తిరుపతి కుంభ్ మేళా-2 ఏంటీ? ఎందుకు? ఏమి చేయబోతున్నారు?
x

తిరుపతి కుంభ్ మేళా-2 ఏంటీ? ఎందుకు? ఏమి చేయబోతున్నారు?

ఆలయ నిర్వహణలో టీటీడీ ఓ విశ్వవిద్యాలయం లాంటిదే. ఇదే వ్యవస్థపై ( ITCX) పేరిట తిరుపతిలో నిర్వహించే సదస్సు ఆంతర్యం ఏమిటి?


ఉత్తరాది నుంచి పవనాలు బలంగా వీస్తున్నాయి. దక్షిణాదిలో బీజేపీ పట్టు సాధించడానికే ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

త్రివేణి సంగమానికి కేంద్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ వద్ద 144 ఏళ్ల తర్వాత నిర్వహించిన మహా కుంభమేళాలో కొన్ని కోట్ల మంది స్నానాలు ఆచరించారు. యోగి ఆదిత్యనాథ్ సారధ్యంలోని బిజెపి ప్రభుత్వం కుంభమేళాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. హిందుత్వ నినాదం. ఆలయాల రక్షణ నిర్వహించే కార్యక్రమాలతో బిజెపి మార్కు స్పష్టంగా కనిపిస్తుందనే భావన కనిపిస్తోంది. కాగా,
దక్షిణాదిలో ప్రధానంగా ఏపీలో బిజెపి పాత్ర నామమాత్రం.ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన ద్వారా తన కార్యకలాపాలను విస్తృతం చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ " వారాహి డిక్లరేషన్" తిరుపతి వేదికగానే ప్రకటించడం ప్రస్తావనార్హం. సాధారణంగా వీహెచ్పీ ( Vishva Hindu Parishad- VHP), ఆర్ఎస్ఎస్ (rashtriya swayamsevak Sangh- RSS ) ప్రతినిధుల స్వరం నుంచి వినిపించే మాటలు పవన్ కళ్యాణ్ గొంతులో ప్రతిధ్వనించాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉంటే...
అసలు విషయంలోకి వస్తే...

ఆధ్యాత్మిక నగరం తిరుపతి వేదికగా కరకంబాడి ఆశ కన్వేన్షన్ సెంటర్ లో "దేవాలయాల కుంభ్ మేళా" పేరిట అంతర్జాతీయ దేవాలయాల మూడు రోజుల సదస్సు ఈరోజు అంటే ఫిబ్రవరి 17 నుంచి 19 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఎక్స్పో ( ITCX) పేరిట నిర్వహించే కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వారు చెబుతున్న విషయాల్లో..
ఆలయాల నిర్వహణ, రద్దీ నియంత్రణ ( Croud Managment), క్యూ (Que) ల నిర్వహణ. వంటి అంశాలతో పాటు ఆలయాల మధ్య అనుసంధానం ప్రధానాంశాలు ఉంటాయని చెబుతున్నారు. వీటిపై చర్చలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రతినిధులను ఆహ్వానించడం ద్వారా తిరుపతిని కేంద్రంగా ఎంచుకున్నారు. "ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి వ్యూహాలపై దృష్టి సారిస్తుంది" అని ఐటీసీఎక్స్ చైర్మన్, మహారాష్ట్ర శాసన మండలి చీఫ్ WHIP ప్రసాద్ లాడ్ చెబుతున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే..

