమి చేస్తున్నారంటే..
x

పవన్ గెలుపు కోసం ఆయన వీరాభిమానులు ఏమి చేస్తున్నారంటే..

అభిమానం కొండలు గుట్టలు ఎక్కిస్తోంది. పవన్ కల్యాణ్ గెలుపు కోసం ఆయన వీరాభిమానులు పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరుమల మెట్లు ఎక్కి మొక్కులు చెల్లిస్తున్నారు.


మనకు ఇష్టమైన వారిని అభిమానించడం రకరకాల రూపంలో ఉంటుంది. దేవుళ్లను కొలిచే తీరు కూడా వివిధ రూపాలలో ఉంటుంది. అభిమానానికి హద్దులంటూ ఏమీ ఉండవు. ఇప్పుడు సరిగ్గా జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ విషయంలోనూ అదే జరిగింది. ఆయన అభిమాని ఒకరు పవన్ కల్యాణ్ గెలవాలని కోరుకుంటూ మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన ఓ యువతి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఉండ్రాజవరానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్.ఎం.పి). స్థానికంగా వైద్యం చేస్తుంటారు. పవన్‌ అంటే చాలా అభిమానం. ఆయన సినిమాలన్నింటినీ తనివితీరా చూస్తుంటారు. ఇప్పుడాయన రాజకీయ నాయకుడయ్యారు. జనసేన పార్టీని పెట్టారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినా ఏ ఒక్కదాన్నుంచీ గెలవలేకపోయారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన గెలుపు కోసం ఉడతా భక్తిగా చాలా కార్యక్రమాలు చేపట్టిన దుర్గా రామలక్ష్మి ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ గెలవాలని కోరుకుంటూ తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నారు. అందులో భాగంగా మే 25న సుమారు 450 మెట్లు మోకాళ్లపై ఎక్కారు. పార్టీలతో తనకు సంబంధం లేదని, కేవలం పవన్‌పై ఉన్న అభిమానంతోనే మెట్లు ఎక్కినట్లు రామలక్ష్మి చెబుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న ఆయన అత్యధిక మెజార్టీతో కచ్చితంగా విజయం సాధిస్తారని దీమా వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, భవానీల అనుమతితో తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్నారు.
మరో వీరాభిమాని తీరు ఇదే...

తన ప్రియతమ నాయకుడు పవన్ కల్యాణ్ విజయం కోసం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ వీరాభిమాని పొర్లుదండాలతో తిరుమల చేరారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అఖండ మెజారిటీతో గెలుస్తారన్న ధీమాతో ఉన్నారు. జనసేన కార్యకర్త ఈశ్వర్ తిరుమల జాపాలి తీర్థానికి పొర్లు దండాలతో వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అఖండ మెజారిటీతో విజయం సాధించాల ఆయన ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆకాశగంగ జలాశయం మెట్ల నుంచి జాపాలి తీర్థానికి పొర్లు దండాలతో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.
Read More
Next Story