NARA FAMILY | 19 ఏళ్లకే పెళ్లి చేశారని నారా భువనేశ్వరి ఎందుకన్నారు?
విద్యార్థులను చూస్తుంటే తనకు కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. నేనూ మీలాగే సరదాగా గడిపాను. కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయి.
"విద్యార్థులను చూస్తుంటే తనకు కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. నేనూ మీలాగే సరదాగా గడిపాను. కాలేజ్ డేస్ లైఫ్ అంతా గుర్తుంటాయి. నేను చదువుకుంటున్న సమయంలో 19 ఏళ్లకే పెళ్లి చేశారు. నాకు ఆ వయసులో ఏమీ తెలీదు. నా భర్త చంద్రబాబు నాపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు. ఒక ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశాను. విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థానాలకు వెళ్లాలి. ఆటపాటలతో పాటు కెరీర్ పైనా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విజయం ఊరికే రాదు.. కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చు. నా కుమారుడు లోకేశ్‌కి అదే చెప్పేదాన్ని" అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి చెప్పారు.
జీవితంలో కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలవదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు. కష్టపడితే విజయం సొంతమవుతుందని భువనేశ్వరి (Nara Bhuvaneswari) అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా డిసెంబర్ 19న కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. ఐటీ రంగంలోనూ మహిళలు రాణించాలని ఆకాంక్షించారు.
విజన్‌తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్లని.. ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారన్నారు.
చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని.. ప్రజలకు సేవ చేయాలని ఆయన తపిస్తారని భువనేశ్వరి అన్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర-విజన్ 2047 లక్ష్యంతో ముందుకెళుతున్నారని చెప్పారు. ‘‘పేదరికం లేని సమాజమే చంద్రబాబు లక్ష్యం. ఆయన్ను సొంత బిడ్డగా భావిస్తూ ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం మేం తీర్చుకోలేం. రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నాను’’ అని భువనేశ్వరి అన్నారు.
Next Story