టీటీడీ రోల్ మోడల్ కాదా
ఆలయాల నిర్వహణలో దేశంలోని శ్రీవైష్ణవ క్షేత్రాలకు కేంద్ర బిందువు తమిళనాడులోని శ్రీరంగం అనేది జగమెరిగిన సత్యం. ఆ స్ఫూర్తితో అనేక ధార్మిక సంస్థలకు టీటీడీ (TTD) ఆధ్వర్యంలోని తిరుమల (TIRUMALA)శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఆలవాలంగా నిలుస్తుంది.
దేశంలోని మిగతా ఆలయాలకు తిరుమల క్షేత్రం ఓ స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. తిరుమలకు రోజుకు సగటున 60 వేల నుంచి 75 వేల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటే, రోజుకు దాదాపు లక్షమంది రాకపోకలు సాగిస్తుంటారు. తిరుమలలో రద్దీ నియంత్రణ (Croud Managment) కు పటిష్ట యంత్రాంగం ఉంది. ఈ కేంద్ర దేశంలోని మిగతా ఆలయాలకు ఆదర్శం కూడా. ఇక్కడి పద్ధతులనే కర్నూలు జిల్లాల శ్రీశైలం క్షేత్రం, మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయ యంత్రాంగం కూడా తిరుమల పద్ధతులను అనురిస్తారు.
రద్దీ నియంత్రణ
తిరుమలలో రద్దీ నియంత్రణకు ప్రత్యేక సుస్ధిరమైన వ్యవస్థ ఉంది. ఇక్కడ మాడవీధుల్లో గ్యాలరీల్లో ఇనుక బారికేడ్లు, తొమ్మిది ద్వారాల వద్ద తొక్కిసలాటకు ఆస్కారం లేని భద్రతా వ్యవస్థ ఉంది. వారిలో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్, రక్షణ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన మాజీ సైనికులు కూడా ఉన్నారు. వారికి తోడు టీటీడీ సెక్యూరిటీ వింగ్, హోంగార్డ్స్, సివిల్ పోలీస్, ఏఆర్ పోలీస్, ఎస్పీఎఫ్, అత్యవసరమైతే అక్టోపస్ దళాలు సిద్ధంగా ఉంటాయి. అంతేకాకుండా, క్యూల నిర్వహణలో అనుసరించే పద్ధతులు కాస్త ఇబ్బందికరంగా ఉన్న భద్రత, రక్షణ దృష్ట్యా పటిష్టంగా ఉంటుంది. ఇది మిగతా దేవాలయాలకు కూడా ఆదర్శం. అనుసరిస్తున్నారు కూడా.
పుట్టపర్తి స్ఫూర్తితో..
రద్దీ నియంత్రణ, శ్రీవారి సేవకులను ప్రవేశ పెట్టడానికి టీటీడీ ఒకనాటి పీఆర్ఓ సుభాష్ గౌడ్, ప్రస్తుత చీఫ్ పీఆర్ఓ తలారి రవి శ్రద్ధ తీసుకున్నారు. పుట్టపర్తి సాయిబాబా ఆలయంలో అమలు చేస్తున్న సేవకుల వ్యవస్థను అధ్యయనం చేయడం ద్వారా తిరుమలలో అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం శ్రీవారి సేవకుల సంఖ్య దేశంలో దాదాపు 2.5 లక్షల మందికి పైగానే నమోదు చేసుకున్నారు.
ఆలయాలతో అనుసంధానం
దేశంలోని అనేక ఆలయాలతో టీటీడీకి అనుసంధానం ఉంది. తిరుమలలో జరిగే కార్యక్రమాలకు తమిళనాడులోని శ్రీరంగం నుంచి కానుకలు అందుతాయి. గోదాదేవి ఆలయం నుంచి పూలమాలలు అందిస్తారు. జ్యోతిర్లింగ క్షేత్రాలు శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం తోపాటు నిజామాబాద్ లోని జెండా బాలాజీ ఆలయంతో కూడా అనుబంధం ఉంది. అక్కడి ప్రత్యేక ఉత్సవాలకు తిరుమల నుంచి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.
అన్నదాన కేంద్రాలు
తిరుమల నిత్యాన్నదాన సత్రంలో రోజుకు సగటున 40 వేల నుంచి 50 వేల మంది వరకు ఉచితంగా అన్నప్రసాదాలు స్వీకరిస్తారు. అదేవిధంగా తిరుమలలో పీఏసీ కేంద్రాలు, తిరుపతి గోవిందరాజస్వామిగుడి, తిరుచానూరు, కడప జిల్లా కోదండరామాలయం, వేంపల్లెలోని గండి వీరాంజనేయ క్షేత్రం. దేవుని కడప ఆలయాల వద్ద అన్నదానం చేయడమే కాదు. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయడంలో టీటీడీ అగ్రగామిగా ఉంటుంది. అందుకే ప్రపంచస్థాయిలో ధనిక క్షేత్రంగా టీటీడీ రికార్డు నమోదు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో..
మళ్లీ టెంపుల్ కనెక్టా..?
2023లో ఈ ప్రపంచస్థాయి చర్చలకు తెర తీశారు. వారణాసి కేంద్రంగా మొదట టెంపుల్ కనెక్ట్ (Temple connect) India పేరిట ప్రపంచవ్యాప్తంగా దేవాలయాల సమగ్ర నిర్వాణకు ఈ చర్చలకు ఆస్కారం కల్పించారు. అదే సందర్భంలోనే రెండో కార్యక్రమంగా తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించారు. టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు, మహారాష్ట్ర ఎమ్మెల్సీ గిరేష్ కులకర్ణి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆశీస్సులు మెండుగా ఉన్నాయని కూడా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఇన్క్రెడిబుల్ ఇండియా కార్యక్రమాలు కింద నిర్వహిస్తున్న ఈ తరహా కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ మద్దతు కూడా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
