నాగబాబు అంతమాట అనేశాడేంటీ? ఎవర్ని ఉద్దేశించి?
x
Nagababu

నాగబాబు అంతమాట అనేశాడేంటీ? ఎవర్ని ఉద్దేశించి?

జనసేన పార్టీలో మూడో ప్లేస్ లో ఉన్న కొణిదెల నాగబాబు అంతమాట అనేశారేమిటీ? ఎవర్ని ఉద్దేశించి అంతమాటన్నారు? నాగబాబుకు టీడీపీతో పొత్తు ఇష్టం లేదా?


నసేన పార్టీలో మూడో ప్లేస్ లో ఉన్న కొణిదెల నాగబాబు అంతమాట అనేశారేమిటీ? ఎవర్ని ఉద్దేశించి అంతమాటన్నారు? నాగబాబుకు టీడీపీతో పొత్తు ఇష్టం లేదా? చంద్రబాబును ఉద్దేశించే అంతమాట అన్నారా? అనే అనుమానాలకు తావిచ్చింది గురువారం నాగబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్వీట్) లో పెట్టిన పోస్ట్. కన్ఫ్‌యూషియస్‌ కొటేషన్‌ని ఎక్స్‌లో షేర్‌ చేస్తూ పరోక్షంగా అటు చంద్రబాబు, ఇటు పవన్‌ కల్యాణ్‌కు చురకలు అంటించారని నెటిజెన్స్ చెలరేగిపోతున్నారు.


‘వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెదవనీ గౌరవించక్కర్లేదు, ఎందుకంటే వెదవలు కూడా పెద్దవాళ్లువుతారు’ అనే కన్ఫ్‌యూషియస్‌ కొటేషన్‌ని నాగబాబు ఎక్స్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. జనసేన టీడీపీ, బీజేపీ కూటమిలో చేరడంపై నాగబాబు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారన్న నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ చంద్రబాబును ఉద్దేశించేనని వైసీపీ అనుకూల మీడియా వారు చెబుతుంటే అది చేగొండి హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లను ఉద్దేశించి అని ఉంటారని జనసేన పార్టీ అనుకూలురులు వ్యాఖ్యానిస్తున్నారు. సీట్ల కేటాయింపుల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నుసన్నుల్లోనే జరుగుతుండడం జనసైన్యానికి మింగుడు పట్టడం లేదు. కొంతమంది బహిరంగంగా బాబు తీరును విమర్శిస్తుంటే.. మరికొంతమంది అంతర్గతంగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

నాగబాబు సీటు లేదా..

గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి పోటీ చేసిన నాగబాబు ఈసారి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. అయితే పొత్తులో ఆ సీటు టీడీపీకి వెళ్లింది. ఈ విషయంపై నాగబాబు కినుక వహించినట్టు కూడా సమాచారం. తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీ అధినేత చంద్రబాబును గుడ్డిగా నమ్ముతున్నారనే అభిప్రాయంతో నాగబాబు ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నా ఆయన ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా తన అసంతృప్తిని వెల్లడించారన్న ప్రచారమూ నడుస్తోంది.

నెటిజన్ల కామెంట్లు ఎలా ఉన్నాయంటే..

ఎన్నికల నేపథ్యంలో నాగబాబు ట్వీట్ ను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు అర్థం చేసుకుంటున్నారు. తలాఒక కామెంట్ చేస్తున్నారు. వాటిలో కొన్ని ఇలా... ‘వయసులో బాగా పెద్దవారైనా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఇలా మాట్లాడటం చాలా తప్పు, పైగా మీ పార్టీ టీడీపీతో పొత్తుతో ఉందన్న సంగతి మర్చిపోవద్దు, పొత్తు ధర్మాన్ని పాటించండి’ ‘ఇది అయితే చంద్రబాబు నే అంటున్నావ్ అని క్లియర్ గా తెలుస్తుంది....లేదంటే మోడీని’, ‘అయ్యో మీరు ఇలా డైరెక్ట్ గా చంద్రబాబుని అనడం చాలా తప్పు’ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

Read More
Next Story