ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశి, గుడివాడలోని నాని ఇళ్లపై ఎందుకు దాడులు జరిగాయి. కారణాలు ఏమిటి? ఏమి జరిగిది?
కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (నాని), వల్లభనేని వంశి కృష్ణలు స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారా? వారు ఇళ్ల నుంచి బయటకు ఎందుకు రాలేదు. గన్నవరంలోని వంశి, గుడివాడలోని నాని ఇళ్లపై దాడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకు ప్రయత్నించారు. వంశి ఇంటిపైకి రాళ్లు రువ్వారు. డోరు నెట్టుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. స్థానిక పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. బూతులు తిడుతూ ఇంటి ముందు వందల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూగారు.
గుడివాడలోని నాని ఇంటి ముందు వందల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుమికూడారు. ఇంటిపైకి రాళ్లు రువ్వారు. కోడుగుడ్లతో దాడి చేశారు. అరేయ్ నానిగా... ఇప్పుడు బయటకు రారా అంటూ హ్యాండ్‌మైక్‌లో రికార్డు చేసి ఇంటి ముందు వెళ్లిన తరువాత ఆన్ చేసి వినిపించారు. తెలుగుదేశం పార్టీ జెండాలు కప్పుకుని ఇంట్లోకి దూరేందుకు ప్రయత్నించారు. పోలీసులు నచ్చ జెబుతున్నా నెట్టుకుని పోయేందుకు ప్రయత్నించారు. అయితే నాని వర్గీయులు కానీ, నాని కానీ ఇంట్లో నుంచి బయటకు రాలేదు. నలుగురు పోలీసులు కార్యకర్తలను అదుపు చేసి వెనక్కి పంపించారు.
వీరిద్దరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ ఇదే విధమైన ఆందోళనలు జరిగాయి. మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి ముందు కూడా చాలా మంది బూతులు తిడుతూ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అక్కడి వాని కూడా పోలీసులు వారించి వెనక్కి పంపించారు. అనంతపురం, గుంటూరు జిల్లాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి ఏర్పడింది. గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పల్నాడు జిల్లాలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి.
ఇందుకు కారణాలు ఏంటనేదానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. చంద్రబాబునాయుడు భార్య పేరు ప్రస్తావించకుండానే చంద్రబాబును, కుమారుడు లోకేష్‌ను అవమానించే విధంగా మాట్లాడారు. విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడంతో విధిలేని పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏడ్చారు. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగుదేశం కార్యకర్తల్లో నిప్పు రగిల్చింది.
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా తమను నానా ఇబ్బందులు పెట్టారని పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. గుడివాడలో క్యాషినో ఏర్పాటు చేసినప్పుడు కొడాలి నాని, ఆయన అనుచరులు చేసిన హంగామా అంతా ఇంతా కాదని స్థానికులు చెప్పడం విశేషం. సాదారణంగా ఎన్నికలు అయిపోగానే వేరే ప్రాంతాలకు ప్రశాంతత కోసం వెళతారు. అయితే ఈ సారి ఎన్నికల్లో వీరు ఓడిపోవడంతో నాని బయటకు వెళ్లలేదు. వంశి మాత్రం వెళ్లి వచ్చారు. నాని ఎక్కువ బెంగుళూరు, హైదరాబాద్ కేంద్రాలుగా వ్యాపారాలు చేసుకుంటుంటారు. త్వరలోనే నాని దుబాయ్ వెళతాడనే ప్రచారం సాగుతోంది. దీనిని నాని ధృపవరచలేదు. వంశి కూడా అమెరికా వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే తమ పిల్లలను చదువుల కోసం అమెరికాకు పంపించారు. ఏమైనా వీరి నోటి దురుసు ఇంత పని చేసిందని పలువురు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఇష్టానుసారం బూతులు తిడుతూ చంద్రబాబును అవమాన పరిచిన నందును ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో టీడీపీ కార్యకర్తలు దాడులకు ప్రయత్నించినట్లు సమాచారం.
Next Story