"ఆలయ పర్యాటకం. తీర్థయాత్రలు. పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడం" వంటి లక్ష్యాలతో టెంపుల్ కనెక్ట్ కళా పాల ఉంటాయని ఆయన చెబుతున్నారు.
లక్ష్యం ఏమిటి ..?
మహారాష్ట్రలో బిజెపి ప్రతినిధులుగా, శాసనమండలి సభ్యులుగా ఉన్న టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గరేష్ కులకర్ణి, ప్రసాద్ లాడ్ సారథ్యంలో టెంపుల్ కనెక్ట్ పేరిట కార్యకలాపాలకు తెర తీశారు. తిరుపతిలో రెండో ఎడిషన్ నిర్వహించాలని వారణాసి స్తభలో తీర్మానించారు. ఈ కార్యక్రమానికి దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని 58 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశారు. ఇవన్నీ గుట్టుచప్పుడు కాకుండానే సాగాయి. ఆన్లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్, ఆహ్వానాలు సిద్ధం చేయడం గమనార్హం. టెంపుల్ కనెక్ట్ ఇండియా కార్యక్రమానికి ఎక్కడా ప్రచార ఆర్భాటానికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం వెనక అంతరార్థం ఏమిటనేది కూడా చర్చకు వచ్చింది.
తిరుపతిలో మూడు రోజుల పాటు నిర్వహించే సదస్సులు, చర్చల్లో పాల్గొనేందుకు 111 మంది వక్తలను కూడా సిద్ధం చేశారు.
వారు చెబుతున్న లక్ష్యాలు ఏమిటంటే..
దేవాలయాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తారు. ఆలయాల రక్షణ, ఆధ్యాత్మిక భద్రత, నిఘాతోపాటు వ్యూహాత్మకంగా వ్యహరించాల్సిన పద్ధతులు అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తామని చెబుతున్నారు. 75 కు పైగా హైటెక్ ఆవిష్కరణ ఏకీకరణ, పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత లో పాటించాల్సిన ప్రమాణాలు, ఆహార పంపిణీ అంటే ప్రధానంగా ప్రధాన ఆలయాల వద్ద అన్నదాన సత్రాల నిర్వహణలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చిస్తామని చెబుతున్నారు. అంతేకాకుండా ఆలయాల వద్ద క్యూ ల నిర్వహణ, రద్దీ నియంత్రణలో ( crowd management) అనుసరించాల్సిన మెలకువలపై చర్చించనున్నట్లు చెబుతున్నారు.
అంతిమంగా ఆలయాల పవిత్రతను కాపాడే లక్ష్యంగానే కాకుండా యాత్రికులకు అవసరమైన మెరుగైన సేవలను అందించాలని ప్రధాన ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయిలో మూడు రోజుల చర్చలు ఉంటాయని చెబుతున్నారు.
ఒకే గొడుగు కిందికి.. విభిన్న మతాలు
తిరుపతి నగరం కరకంబాడి మార్గంలోని ఆశ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న మూడు రోజుల అంతర్జాతీయ కార్యక్రమాలకు హిందూ ఆలయాల ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరితోపాటు ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ (VHP) కీలక ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులలో హిందూ దేవాలయాలతో పాటు జైన మతం, సిక్కు, బౌద్ధమతం నుంచి కూడా దేవాలయాల అధిపతులు, ట్రస్టీలు, నిర్వాహకులను కూడా మమేకం చేశారు. ప్రపంచంలోని ఆలయ నిర్వహణ బృందాల మధ్య ఆలోచనలు, పరిజ్ఞానం పరస్పరం మార్పిడి చేసుకునే దిశగా ఐటీసీ ఎక్స్ ఒక డైనమిక్ ఫోరంగా నిలుస్తుంది అని అభివర్ణిస్తున్నారు.
ఎగ్జిబిషన్లు
ప్రపంచంలోని 58 దేశాలలో ఉన్న ప్రతినిధులు ఈ అంతర్జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. ఆధ్యాత్మిక సంస్థల నుండి కే స్టడీస్ ఎగ్జిబిషన్లు (CSE) కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆలయాల నిర్వహణ పరిపాలన, వ్యవహారాలు వంటి అంశాలను విడమరిచి బోధించే విధంగా ఎగ్జిబిషన్లు ఉంటాయని చెబుతున్నారు.
"ఐటీసీ ఎక్స్ అనేది జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం. అధ్యయనం నెట్వర్కింగ్ కు వారధిగా ఉండబోతుంది అని టెంపుల్ కనెక్ట్, ఐ టి సి ఎస్ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి విశ్లేషించారు.
ఆయన ఇంకా ఏం చెబుతున్నారంటే..
ప్రపంచవ్యాప్తంగా వందలాది ఆలయాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించాం. మొదటి సమ్మేళనం వారణాసిలో నిర్వహించాం" అని గుర్తు చేశారు. తిరుపతిలో నిర్వహించే కార్యక్రమాలకు 58 దేశాల నుంచి 1580 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. వారిలో 1200 మంది స్వయంగా పాల్గొంటారు. మరో 350 మంది ఆన్లైన్లో పాల్గొనబోతున్నారు" అని కులకర్ణి వివరించారు. హైబ్రిడ్ ఫార్మాట్లో 2,500 హాజరవుతారని ఆయన వెల్లడించారు.
Read More
Next Story