పార్టీలో లేకున్నా ప్రజల్లో ఉంటాను అంటూ తన సస్పెన్షన్‌పై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.

వైసీపీ నుంచి రెండు రోజుల క్రితం సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ తన సస్పెన్షన్‌పై స్పందించారు. రాజకీయ క్రీడలో తాను బలిపశువునయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో లేకున్నా ప్రజల్లో ఉంటానన్నారు. తనకు రాజకీయంగా పదవులతో పాటు గుర్తింపునిచ్చిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ వీడియోను విడుదల చేశారు.

అందులో దువ్వాడ ఏమన్నారంటే..
ఈనెల 22న వైసీపీ నన్ను సస్పెండ్‌ చేసినట్టు తెలిసింది. వైసీపీ గురించి మాట్లాడే ముందు.. వైఎస్‌ జగన్‌ నాకు ఈ స్థాయినిచ్చినందుకు, గౌరవాన్ని హోదాను పెంచినందుకు ధన్యవాదాలు. పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను. గొంతై మాట్లాడాను. గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచకుప్డడ్డాను. అలాంటి నన్ను వ్యక్తిగత కారణాలుపేరుతో అకారణంగా సస్పెండ్‌ చేశారని తెలిసింది. అయితే పార్టీ నాకందించిన సహకారం, వైఎస్‌ రాజశేఖరరెడ్డితో అడుగులు వేసిన నేను, జగన్‌తో నడుస్తున్న నేను నా హృదయంలో జగన్‌ చిరస్మరణీయులే. ఈ రాజకీయ ్రMీ డలో బలయ్యానేమో అని నాకు అనిపిస్తోంది. పాతికేళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న నేను ప్రజా సేవే పరమావధిగా భావించిన నేను పార్టీకి ద్రోహం చేయలేదు. లంచాలు తీసుకోలేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. భూకబ్జాలు చేయలేదు. ఈ పరిణామాలను స్వీకరిస్తున్నా.. సస్పెన్షన్‌ అంటే తాత్కాలిక విరామంగా భావిస్తున్నాను. గురజాడ అప్పారావు ఓ మాట చెప్పారు. విజయం కోసం విసుగును వీడి విరామమెరుగక పనిచేయండోవోయ్‌.. అని అన్నారు.
ఆయన చెప్పినట్టే నేను కష్టపడి పని చేస్తాను. స్వతంత్రుడిగా, తట్టస్తుడిగా ప్రజల కోసం అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టించిన ఉత్సహాంతో పని చేస్తానని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని, ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాదస్‌ వస్తాడని చెబుతున్నాను. నాకు ప్రజలతో నేరుగా సంబంధాలున్నాయి. అన్నిటీకీ కాలమే సమాధానం చెబుతుంది. నా ఊపిరి ఉన్నంతవరకు టెక్కలి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తాను. వైఎస్‌ జగన్‌కు çహృదయపూర్వక ధన్యవాదాలు..అంటూ ముగించారు.
మీడియా ముందుకు కాకుండా.. వీడియో ద్వారా..
దువ్వాడ శ్రీనివాస్‌ సస్పెన్షన్‌ పై ఆయన విడుదల చేసిన వీడియో సందేశంలో వైసీపీ నేతలపై నేరుగా విమర్శలు చేయలేదు. తన కుటుంబ తగాదాల గురించి గాని, తన సన్నిహితురాలు దివ్వెల మాధురి గురించి గాని మాట్లాడ లేదు. వైసీపీ నుంచి సస్పెండ్‌ అవడంతో దువ్వాడ మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడతారని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఆయన వీడియో ద్వారానే తన స్పందనను తెలియజేశారు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన వీడియో సందేశాన్ని ఎంచుకున్నారని చర్చించుకుంటున్నారు.
Next Story