సత్యవర్థన్ కిడ్నాప్ అయ్యాడని సోదరుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరెవరు? వంశీ కి వీరికి సంబంధం ఏమిటి? పోలీసులు ఏమి చేశారు?


ఆంధ్రప్రదేశ్ లో చర్చనియాంశమైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ లో పలు కోణాలు ఉన్నాయి. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకునే లోపు అంతా అయిపోయింది. ముందుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. హైదరాబాద్ లోని వంశీ ఇంటికి పోలీసులు వెళ్లారు. తమరిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తే అవన్నీ తరువాత చెబుతామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి ప్రశ్నించడం మొదలు పెట్టే వరకు కేసు ఏమిటనేది శంశీకి తెలియలేదు.

పోలీసులు భయంతో శోధించారు..

గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కాస్త ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా మారింది. ఆ తరువాత పోలీసులే తనతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని వల్లభనేని వంశీ పై తప్పుడు కేసు పెట్టారని ముదునూరి సత్యవర్థన్ అనే వ్యక్తి మూడు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కేసుల విచారణ న్యాయస్థానంలో జడ్జి ముందు వాగ్మూలమిచ్చారు. దీంతో పోలీసులు తప్పుడు వారయ్యారు. కేసు ఇలా అడ్డం తిరిగిందేమిటని వెంటనే ఆలోచించారు. సత్యవర్థన్ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే వాడు. పార్టీ ఆఫీసుపై దాడి జరగటానికి ఆరు నెలల ముందు ఉద్యోగంలో చేరాడు. దాడి సమయంలో జరిగింది చూశాడు. దీంతో సత్యవర్థన్ ద్వారా నాటి తెలుగుదేశం పార్టీ నాయకులు అట్రాసిటీ కేసు పెట్టించారు. ఈ కేసు తిరిగి తమపైకే రావడంతో దిక్కుతోచని పోలీసులు అసలేం జరిగిందో ఆరా తీశారు.

సత్యవర్థన్ తల్లిదండ్రులను సంప్రదించిన పోలీసులు

ఉన్నట్లుండి సత్యవర్థన్ కోర్టు వాయిదాకు వచ్చాడు. తాను కేసే పెట్టలేదని చెప్పాడు. అసలు ఎక్కడ ఉంటున్నాడు. ఏమి చేస్తున్నాడని పోలీసులు సత్యవర్థన్ తల్లిదండ్రులను ప్రశ్నించారు. దీంతో సత్యవర్థన్ సోదరుడు కిరణ్ పోలీసుల వద్దకు వచ్చి సత్యవర్థన్ ను వంశీ మనుషులు కిడ్నాప్ చేశారని, వారి నుంచి రక్షించాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయం బయట పడకుండా జాగ్రత్తలు తీసుకుని వంశీ అనుచరుల ఫోన్స్ ట్రాప్ చేశారు. దీంతో విషయం బయట పడింది. వెంటనే సత్యవర్థన్ ఉన్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఇంటి వద్ద ఉన్న వంశీ వద్దకు వెళ్లి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎందుకు ఏమిటనే విషయాలు విజయవాడ పోలీస్ కమిషనర్ వద్ద తెలుసుకోవచ్చని చెప్పి విజయవాడకు తీసుకొచ్చారు.

కిరణ్ రిపోర్టుతో కేసు

సత్యవర్థన్ సోదరుడు కిరణ్ రిపోర్టుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి హింసించి కేసుకు సంబంధం లేదని సంతకాలు చేయించుకుని వాగ్మూలం తీసుకున్నారని గురువారం కోర్టులో జడ్జి ఎదుట పోలీసులు సత్యవర్థన్ నుంచి చెప్పించారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న 40 మంది వ్యక్తులకు బెయిల్ నిరాకరిస్తున్నట్లు కోర్టు చెప్పింది.

సత్యవర్థన్ ఏమి చేస్తున్నాడు..

సత్యవర్థన్ తల్లిదండ్రులు రామవరప్పాడులో నివాసం ఉంటున్నారు. తండ్రి ప్రసాద్ లారీ డ్రైవర్, తల్లి గృహిణి. ఇక్కడ ఉంటే ఏదో ఒక సమస్య వస్తుందని హైదరాబాద్ వెళ్లి కొరియర్ బాయ్ గా సత్యవర్థన్ పనిచేసుకుంటున్నాడు. విజయవాడలో ఉండగానే వంశీ మనుషులు కిడ్నాప్ చేశారు. తనకు కిడ్నాప్ చేసిన వారితో ఎటువంటి సంబంధం లేదని చెప్పినా ఆధారాలు ఉన్నాయని వంశీకి పోలీసులు చెప్పారు.

అనుకున్న దొకటి.. అయిందొకటి..

పార్టీ ఆఫీసుపై దాడి సంఘటనలో తాను లేనని, కావాలని తనను కేసులో ఇరికించారని కోర్టులో చెప్పుకుని బెయిల్ తీసుకున్న వంశి అసలు కేసు నుంచే తప్పించుకోవాలనుకున్నాడు. కేసు పెట్టిన వ్యక్తిని తీసుకొచ్చి తాను కేసే పెట్టలేదని చెప్పించారు. కేసు అయిపోయిందనుకున్నారు. పోలీసులు ఇరుక్కునే పరిస్థితి రావడంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులు జరిగిన విషయం తెలుసుకుని వేగం పెంచి అరెస్ట్ చేశారు.

Next Story