స్పీకర్ అయ్యన్నకు ఎందుకు ఆగ్రహం వచ్చింది ?
అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్పీకర్ కు ఎమ్మెల్యేలు ఏమని ఫిర్యాదు చేశారంటే..
కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కాంట్రాక్టర్ ను కూడా మార్చాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ వేళల్లో భోజనాలు వడ్డించే కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పార్టీ 21 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్సిపి 11 సీట్లు కైవసం చేసుకోగా, టిడిపి కూటమిలోని భాగస్వామ్య బిజెపి సభ్యులు 8 మంది ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే..
రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉండగా, అందులో ఈసారి ఎన్నికల్లో ఏకంగా 81 మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారే. మిగతా వారిలో శాసనసభలో సీనియర్లే కాకుండా, కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన నాయకులు కూడా ఈసారి ఎమ్మెల్యేలుగా సభ్యులుగా ఉన్నారు.
అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేయడం సర్వసాధారణం. స్పీకర్ కార్యాలయం ద్వారా దీనిని పర్యవేక్షిస్తారు. అల్పాహారం, టీ, కాఫీ తో పాటు మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉంచుతారు. సాయంత్రం వేళ కూడా స్నాక్స్ తో పాటు టీ కాఫీలు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ సభ రాత్రి పొద్దుపోయే వరకు జరిగితే, భోజన సదుపాయం కూడా కల్పిస్తారు.
ఎమ్మెల్యేలతో పాటు డ్యూటీకి హాజరయ్యే అధికారులు సిబ్బంది, బందోబస్తుకు వచ్చే పోలీసులు, మీడియా ప్రతినిధులకు భోజనాలు వడ్డించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో ఇది సర్వసాధారణం. ఈ ఆహార పదార్థాలు వడ్డించే బాధ్యత కాంట్రాక్టు ఇస్తారు. ఆహార పదార్థాల్లో ఎక్కడ నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవడం అనేది ఆ కాంట్రాక్టర్ బాధ్యత. ఇదిలా ఉంటే..
2024 లో ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వంలో సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సిబ్బంది, ఎమ్మెల్యేలు, అధికారులు, మంత్రులు, విధులకు హాజరయ్యే సిబ్బంది కోసం ఓ కాంట్రాక్టర్ ద్వారా ఆహార పదార్థాలు అందించే కాంట్రాక్టు అప్పగించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం విధులకు హాజరైన ఎమ్మెల్యేలతో పాటు అందరికీ భోజనాలు వడ్డించారు. ఇందులో వ్యత్యాసం ఉన్నట్లు గ్రహించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఉండబట్టలేక స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిసింది.
మంత్రులకు ఒకరకంగా, తమకు మరోరకంగా ఆహార పదార్థాలు వడ్డించారని కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో "సభ్యులకు వేరుగా, ఇంకొందరికి మరోరకంగా భోజనం పెట్టారా" అని తన కార్యాలయ అధికారులపై స్పీకర్ అయిన పాత్రుడు ఆగ్రహg వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారి సమాధానంతో సంతృప్తి చెందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు
"అందరికీ ఒకేలా భోజనం వడ్డిస్తే నేను ఎందుకు అడుగుతా" అని నిలదీసినట్లు తెలుస్తోంది. "అన్నం, ఆహార పదార్థాల్లో తేడా లేకుంటే నాకు ఫిర్యాదులు ఎందుకు వచ్చాయి" అని అధికారులు సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
తమాషా అనుకున్నారా?
అసెంబ్లీ అంటే తమాషా అనుకుంటున్నారా? అని కూడా స్పీకర్ అయిన పాత్రుడు అధికారులతో పాటు కాంట్రాక్టర్ పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు నిలవడ్డాయి. ఎమ్మెల్యేలకు ఒక రకంగా మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులకు ప్రత్యేకంగా భోజనాలు వడ్డించడంపై స్పీకర్ అయిన పాత్రుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. శాసనసభ జరిగే సందర్భాల్లో భోజనాల సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్న సంస్థ ను బాధితుల నుంచి తప్పించినట్లు తెలిసింది. కొత్త కాంట్రాక్టర్కు ఆ బాధ్యత అప్పగించడానికి అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story