Kadapa Steel | కడప ఉక్కుకు సంకెళ్లు వేస్తున్న దెవరు?
x

Kadapa Steel | కడప ఉక్కుకు 'సంకెళ్లు' వేస్తున్న దెవరు?

రాజకీయ వివక్ష సరికాదు. నినదించే స్వరాలు మళ్లీ ఏకం కావాలి. ఉద్యమాలపై పడిన కులం రంగు కడగాలని 'సీమ' నేతలు అంటున్నారు.


అసలు కారణం ఏమిటి? ఓట్లు- సీట్లేనా? ఈ పరిస్థితుల్లో రాయలసీమ ఉద్యమకారుల స్వరాలు ఎందుకు ఊపిరి పోసుకోవడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. కులం రంగు పడిన నేపథ్యంలో ఉద్యమాలు నామమాత్రంగా మారాయని వారే చెబుతున్నారు.

కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు గాలిలో దీపంలా మారింది. 2004 నుంచి 2024 వరకు ముగ్గురు సీఎంలు నాలుగుసార్లు శంకుస్థాపనలు చేసినా బాలారిష్టాలు దాటకపోవడానికి కారణం ఏమిటి? రాయలసీమలో కడప జిల్లా కూడా అంతర్భాగమే. పరిశ్రమల ఏర్పాటు విషయంలో కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతున్నట్లే కనిపిస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాలపై చూపిస్తున్న శ్రద్ధ కడపపై కనిపించడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి.
అనంతపురం జిల్లాకు చెందిన మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్ఎం. బాషా స్పందిస్తూ,
"ఉద్యమాల నుంచి కులాన్ని దూరం చేయాలి" అని బాషా చెబుతున్నారు."కర్నూలు జిల్లాలో సుమారు 20 మంది యువ ఉద్యమకారులు చురుగ్గా పాల్గొనే వారు. ఉద్యమాన్ని హైజాక్ చేసిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఆ యువకుల ఉనికి లేకుండా చేశారు" అని ఎస్ఎం. బాషా ఆవేదన చెందారు. ఈ పరిస్థితుల్లో
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వద్ద 1,200 ఎకరాల్లో రూ. 13 వేల కోట్ల పెట్టబడితో ఎలక్ట్రిక్ వాహన పార్కు ఏర్పాటుకు ముందడుగు పడింది. దీనికి రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కర్నూలే జిల్లా మంత్రి టీజీ. భరత్ సంయుక్తంగా పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో గత శుక్రవారం ఎంఓయు కూడా కుదిరింది.
మార్చిలో శంకుస్థాపన
ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేసే "ఈవీ పార్కు"లో 1,800 వందల కోట్లతో మౌలిక వసతుల కల్పించడానికి కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. తద్వారా ఈ ఏడాది మార్చి నెలలో శంకుస్థాపనకు కూడా ముహూర్తం సిద్ధం చేశారు. దీనివల్ల 25 వేత మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. ఈవీ పార్క్ యాంకర్ యూనిట్ గా పీపుల్ టెక్ సంస్థ రూ. 300 కోట్ల రూపాయలతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాభహన తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి వీలుగా భూములు కేటాయించడానికి సీఎం ఎన్. చంద్రబాబు సారధ్యంలోని క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చింది.
కర్నూలు నగరానికి 18 కిలోమీటర్ల దూరంలోని జాతీయ రహదారి 40కి సమీపంలోనే ఉన్న ఓర్వకల్లు వద్ద ఇప్పటికే దేశీయ విమానాశ్రయం అందుబాటులో ఉంది. ఇక్కడికి బెంగళూరు, విజయవాడ మధ్య తోపాటు చెన్నైకి వారంలో రెండుసార్లు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి ఇది కూడా పెద్ద వరంగా చెప్పవచ్చు. దీనివల్ల భారీ ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సాధించడానికి కూడా మార్గం ఏర్పడింది. దీనితో పాటు
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో దేశంలోనే మొదటిసారిగా చిప్ తయారీ సెమీకండక్లర్ పరిశ్రమ కూడా ఏర్పాటు కానుంది. జపాన్ కు చెందిన ఎంఎస్ఈతో మైక్రో టెక్నాలజీ కంపెనీ (YMTL) తో కలిసి స్థాపించడానికి ఒప్పందాలు కూడా కుదిరాయి. పరిశ్రమ భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని సందర్శించారు. వారికి ఇక్కడ 250 ఎకరాలు కేటాయించనున్నారు. ఇదిలావుండగా..
