పవన్ కళ్యాణ్ ను మాగుంట ఎందుకు కలిసినట్లు

ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం మిత్రపక్షాల అభ్యర్థి ఎవరనేది అభ్యర్థి విషయంలో సందిగ్ధం వీడలేదు.


పవన్ కళ్యాణ్ ను మాగుంట ఎందుకు కలిసినట్లు
x
పవన్ కళ్యాణ్ తో మాగుంట

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని చోట్ల ట్విస్ట్ లపై ట్విస్ట్ లు ఇస్తున్నాయి. రాజకీయాల్లో రారాజుగా ఒక వెలుగు వెలిగిన మాగుంట శ్రీనివాసులురెడ్డి పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో ఆయనకు కూడా అర్థం కావడం లేదు. ప్రస్తుతం కేవలం డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజల ముఖం తెలియని నాయకుడు ఇప్పటికిప్పుడు వచ్చి నాకు ఓటేయండని ప్రచారంలోకి వెళుతున్నాడు. ఆ పరిస్థితి మాగుంటకు ఉందా అంటే లేదనే చెప్పాలి. మరి ఎందుకు వైఎస్ జగన్ సీటు ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎందుకు ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో మాటా మంతి

బుధవారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కలిసారు. కొద్దిసేపు మాట కలిపారు. ఎందుకు కలిసారు. ఇంతవరకు ఎప్పుడూ కలవని మాగుంట శ్రీనివాసులురెడ్డి కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కొడుకు ఎంపీ కావాలని ఆయన కంటున్న కలలు కల్లలుగా మిగిలిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాఘవరెడ్డికి సీటు ఇవ్వలేమని, అనుభవం రిత్యా మీకే సీటు ఇస్తామని మాగుంటకు చంద్రబాబు చెప్పారు. ఆ విషయాన్ని ఇటీవల రాఘవరెడ్డి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. అంతవరకు బాగానే ఉన్నా ఇంతవరకు బాబు మాగుంట పేరును ప్రకటించకపోవడం వెను ఏదైనా మర్మం ఉందా? అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.

సపోర్టుకోసమేనా?

తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినా జనసేన సపోర్టు తనకు కావాలని చెప్పడం కోసం కలిసారా? లేక జనసేన, బీజేపీలలో ఎవరు టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని చెప్పారా? అనేవిషయమై చర్చ ఊపందుకుంది. చంద్రబాబు నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాకపోవడం, ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను కలవడంతో ఈ అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఒకవేళ చంద్రబాబు సీటు ఇవ్వకుంటే రాజకీయంగా ముందడుగు వేయలేని పరిస్థితి మాగుంట శ్రీనివాసులురెడ్డిది.

రాఘవరెడ్డి మద్యం కేసు అడ్డంకా?

మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఢిల్లీ మధ్యం కేసులులో అప్రువర్గా మారిన నిందితుడు. తాను ఏతప్పూ చేయలేదని, కవిత ఎలా చేయాలంటే అలా చేయాలని ఈడీ అధికారులకు చెప్పి రాఘవరెడ్డి అప్రువర్గా మారినట్లు సమాచారం. అదే నిజమైతే సీటు రాకపోవడానికి మధ్యం కుంభకోణం కేసు కారణమనే ప్రచారం కూడా ఉంది. రాఘవరెడ్డిని ఏ క్షణంలోనైనా ఈడీ అధికారులు విచారణకు పిలిచే అవకాశం ఉందని పలువురు మాగుంట కార్యాలయ ఉద్యోగులు చెప్పుకోవడం విశేషం. ప్రస్తుతం కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నందున క్రాస్ చెక్ చేసుకోవాలంటే రాఘవరెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందువల్లనే టిక్కెట్ ఇచ్చేందుకు చంద్రబాబు, బీజేపీ, జనసేన కూటమి కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం.


Next Story