
ఆపరేషన్ అభ్యాస్ ఎందుకు నిర్వహించారంటే...
యుద్ధ సమయాల్లో మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తారు? దానివల్ల జరిగే మేలు ఏమిటీ? కేంద్రం ఎందుకు ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించమని ఆదేశించిందీ? అసలు మాక్ డ్రిల్ అంటే
యుద్ధ సమయాల్లో మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తారు? దానివల్ల జరిగే మేలు ఏమిటీ? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించమని ఆదేశించిందీ? అసలు మాక్ డ్రిల్ అంటే ఏమిటో చూద్దాం. ఆపత్కాలలో దెబ్బతీయకముందే, సమయానికి స్పందించి ప్రాణాలను కాపాడే మార్గం ఈ మాక్ డ్రిల్. ఇది కేవలం భావోద్వేగం కాదు. శాస్త్రీయంగా ఆమోదించిన మార్గం. ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు (Mock Drills) జరిగాయి. పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్స్ జరిగాయి.
మాక్ డ్రిల్ అంటే ఏమిటి?
మాక్ డ్రిల్ అనేది ఒక అత్యవసర శిక్షణ. అనుకోని విపత్తులు జరిగినపుడు ఎలా స్పందించాలో ముందుగానే ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా దళాలు, పౌరులంతా కలిసి ప్రాక్టీస్ చేయడం దీని లక్ష్యం.
ఈ డ్రిల్లుల్లో ఉగ్రదాడి, అగ్ని ప్రమాదం, రసాయన లీక్, భూకంపం లాంటి ప్రమాదకర పరిస్థితుల మాదిరిగా ఒక వాతావరణాన్ని సృష్టించి అధికారులు, ప్రజలు కలిసి ఎలా స్పందించాలో అధ్యయనం చేస్తారు.
ఆపరేషన్ అభ్యాస్ అంటే...
"ఆపరేషన్ అభ్యాస్" పేరుతో కేంద్రప్రభుత్వం మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించమని పిలుపిచ్చింది. ఈ మాక్ డ్రిల్ ప్రధానంగా అంతర్గత భద్రత, ప్రజల భౌతిక రక్షణ, విపత్కర సమయాల్లో సమన్వయం వంటి అంశాలపై దృష్టి పెట్టింది.
అసలు ఏమి చేస్తారంటే.. ప్రత్యేక అలర్ట్‌తో సాయంత్రం 4 గంటలకు సైరన్ మోగించారు. అప్రమత్తతే ప్రథమ కర్తవ్యంగా ప్రజలకు సూచనలు చేస్తారు. సైరన్ మోగగానే ప్రజలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇంట్లో ఉన్నవారు ఇంట్లోనే ఉండాలి. రోడ్డు మీద ఉన్నవారు సమీప భవనాల్లోకి వెళ్లాలి. వాహనాల్లో ఉన్నవారు వాహనాలను ఆపి, సురక్షిత ప్రాంతాలకు చేరాలి.
ఆయా మున్సిపాలిటీల సిబ్బంది, పోలీసు, వైద్య, ఫైర్ సర్వీసులు, NDRF/SDRF బృందాలు సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. ఇది కేవలం ప్రతికూల పరిస్థితులపై ముందస్తు కసరత్తు మాత్రమే. భయపడాల్సిన అవసరం లేదు.
ఏదైనా దాడి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తే...
ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫేక్ న్యూస్ పసిగట్టాలని, పుకార్లను నమ్మవద్దని హెచ్చరికలు జారీ చేస్తారు. నిఘా ఏర్పాటు చేస్తారు.
వైద్య సిబ్బంది, సైనిక బలగాలు, రెస్క్యూ టీంలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశిస్తారు.
ప్రజల భాగస్వామ్యమే కీలకం..
ఇది కేవలం నగరాలకో, పట్టణాలకో పరిమితం అయ్యే సమస్య కాదు. దేశవ్యాపిత సమస్య. ఢిల్లీ, మహారాష్ట్ర, విశాఖపట్నం, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మాక్ డ్రిల్లులు మే 7న సాయంత్రం 4 గంటలకు జరిగాయి.
అణు ఇంధన కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు వంటి ప్రాధాన్య ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రిల్లులు నిర్వహించారు.
విద్యార్థులు, ఉద్యోగులు, వైద్య సిబ్బంది, రక్షణ బలగాలు ఇందులో పాల్గొన్నారు.
మాక్ డ్రిల్ ప్రజల ప్రయోజనానికే...
ఒక్కసారిగా పరిస్థితి విషమిస్తే మనం ఏమి చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరి మాట వినాలి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియక చనిపోతున్నట్లయితే అది మన సిస్టమ్ వైఫల్యం. దాన్ని నివారించేందుకే ఈ మాక్ డ్రిల్లులు.
మాక్ డ్రిల్ అనేది భయపెట్టే కసరత్తు కాదు. భద్రతపై అవగాహన కల్పించే చర్య. ప్రజల భాగస్వామ్యం దీనిలో ఎంతో అవసరం. జాగ్రత్తగా ఉండండి. సైరన్ వినిపిస్తే స్పందించండి. మాక్ డ్రిల్లులో పాల్గొనండి. ప్రమాదాన్ని ముందే ఎదుర్కొని జీవితాన్ని కాపాడుకోండి. ఇదీ మాక్ డ్రిల్ సందేశం.
Next Story