'అనంత'కు మళ్లీ.. ఎయిర్ బస్
2014-19 కాలంలో సీఎం ఎన్. చంద్రబాబు అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని ఎర్రమంచి గ్రామం సమీపంలోని 600 ఎకరాల్లో దక్షిణ కొరియాకు చెందిన కియా (KIA) పరిశ్రమ ఏర్పాటు చేయించడం ద్వారా 6,142 మందికి ఉద్యోగాలు దక్కేలా చేశారు. సమీప గ్రామాల్లోని వారికి ఉపాధి కూడా లభించడానికి శ్రద్ధ తీసుకున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల కరువు జిల్లా నుంచి వలసల ఆగాయని మంత్రి ఎస్. సవితమ్మ కూడా చెప్పడం గమనార్హం.
2019 నాటికి ఈ పరిశ్రమ ఏర్పడిన తరువాత 2.5 ఏళ్లలో ఐదు లక్షల కార్లు ఇక్కడ ఉత్పత్తి చేసి, దేశీయంగా నాలుగు లక్షలు, ఇతర దేశాలకు లక్ష కార్లు ఎగుమతి చేసినట్లు కియా ఇండియా సంస్థ ఎండీ తే-జెన్ పార్క్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయించడంతో పాటు, మౌలిక వసతులు కల్పించడానికి కూడా ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారు.
2025 టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోపే అనంతపురం జిల్లా పెనుగొండకు సమీపంలోనే పాలసముద్రం వద్ద ఎయిర్ బస్ పరిశ్రమకు సీఎం చంద్రబాబు మార్గం సుగుమం చేసుకున్నారు. దీనిపై
సీపీఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఏమన్నారంటే.. "అభివృద్ధి కార్యక్రమాల్లో వివక్ష, రాజకీయ పక్షపాతం సరైంది కాదు" అన్నారు. మాజీ సీఎం వైఎస్. జగన్ కడప జిల్లా వ్యక్తి అనేది కారణం కాకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో నెల్లూరులో జరిగే పార్టీ రాష్ట్ర మహాసభల్లో రాయలసీమ ప్రాజెక్టులు, ఉక్కు కర్మాగారంపై కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు రాంభూపాల్ వెల్లడించారు.
కడప ఉక్కు ఏమైంది?
2007 జూన్ 10న దివంగత సీఎం వైఎస్ఆర్ జమ్మలమడుగు సమీపంలోని అంబవరం వద్ద 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు తయారీ కర్మాగారం ఏర్పాటుకు బ్రహ్మణి ఇండస్ట్రీస్ ద్వారా భూమి పూజ చేశారు. అప్పట్లో దీనిని 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమ నిర్మిస్తామని ప్రకటించారు. బాలారిష్టాలు దాటని స్థితిలో ముగ్గురు సీఎంలు మారారు. మూడుసార్లు శంకుస్థాపనలు చేశారు. మినహా అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ పరిశ్రమ కడప జిల్లా పరిధిలో ఉండడమే కారణంగా కనిపిస్తోంది.
రాష్ట్రం విడిపోయాక 2018లో సీఎం చంద్రబాబు గండికోట రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతంలోని కంబాలదిన్నె వద్ద శంకుస్థాపన చేశారు.
2019 డిసెంబర్ 23న సున్నపురాళ్లపల్లె వద్ద మాజీ సీఎం వైఎస్. జగన్ శంకుస్థాపన చేశారు.
