స్పేస్‌ పార్క్‌ అంటే ఏమిటి? ఇది ఎలా ఉంటుంది? ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను స్పేస్‌ పార్క్‌ ఏపీలో ఏర్పాటు చేయాలని ఎవరు కోరారు? ఎందుకు కోరారు?


స్పేస్‌ పార్క్‌ ఇప్పుడు ఇండియాలో హాట్‌ టాపిక్‌ అయింది. స్పేస్‌ పార్క్‌ అంటే ఏమిటి? స్పేస్‌ పార్క్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని ఎవరు, ఎందుకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కోరారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు ఉండగా ఇక్కడే ఎందుకు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు చెబుతున్నారనేది ఇప్పుడు చర్చనియాంశంగా మారింది. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్‌) నిర్వహించిన కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సామాన్యుడు ఎంతో ఆనందంతో అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక జీవితంలో సుఖాలను, సంతోషాలను, బాధలను, బంధాలను త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది. అంతరిక్ష పరిశోధనలే ప్రాణంగా పని చేస్తున్న ఎందరో మహానుభావులు ఉన్నారు. దేశం కోసం, జాతి కోసం తమ సొంత కుటుంబాలను, ఇష్టాలను వదులుకొని, అవమానాలు, అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణం దాగుంది. వారే ఈ దేశానికి నిజమైన హీరోలు అంటూ అంతరిక్ష దినోత్సవం రోజున శాస్త్రవేత్తలను అభినందించారు. అందులో భాగంగానే రష్యాకు చెందిన వ్యోమాగామి, స్పేస్‌ ఇండియా వారు వచ్చి కలిసారు. స్పేస్‌ పార్క్‌ అని పిలిచే ఈ డిజిటల్‌ స్పేస్‌ మ్యూజియం ఇంటరాక్టివ్‌ ఇంటర్‌ ఫేస్‌ ద్వారా వెబ్‌సైట్‌తో సులభంగా సర్చ్‌ చేయవచ్చు. ప్లాట్‌ఫారమ్‌ బీటా ఎడిషన్‌లో అతిథులు వర్చువల్‌గా స్పేస్‌ ఆన్‌ వీల్స్‌ బస్సులో ఎక్కి పర్యటనను అనుభవించవచ్చు.
ఇందులో మ్యూజియం, థియేటర్, అబ్జర్వేటరీ, లైఫ్‌ సైజ్‌ రాకెట్‌లతో కూడిన గార్డెన్, లేక్‌ సైడ్‌ డైనింగ్‌ ఏరియా, పిల్లల ఆట స్థలం, మరిన్ని ఉన్నాయి. ఇది 360 డిగ్రీల్లో అనుభవం కోసం జూమ్‌ ఇన్, అవుట్‌ ఉపయోగించి సౌకర్యాలను యాక్సెస్‌ చేయడానికి లేదా వదిలివేయడానికి కావాల్సిన ఎంపికను అందజేస్తుంది. వర్చువల్‌ సౌకర్యం ప్రధాన మ్యూజియం నిర్మాణం లోపల, సందర్శకులు ఇస్రో విజయాలు, ఉపగ్రహాలు, ప్రయోగ వాహనాలపై వివిధ ప్రదర్శనలను కనుక్కోవచ్చు. ఇస్రో విజయానికి ఎక్కువగా సహకరించిన ప్రముఖ శాస్త్రవేత్తల రికార్డులను కూడా సందర్శకులు చూడవచ్చు. ఇస్రో ద్వారా వాహనాలు, ఉపగ్రహాలు, శాస్త్రీయ మిషన్ల ప్రయోగానికి సంబంధించిన అనేక పత్రాలు, చిత్రాలు, వీడియోలకు వెబ్‌సైట్‌ అందిస్తుంది.
