ఇంకా పెండింగ్ ఎందుకు పవన్ కల్యాణ్?
x

ఇంకా పెండింగ్ ఎందుకు పవన్ కల్యాణ్?

‘తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడుదురు’ అనే బైబిల్ సూత్రానికి అనుగుణంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారా?


టీడీపీ పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు తీసుకుంటామని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో చేతులు కలిపిన తర్వాత మరో మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు సీటు తగ్గించుకున్నారు. ‘తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడుదురు’ అనే బైబిల్ సూత్రానికి అనుగుణంగా పవన్ కల్యాణ్.. జగన్ ను ఓడించేందుకు ఎవరు ముందుకు వచ్చినా తానే సీట్లు త్యాగం చేస్తున్నట్టుగా వ్యాఖ్యానాలు వినిపించినా వాస్తవంలో జరిగింది మాత్రం అదే. 24 సీట్లు అని చెప్పి మరో మూడు సీట్లు తగ్గించుకున్నారు. ఇప్పుడు పోటీ చేస్తానంటున్న 21 సీట్లలోనూ మరొకటి త్యాగం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే 21 సీట్లలో ఇప్పుడు 18 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఎన్నికల ప్రకటన వెలువడి వారం గడుస్తున్నా కూటమిలో సీట్ల పంపకం కొలిక్కిరాలేదు. 18 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించేందుకే సుదీర్ఘకాలం పడితే మొత్తం 175 సీట్లు పోటీ చేయాలనుకుంటే అభ్యర్థుల ఎంపికకే సమయం సరిపోయేదా అని వైసీపీ నేతలు ప్రత్యేకించి పేర్ని నానీ, అంబటి రాంబాబు లాంటి వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇలా ఉంది..

1. కొణిదెల పవన్ కళ్యాణ్ – పిఠాపురం

2. పంతం నానాజీ - కాకినాడ రూరల్

3. కందుల దుర్గేష్ – నిడదవోలు

4. కొణతాల రామకృష్ణ – అనకాపల్లి

5. లోకం మాధవి – నెల్లిమర్ల

6. బొలిశెట్టి శ్రీనివాస్ – తాడేపల్లిగూడెం

7. బొమ్మిడి నాయకర్ – నర్సాపురం

8. పంచకర్ల రమేష్ బాబు – పెందుర్తి

9. సుందరపు విజయ కుమార్ – యలమంచిలి

10. ఆరాని శ్రీనివాసులు – తిరుపతి

11. పత్సమట్ల ధర్మ రాజు – ఉంగుటూరు

12. పులపర్తి రామాంజనేయులు – భీమవరం

13. వంశీ కృష్ణ యాదవ్ - వైజాగ్ సౌత్

14. బత్తుల బలరామ కృష్ణ – రాజానగరం

15. నాదెండ్ల మనోహర్ – తెనాలి

16. దేవ వర ప్రసాద్ – రాజోలు

౧౭ గిడ్డి. సత్యనారాయణ - పి గన్నవరం

18. చిర్రి బాలరాజు - పోలవరం



Read More
Next Story