2023లో మళ్లీ అదే ప్రాంతంలో జగన్ భూమి పూజ చేశారు. అంతకుముందే..
కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం
ఈ ఉద్యమానికి ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆజ్యం పోశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. వామపక్షాలు, అనుబంధ విద్యార్థి, యువజన సంఘాలు రంగప్రవేశం చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి కల్పించారు. ప్రాద్దుటూరులో ఊపిరి పోసుకున్న ఉద్యమం సమీప ప్రాంతాలు జమ్మలమడుగు, మైదుకూరు వరకే కాకుండా రాజంపేట, రాయచోటి తాలూకాలకు విస్తరించడంలో ఉక్కు ప్రవీణ్ సఫలం అయ్యారు. విద్యార్థిలోకం ఐక్యంగా నినదించింది. ఈ పరిస్థితుల్లోనే
2018 జూన్ 20వ తేదీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కడప జెడ్పీ కార్యాలయం ఆవరణలో 11వ రోజులు దీక్ష చేశారు. సీఎం ఎన్. చంద్రబాబు సూచనలతో దీక్ష సీఎం రమేశ్ దక్ష విరమించారు. మాజీ ఎంఎల్సీ బీటెక్ రవి కూడా ఏడు రోజులు దీక్ష చేశారు. ఇంతచేసిన సీఎం రమేశ్ ఇంకొందరు సహచర నేతలు ఈ ఉద్యమాన్ని హైజాక్ చేశారనే చెప్పాలి. ఆ తరువాత..
2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. కడప జిల్లాకు చెందిన రమేశ్ అనకాపల్లి వద్ద స్టీల్, హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి సాధించారు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పి రెడ్డి నాగార్జునరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
"ఎందుకన్నా మీకు మన రాయలసీమ అంటే అంత కోపం? సీమపై ఎందుకు ఈ వివక్ష, సొంతగడ్డపై ఎందుకు మమకారం లేదు" అని ఎంపీ సీఎం రమేష్ ను నాగార్జున రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
"కడప వద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్ని వనరులు ఉన్నాయి." అని ఏపీసీపీ మీడియా కమిటీ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యుడు నర్రెడ్డి తులసిరెడ్డి గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారికి చిత్తశుద్ధి అవసరం. "కేంద్రం వద్ద తమ పలుకుబడి ఉపయోగించి, ప్రయోజనాలు సాధించాలి" అని వ్యాఖ్యానించారు. అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో కర్మాగారం ఏర్పాటు చేయగలిగిన పాలకులు అదే పద్థతి కడపలో ఎందుకు సాధ్యం కాలేదనేది ప్రజలక సమాధానం చెప్పాలి" అని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
ఉక్కుపై రాజకీయ నీడలు
కడప ఉక్కుపై రాజకీయ నీలినీడలు కమ్ముకున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిశ్రమ కోసం ఆమరణ దీక్ష చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపిగా గెలిచి, ప్రయివేటు రంగంలో అక్కడ పరిశ్రమకు అనుమతి సాధించడం వెనుక కూడా రాజకీయ కారణాలే ఉన్నాయంటున్నారు.
2014 ఎన్నికలు: కడప జిల్లాలోని పది సీట్లలో రాజంపేట మినహా తొమ్మిది స్థానాల్లో వైసీసీ విజయం సాధించింది. చిత్తూరులో ఆరు టీడీపీ ఎనిమిది వైసీపీ, కర్నూలులో మూడు టీడీపీ 11 వైసీపీ, అనంతపురం 12 టీడీపీ 2 వైసీపీ గెలుచుకుంది.
2019 ఎన్నికలు:రాయలసీమ నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా, చిత్తూరు జిల్లాలో కుప్పం, అనంతపురం జిల్లాలో హిందూపురం, ఉరవకొండలో మినహా టీడీపీ ఎక్కడా గెలవలేదు. అంటే 49 సీట్లతో వైసీపీ భారీ విజయం సాధించింది.