థియేటర్‌లో ఐఎస్‌వో (ఐn్ట్ఛటn్చ్టజీౌn్చ∙ౖటజ్చnజ్డీ్చ్టజీౌn జౌట ్ట్చnఛ్చీటఛీజ్డీ్చ్టజీౌn ) మిషన్‌లను వివరించే చిత్రం ప్రదర్శించబడుతుంది. మెర్క్యురీ నుండి నెప్ట్యూన్‌ వరకు ఉన్న గ్రహాల పరిమాణాలు, అలాగే భూమి, చంద్రుడు, సౌర వ్యవస్థ పార్కులో ప్రదర్శించబడతాయి. విభిన్న వాటాదారుల ఉపయోగం కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌కు మరిన్ని సున్నితమైన డిజిటల్‌ కంటెంట్‌ జోడిస్తారు. లూమినా డేటామాటిక్స్‌ అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి స్పేస్‌ కిడ్జ్‌ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
2012లో ప్రారంభించిన స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా అనేది శాస్త్ర, సాంకేతిక, కళ, సాంస్కతిక రంగాలలో యుక్త వయస్కులకు అవగాహన కల్పిస్తుంది. చిన్న ఉపగ్రహాలను రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయడం, తయారు చేయడం వంటివి ఏరోస్పేస్‌ చేస్తుంది. స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా అనేది దేశం కోసం ‘యువ శాస్త్రవేత్తలను’ తయారు చేసి ‘సరిహద్దులు లేని ప్రపంచం’ కోసం పిల్లలలో అవగాహన కల్పించే సంస్థ.
ఈ నిర్దిష్ట ఉపగ్రహ ప్రయోగంలో భారతదేశంలోని 75 గ్రామీణ పాఠశాలల్లో మొత్తం 750 మంది టీనేజ్‌ బాలికలు ఎంపికయ్యారు. ఇది జనవరి 16, 2023ని లక్ష్యంగా పెట్టుకున్న బాలికల ప్రాజెక్ట్‌. పేద నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలను ప్రోగ్రామ్‌ కోసం ఉపయోగించుకుంటుంది. వివిధ నైపుణ్యాల సెట్‌లను అన్వేషించడానికి, అంతరిక్షంలో కెరీర్‌లను కూడా లక్ష్యంగా చేసుకోవడానికి వీలు కల్పించే అవకాశాలను వారికి కల్పిస్తుంది.
స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా వ్యవస్థాపకురాలు డాక్టర్‌ కేసన్‌ మాట్లాడుతూ ‘కొత్త యువ భారతదేశాన్ని సష్టించడం – భవిష్యత్‌ తరానికి అంతరిక్షాన్ని అన్వేషించదగినదిగా మార్చడం’ అని అన్నారు.
లుమినా డేటామాటిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అంజు కనోడియా మాట్లాడుతూ ‘ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు లూమినా డేటామాటిక్స్‌ థ్రిల్‌గా ఫీలవుతోంది. విశేషమేమిటంటే.. యుక్త వయస్సులోని బాలికలు అంతరిక్షంలోకి వెళ్లే ఉపగ్రహాన్ని రూపొందించడంలో నిమగ్న మయ్యారన్నారు. లూమినా డేటామాటిక్స్‌ సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌తో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌ లోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో వారు కలిసి వాళ్లు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు. ఇటీవల తయారు చేసినా అతి చిన్న శాటిలైట్‌ డిప్లయర్‌ ను చూపించి దాని పనితనాన్ని వివరించారు.
స్పేస్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలి
అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని స్పేస్‌ కిడ్జి ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈవో డా. కేశన్‌ పవన్‌ కళ్యాణ్‌ను కోరారు. స్పేస్‌ పార్క్‌ నాసా (అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్, స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనే సంస్థను సంక్షిప్తంగా నాసా అని వ్యవహరిస్తూంటారు.) లో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఆమె మాటలపై సానుకూలంగా స్పందించారు. రష్యా వ్యోమగామి సెర్గి కోర్సకొవ్‌ ను పవన్‌ కళ్యాణ్‌ సత్కరించారు. చంద్రయాన్‌–3 రాకెట్‌ నమూనాను బహుకరించారు. సెర్గి ఆరు నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారు. అక్కడి విశేషాలను, అంత కాలం ఏ విధంగా ఉండగలిగారు, అక్కడ పరిశోధించిన అంశాల గురించి పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్‌ వంటకాలను రుచి చూపించారు. పవన్‌ కళ్యాణ్‌ భార్య రష్యాకు చెందిన వారు కావడం విశేషం.


Next Story