ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది.. రౌండ్లను ఎలా నిర్ణయిస్తారు..
x

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుంది.. రౌండ్లను ఎలా నిర్ణయిస్తారు..

ఎన్నికల్లో పోలింగ్‌ను మించిన కీలక ఘట్టం కౌంటింగ్. అసలు ఈ కౌంటింగ్ ఎలా జరుగుతుంది. రౌండ్స్‌ను ఎలా నిర్ణయిస్తారు. కౌంటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది.


ఎన్నికలు వస్తున్నాయ్ అంటే.. పోలింగ్ నిర్వహించడం పెద్ద సవాల్ అనుకుంటే.. ఓట్ల లెక్కింపు అంతకు మించిన సవాల్‌. పోలింగ్ ఒక వందమంది భద్రతా సిబ్బంది మధ్య జరిగితే.. కౌంటింగ్ రేంజే వేరు. ఒక్కసారి కౌంటింగ్ స్టార్ట్ అయిందంటే చీమ చిటుక్కుమన్నా ఇట్టే పసిగట్టేస్తారు. అలాంటి భారీ భద్రత మధ్య ఈ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ కౌంటింగ్‌ ప్రక్రియపై సీసీ కెమెరాలు, స్థానిక బలగాలు, కేంద్ర బలగాలు అణుక్షణం ఒక కన్నేసి ఉంటాయి. ఏమాత్రం అవకతవకలు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం ఈ కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తుంది. అసలు ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే..

నాలుగు గంటల ముందే పని ప్రారంభం

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. ఈ కౌంటింగ్ సమయంలో ప్రతి చిన్న విషయాన్ని అధికారులు గమనిస్తుంటారు. ఏమాత్రం అనుమానం ఉన్నా దానిపై చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే కౌంటింగ్ ప్రారంభానికి నాలుగు గంటల ముందు నుంచే కౌంటింగ్ సిబ్బంది తమ ఏర్పాట్లు చేసుకోవడం ప్రారంభిస్తారు. తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు సిబ్బంది ఉదయం నాలుగు గంటలకే చేరుకోవాలి. 5 గంటలకు వాళ్లు ఎక్కడ కూర్చుని లెక్కింపు చేయాలో చూపుతారు. ఇందులో భాగంగానే సదరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చేత.. ‘లెక్కింపులో గోప్యత పాటిస్తాం’ అని ప్రమాణం కూడా చేయిస్తారు. ఆ తతంగం అంతా పూర్తయ్యాక ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఒక అరగంట జరుగుతుంది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటే వాటి కౌంటింగ్ కొనసాగిస్తూనే.. ఈవీఎంల లెక్కింపు ఘటాన్ని ప్రారంభిస్తారు. ఒక్కో నిమిషానికి మూడు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిసారన్న ఒక అంచనా కూడా ఉంది.

రౌండ్ల నిర్ణయం ఇలా

సాధారణంగా ఎన్నికల కౌంటింగ్ వచ్చిందంటే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో నెంబర్ రౌండ్‌లు ఉంటాయి. ఒక నియోజకవర్గంలో 10 ఉంటో మరో నియోజకవర్గంలో 24 ఉంటాయి. వీటిని చూసి చాలా మంది సామన్య ప్రజలు అసలు ఈ రౌండ్లను ఎలా లెక్కిస్తారనుకుంటారు. అయితే ఈ రౌండ్లను.. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలో పోలైన ఓట్ల ప్రాతిపదికన నిర్ణయిస్తారు. సాధారణంగా ఒక ఈవీఎంలో 1000 నుంచి 12,00 ఓట్లు ఉంటాయి. ఒక్కో రౌండ్‌కి 14 లేబుల్స్ మీద లెక్కింపును పూర్తి చేస్తారు. అంటే ఒక్కో రౌండ్‌కు 14 వేల నుంచి 15 వేల ఓట్లు లెక్కిస్తారు. దీనిని బట్టి చూస్తే ఒక నియోజకవర్గంలో లక్ష మంది ఓటర్లు ఉంటే అక్కడ 8 నుంచి 10 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. అదే రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే ఆ నియోజకవర్గంలో 14 లేదా 20 రౌండ్లలో ఫలితాలు తేలిపోతాయి. ఒక్కో రౌండ్ కౌంటింగ్ సుమారు 30 నిమిషాల సమయం వరకు పడుతుంది. ఒక్కసారి టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు అంతా పూర్తయితే ఒక్క రౌండ్ ముగిసినట్లు. అలా అన్ని ఈవీఎంల లెక్కింపు ముగిస్తే లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్లు లెక్క. అప్పుడు వచ్చి ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. విజేతను ప్రకటిస్తారు.

Read More
Next Story