2024 ఎన్నికలు: పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఏడు స్థానాలకు వైసీపీ పరిమితం కాగా, టీడీపీ కూటమి 45 స్థానాలు దక్కించుకుంది.
కడపలో బోణీ కొట్టినా
కడప జిల్లాలోని పది స్థానాల్లో పులివెందులలో వైఎస్. జగన్, బద్వేలులో డాక్టర్ సుధ మాత్రమే విజయం సాధించారు. జమ్మలమడుగులో బీజేపీ నుంచి సీ. ఆదినారాయణరెడ్డి, రైల్వే కోడూరులో జనసేన నుంచి అరవ శ్రీధర్, టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించి, రికార్డు నెలకొల్పారు. అంతకుముందు కడప ఉక్కు కోసం ఆమరణ దీక్షలు చేసిన పార్టీ నేతలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా నోరుమెదపడం లేదు. దీనిపై
సీపీఎం అనంతపురం జిల్లా నేత రాంభూపాల్ ఏమన్నారంటే... "అధికారం లేనప్పుటి స్వరానికి, పదవులు వచ్చిన తరువాత మాటలకు పొంతన ఉండడం లేదు. అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా సాగించిన పోరాటాలను హైజాక్ చేశారనడానికి ఇంతకుమించి ఉదాహరణ ఉండబోదన్నారు.
పోరాటాలకు కులం మసక
రాయలసీమ సమస్యలు, ప్రాజెక్టుల కోసం సాగించిన ఉద్యమాలు అనేకం చరిత్రలో నిలిచిపోయాయి. ఉద్యమకారుల్లో ఐక్యత లోపించిందని చెప్పవచ్చు. దీనివల్ల నినదించే గొంతుకలు ఒకే వేదికపై రాలేని స్థితి వల్ల ప్రభుత్వాలకు కూడా చురుకుదనం తగలడం లేదు. ప్రాజెక్టులపై కర్నూలు జిల్లా నుంచి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి వివిధ వేదికలపై గొంతు వినిపిస్తూనే ఉన్నారు. రాయలసీమ ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటులో ఉద్యమకారుల తీరుపై రాయలసీమ అధ్యయన వేదిక అధ్యక్షుడు భూమన్ కలత చెందారు.
"ఉద్యమకారులకు పార్టీలు ప్రధానం కాదు. కులాలు అంతకంటే ఏమాత్రం ప్రధానం కాకూడదు" అని గుర్తు చేశారు. "కొన్ని దశాబ్దాల పాటు కలసి నినదించిన గొంతులు వేరుగా ఉన్నాయి. ఇవన్నీ అంతరాలను పక్కకు ఉంచి మళ్లీ కలవాల్సిన అవసరం ఉంది" అని గుర్తు చేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని భూమన్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో పంచుకున్నారు.
"వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమ ప్రాజెక్టులపై పోరాటానికి పిలుపు ఇచ్చాం. ఆ సమయంలో నాతో సహా చాలా మంది ఉద్యమకారులను గృహ నిర్బందం చేసింది. దీనిపై కొందరు అపోహ పడినా, ఆ కాలువ వద్ద పోగైన వారందరూ భూమన్ కనిపించలేదనే మాటతో తాను ఉద్యమాలకు దగ్గరగానే ఉన్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారని అన్నారు. "ఆందోళనలకు దిగే ఉద్యమకారులకు వైసీపీ అధికారంలో ఉంటే ఒకరకంగా, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మరోరకంగా కులాలను ఆపాదిస్తున్నారు" అని ఆవేదన చెందారు. "కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను రాయలసీమ సమస్యలపై మాట్లాడకుండా లేను" అని భూమన్ గుర్తు చేశారు.
సీమ సమస్యలపై పోరాటాలకు ఐక్య వేదిక అవసరం. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెబుతున్నారు. అవి ఎప్పటికి ఫలిస్తాయనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story