PAWAN KALYAN |గబ్బర్ సింగ్నే చంపుతానన్న ఈ జులాయి ఎవరంటే..
x

ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను బెదిరించిన మల్లికార్జున్

PAWAN KALYAN |'గబ్బర్ సింగ్'నే చంపుతానన్న ఈ జులాయి ఎవరంటే..

పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకువచ్చారు. ఆ వ్యక్తి ఓ ఆవారా అని, తాగుబోతని పోలీసులు తేల్చారు.


ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను బెదిరించిన వ్యక్తి ఓ ఆవారా అని, తాగుబోతని పోలీసులు తేల్చారు. పవన్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకువచ్చారు. పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ డిప్యూటీ సీఎం పేషీకి ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ, మెసేజీలు పంపిన వ్యక్తిని ఎట్టకేలకు విజయవాడలోనే పట్టుకున్నారు. అయితే అతనింకా మత్తు నుంచి మేలుకోలేదు.
ఉపముఖ్యమంత్రి పేషీకి ఫోన్లు చేసి పవన్‌ కల్యాణ్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిది నెల్లూరు జిల్లా. పేరు మల్లికార్జునరావు. భార్య విడిపోయాడు. ఆర్థికంగా చితికిపోయాడు. తాగుడికి అలవాటు పడ్డాడు. మద్యం కారణంగా ఆరోగ్యం క్షీణించింది. మానసికంగా కుంగుబాటుకు గురైయ్యాడు. దిక్కుతోచని స్థితిలో ఎవరికి పడితే వాళ్లకు ఫోన్లు చేసి ఇలా బెదిరిస్తూ డబ్బులు గుంజాలని చూస్తుంటుంటాడు. పోలీసుల విచారణలో ఇప్పటికి తేలిన సంగతులు ఇవి. ప్రముఖులకు ఫోన్లు చేసి బెదిరింపు చేస్తుంటాడని గుర్తించారు.
ఎలా దొరికిపోయాడంటే...
పవన్ కల్యాణ్ పేషీకి డిసెంబర్ 8 ఆదివారం రాత్రి, డిసెంబర్ 9 సోమవారం ఉదయం పలు దఫాలు మల్లికార్జునరావు ఫోన్లు చేసి చంపేస్తానని బెదిరించాడు. పోలీసులు రంగంలోకి దిగి పట్టుకోవాలని చూస్తే ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉంది. నంబరు ఆధారంగా చిరునామా తిరువూరు అని గుర్తించారు. మల్లికార్జునరావు కాల్‌ డేటాను పరిశీలించారు. చివరి నంబరును పట్టుకుని పోలీసులు ఆరాతీశారు. అది ర్యాపిడో బైక్‌ రైడర్ ది అని తేలింది. అతన్ని విచారిస్తే మల్లికార్జున రావు విషయం తెలిసింది. ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌ వద్ద నిందితుణ్ణి దింపినట్లు చెప్పాడు. హోటల్‌లో వేతగ్గా అతను దొరికాడు.
తాగుడే ధ్యేయంగా...
5 రోజుల్లో 20 మద్యం సీసాలు ఖాళీ చేశాడంటే నిందితుడు ఎంతగా ఆల్కహాలిక్ గా మారాడో చూడండి అంటున్నారు పోలీసులు. నిందితుడు పోలీసులకు దొరికిన హోటల్‌లో ఈ నెల 4న దిగినట్లు అక్కడి రికార్డుల ద్వారా గుర్తించారు. పోలీసులు పట్టుకునే సమయానికి మద్యం మత్తులోనే ఉన్నాడు. నాలుగు రోజులకు గది అద్దె చెల్లించాడు. అప్పటి నుంచి అద్దె కట్టలేదు. గదిలో దాదాపు 20 ఖాళీ మద్యం సీసాలు ఉన్నాయి. నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావు తల్లిదండ్రులు చనిపోయారు. పెళ్లయిన ఏడాదికే భార్య వదిలేయడం, ఉద్యోగం లేకపోవడం, రియల్‌ ఎస్టేట్‌ కలిసి రాకపోవడంతో తాగుడుకు బానిసగా మారిపోయాడు. అక్కలు, సోదరుడు ఇచ్చే డబ్బులతో జల్సాలు చేసేవాడు. తిరువూరులోని సోదరి చిరునామాతోనే ఆధార్, పాన్, సిమ్‌ కార్డులు తీసుకున్నాడు.
పెద్దోళ్లకు ఫోన్ చేయడం పెద్ద సరదా...
మల్లికార్జునరావుపై గతంలో విశాఖపట్నంలో కేసు నమోదైంది. ఓ మహిళపై దాడికి సంబంధించిన కేసది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీ రాత్రి నిందితుణ్ణి పోలీసులు పట్టుకొచ్చారు. 24 గంటలు దాటినా అతను మత్తు నుంచి బయటపడలేదు. దీంతో విచారణ సాగలేదు. డిసెంబర్ 11 బుధవారం నిందితుణ్ణి విచారించే అవకాశం ఉంది.
తరచూ ప్రముఖుల నంబర్లు సంపాదించి వీలైతే వారిని కలిసేందుకు ప్రయత్నిస్తాడు. లేనిపక్షంలో వారికి ఫోన్లు చేయడం, లేదా ఎస్‌ఎంఎస్‌లు పంపడం చేస్తుంటాడని గుర్తించారు. పవన్‌కల్యాణ్‌ పేషీతో పాటు గతంలో డీజీపీకి, హోంమంత్రి అనిత తదితరులకు కూడా ఫోన్లు చేసినట్లు తేల్చారు. నిందితుడి కాల్‌డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
పవన్ కల్యాణ్ కి బెదిరింపు కాల్స్ రావటం పట్ల జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేతకు భద్రత పెంచాలని కోరుతున్నారు పార్టీ కార్యకర్తలు.
పవన్ కల్యాణ్ కు బెదిరింపు కాల్స్ రావటం, వార్నింగ్స్ ఇవ్వటం ఇది ఫస్ట్ టైం కాదు. సనాతన ధర్మం విషయంలో ఆయన ఉద్యమించినప్పుడు.. మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా.. బీజేపీ తరపున ప్రచారం చేసినప్పుడు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో పవన్ కల్యాణ్ భద్రత విషయంలో ఆందోళన నెలకొంది పోలీసులకు. ఆయనకు భద్రత పెంచాలని నిర్ణయించింది. అయితే ఎంత భద్రత పెంచుతారు.. ఎలాంటి భద్రత ఇవ్వనున్నారు అనేది పోలీస్ శాఖ పరిశీలిస్తుంది.
Read More
Next Story