వివేకా కుమార్తె సునీత కడప ఎస్పీని ఎందుకు కలిసినట్టు?
x

వివేకా కుమార్తె సునీత కడప ఎస్పీని ఎందుకు కలిసినట్టు?

వివేకా హత్య కేసు గాల్లో కలిసినట్టేనా?


మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత దంపతులు కడప ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిశారు. వివేకా హత్య కేసు (Viveka Murder case) తాజా పరిణామాలను ఎస్పీకి సునీత, రాజశేఖర్‌రెడ్డి వివరించారు. సుప్రీంకోర్టులో నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్‌ దృష్ట్యా ఎస్పీతో వారు సమావేశమయ్యారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిరోజులుగా పులివెందులలో జరిగుతున్న ఘటనలు చూస్తుంటే మా నాన్న(వివేకా) హత్య గుర్తుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మా నాన్న వివేకా హత్య గుర్తొస్తోంది. గొడ్డలిపోటుతో వివేకా పడి ఉంటే అప్పుడు గుండెపోటు అని చెప్పారు. గతంలో టీడీపీ నేతలు చంపారని నమ్మబలికారు. పోలీసులను బెదిరించి క్రైమ్‌ సీన్‌ను తుడిచేశారు. హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి మా నాన్నను ఆదినారాయణరెడ్డి, సతీశ్‌రెడ్డి, బీటెక్‌ రవి చంపినట్లు సంతకం చేయమంటే నేను చేయలేదు. అవినాష్‌రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు.
ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది. మా బంధువు సురేశ్‌పై అవినాష్‌ అనుచరులు దాడి చేయించారనే అనుమానముంది. ఆరేళ్లుగా వివేకా హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నా. ఇప్పటి వరకు దోషులకు శిక్ష పడలేదు. వివేకాను నేను, నా భర్త చంపించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి’’ అని సునీత అన్నారు.
ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు పూర్తి చేసినట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు మెట్లు ఎక్కకుండానే ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. సునీతకు హామీ ఇచ్చిన టీడీపీ కూడా ఇప్పుడు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read More
Next Story