సంఘటన జరిగిన తరువాత ఏడాదిన్నరకు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సెక్షన్ లు ఎందుకు మార్చారని జడ్జి హిమబిందు న్యాయవాదిని ప్రశ్నించారు.


గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసు మలుపులు తిరుగుతోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ తో మరో సారి చర్చనియాంశమైంది. వంశీ బెయిల్ పిటీషన్ హైకోర్టులో ఉండగా ఈ అరెస్ట్ జరిగింది. రెండు నెలల నుంచి వంశీ ని అరెస్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా వంశీ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఆయన వారికి కనిపించటం లేదని పోలీసులు చెబుతూ వచ్చారు. సడీ చప్పుడు లేకుండా బుధవారం రాత్రి హైదరాబాద్ లోని తన ఇంట్లోనే విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేశారు.

11 నుంచి 88కి పెరిగిన నిందితులు

మొదట 11 మందిపై కేసు నమోదు కాగా ఇప్పటికి మూడు సార్లు 88 మందిపై కేసు పోలీసులు నమోదు చేశారు. రెండో సారి నిందితులను కేసులో చేర్చే క్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీ పేరును కూడా చేర్చారు. అప్పటి వరకు పార్టీ ఆఫీసుపై దాడి కేసుగా ఉన్న సెక్షన్లు రెండో సారి నిందితులను కేసులో చేర్చేటప్పుడు అట్రాసిటీ కేసుగా మారింది. కేసులో సెక్షన్లు మారాయి. అట్రాసిటీ కేసులో వంశీ మోహన్ ను అరెస్ట్ చేయాలని భావించిన పోలీసులు చివరకు సక్సెస్ అయ్యారు. అయితే మూడు రోజుల క్రితం విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టుకు హాజరైన ఫిర్యాదుదారు ముదునూరు సత్యవర్థన్ తాను కేసే పెట్టలేదని జడ్డి ఎదుట వాగ్మూలమిచ్చారు. ఆయన వాగ్మూలాన్ని జడ్జి రికార్డు చేశారు.

కేసులో సెక్షన్ లు ఎందుకు మార్చారు?

కేసు విచారణ సమయంలో జడ్జి హిమబిందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆసక్తికర ప్రశ్న వేశారు. కేసులో సెక్షన్ లు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. అందుకు న్యాయవాది సమాధాన మిస్తూ గతంలో కేసు నమోదు చేసిన పోలీసులు సరిగా విధులు నిర్వహించలేదని, కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రస్తుత పోలీసుల తిరిగి విచారణ జరిపి సెక్షన్లు మార్చారన్నారు. దీంతో కోర్టులోని వారు చాలా మంది నవ్వుకున్నారు. పార్టీ ఆఫీసుపై వంశీ అనుచరులు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు చాలా మంది వద్ద ఉన్నాయి. ఇందులో సెక్షన్ లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ప్రశ్న. ముదునూరు సత్యవర్థన్ తనను పార్టీ ఆఫీసులో ఉండగా కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేయడంతో అట్రాసిటీ సెక్షన్స్ పోలీసులు కేసులో చొప్పించారు. ఎవరైతే ఫిర్యాదు చేశారని పోలీసులు చెబుతున్నారో ఆ ఫిర్యాదు తాను చేయలేదని జడ్జి ముందు వాగ్మూలం ఇవ్వడంతో జడ్జి అడిగిన ప్రశ్నకు ప్రాధాన్యత సంతరించుకుంది.

పోలీసులపై చర్యలు ఉంటాయా?

తనను కులం పేరుతో దూషించారని కానీ, పార్టీ ఆఫీసులో ఉండగా తనను కొట్టేందుకు వంశీ అనుచరులు వచ్చారని కానీ తాను ఫిర్యాదు చేయలేదని, సాక్షిగా కోర్టుకు వచ్చి ఆఫీసులో మీరు ఏమి చూశారో అది చెబితే సరిపోతుందని మాత్రమే తన నుంచి తెల్లకాగితంపై పోలీసులు సంతకం చేయించుకున్నారని, ఆ తరువాత వారే తాను ఫిర్యాదు చేసినట్లు కేసు రానుకున్నారని తెలిసిందని సత్యవర్థన్ చెప్పటంతో కేసు పలు మలుపులు తిరిగింది. దాడి కేసును అట్రాసిటీ కేసుగా మార్చిన పోలీసులపై ఏ విధమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎందుకు అట్రాసిటీ కేసుగా దాడి కేసును మార్చారనే అంశంపై ప్రత్యేకంగా విచారణకు కోర్టు ఆదేశించే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రజల్లో జర్చ జరుగుతోంది.

అరెస్ట్ తో హై అలర్ట్

ముందస్తు బెయిల్ పిటీషన్ హైకోర్టులో ఉండగా వంశీ ని అరెస్ట్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వంశీ అనుచరుల నుంచి ఎక్కడైనా, ఎవరిపైనైనా దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గన్నవరం మండల కేంద్రంలో పోలీసు బందోబస్త్ పెంచారు. విజయవాడలో కూడా పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. పోలీసులు బుధవారం తెల్లవారు ఝామున 5గంటలకు పోలీసలు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారు. కొద్దిసేపట్లో విజయవాడ చేరుకుంటారు. ఆ తరువాత కోర్టులో హాజరు పరుస్తారు.

లోకేష్ మాట నెరవేరిందా?

వంశీ ని తప్పకుండా అరెస్ట్ చేస్తామని, నా తల్లిని అవమానించిన వారిని వదిలే ప్రసక్తే లేదని లోకేష్ ప్రతిజ్ఞ చేశారు. ఆ మేరకు వంశీ అరెస్ట్ కావడంతో లోకేష్ ప్రతిజ్ఞ నెరవేరినట్లైది. వంశీని కోర్టులో హాజరు పరచగానే బెయిల్ వస్తుందా? రిమాండ్ కు పంపిస్తారా? అనే అంశంపై ప్రజల్లో చర్చ నడుస్తోంది. వంశీ అనుచరులు చాలా మంది కోర్టు వద్దకు చేరుకుంటున్నారు.

Next Story