అంబటి రాయుడుకి పవన్ కల్యాణ్ ఏమి దారి చూపించారు ?
క్రికెటర్ అంబటి రాయుడు పవన్ కల్యాణ్‌ను ఎందుకు పొగుడుతున్నారు. పవన్ కల్యాణ్ రాయుడికి ఏమని చెప్పారు. రాజకీయ భవిష్యత్‌పై రాయుడుకి ఏమని భరోసా ఇచ్చారు.
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడుకి పవన్ కల్యాణ్ ఏమి దారి చూపించారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను తప్పు దారిలో వెళ్తోంటే ఆ దారి మంచిది కాదని ఆ దారి నుంచి తప్పించి కరెక్ట్ రూట్‌లో పవన్ కల్యాణ్ తనను తీసుకెళ్తున్నారని, దీనికి పవన్ కల్యాణ్‌కు అంబటి రాయుడు కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాక పవన్ కల్యాణ్ మంచి సూచనలు, సలహాలు ఇచ్చారని చెప్పడం కూడా చర్చగా మారింది. అయితే పవన్ కల్యాణ్ అంబటికి ఏమి సలహాలు, సూచనలు ఇచ్చారు, ఆ తప్పు దారి ఏది, కరెక్ట్ రూటు ఏది అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. విశాఖ వారాహి సభలో పవన్ కల్యాణ్‌తో పాటు ప్రచారంలో పాల్గొన్న అంబటి రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
కూటమి అధికారంలోకి వస్తే పెద్ద పోస్టులు
తెలుగుదేశం, బిజెపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఏమైనా ఇప్పిస్తామన్నారా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ చేస్తామన్నారా, ఏపి స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) చైర్మన్ చేస్తామన్నారా, లేక కేంద్ర స్ఙాయిలో మంచి నామినేటెడ్ పోస్టులేమైనా ఇప్పిస్తామన్నారా లేదా రాజ్య సభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తామన్నారా, అనేది చర్చగా మారింది.
పవన్ రాయుడికి భరోసా..
రాబోయేది తమ కూటమి ప్రభుత్వమేనని అందులో మనం కీ రోల్ పోషిస్తామని, నీకు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని రాయుడుకి పవన్ కల్యాణ్ చెప్పినట్లు సమాచారం. క్రీడా రంగంలో ఒక మంచి పోస్టును కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించేందుకు పవన్ కల్యాణ్ రాయుడుకి హామీ ఇచ్చినట్లు జనసేన పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ భవిష్యత్‌తో పాటు ఆర్థికంగా మరింత బలవంతుడిని చేసేందుకు పవన్ కల్యాణ్ ఇచ్చిన సలహాలు, సూచనలు తనకు బాగా నచ్చాయని రాయుడు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. జగన్ కానీ చంద్రబాబు కానీ రాజకీయంగా వాడుకునే వదిలేసే వారే తప్ప వృద్ధిలోకి తీసుకొని రావడంలో సహకరించే వారు కాదని పవన్‌ను చూశాకా అర్థమైందని రాయుడు తన స్నేహితుల వద్ద చెప్పుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌లో నీతి నిజాయితీ నచ్చాయని, నిజాయితీకి పవన్ కల్యాణ్ నిలువుటద్దం అని భావిస్తున్నందు వల్ల జనసేనలోకి చేరినట్లు సన్నిహితుల వద్ద రాయుడు మాట్లాడినట్లు జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నారు.
అలా చేరాడు ఇలా వీడాడు
అంబటి రాయుడు తొలుత వైఎస్‌ఆర్‌సీపీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పట్టుమని పది రోజులు కాక ముందే ఆ పార్టీ నుంచి బటయకు వచ్చేశారు. ఎంపీ టికెట్ విషయంలో సీఎం జగన్‌కు, అంబటికి మధ్య ఒప్పందం బెడవడంతోనే అంబటి ఆ పార్టీని వీడారని టాక్ నడించింది. తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన అంబటి తర్వాత ఆ పార్టీలో చేశారు. వైఎస్‌ఆర్‌సీపీలో బానిసత్వం భరించలేకే తాను బయటకు వచ్చానని, తన లాంటి వారు ఆ పార్టీలో ఇమడ లేరని, రాష్ట్రం అద్భుతమై అభృవృద్ధిని సాధించాలన్నా, యువతకు బంగారు భవిష్యత్ కావాలన్నా, టీడీపీ, జనసేన, బిజెపీ కూటమి ద్వారా సాధ్యం అవుతుందని రాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మచిలీపట్నం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ద ప్రసాద్ తరుపున ఇటీవల చేపట్టిన ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి.
స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి
జనసేన పార్టీ తరఫున అంబటి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అంబటి రాయుడు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లనే ఇద్దరిని కాపు కులం కలిపిందని, అందువల్లనే అంబటి జనసేన పార్టీలో చేరడంతో పాటుగా ఆ పార్టీలో కీ రోల్ పోషించే విధంగా పవన్ కల్యాణ్ రాయుడికి ప్రాధాన్యత కల్పించారనే టాక్ కూడా ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.
Next Story