జూన్ 2 వరకే ఉమ్మడి రాజధాని..ఆ తర్వాత ఏపీ పరిస్థితి ఏంటి..?
x

జూన్ 2 వరకే ఉమ్మడి రాజధాని..ఆ తర్వాత ఏపీ పరిస్థితి ఏంటి..?

2 జూన్ 2014న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు విడివడ్డాయి. అప్పుడు హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..


2 జూన్ 2014న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు విడివడ్డాయి. అప్పుడు హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం వచ్చ నెల జూన్ 2తో విభజన చట్టంలో పేర్కొన్నట్లు ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగుస్తుంది. ఈ లోపు ఆంధ్రకు కొత్త రాజధాని నిర్మాణం జరగాలన్నది అసలు ప్లాన్ కానీ.. ఇప్పటికి కూడా ఆంధ్ర రాజధాని ఎక్కడ అనేది కూడా తేల లేదు. ఇప్పుడు దేశమంతా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. జూన్ 4 ఫలితాల విడుదల తర్వాత ఎన్నికల కోడ్ ముగుస్తుంది. అంతలోనే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసి రెండు రోజులు అయి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాజధాని ఏది అవుతుంది? ఈ విషయంలో ఆంధ్ర నేతల డిమాండ్స్‌ ఎలా ఉన్నాయి?

ఇప్పటికీ పూర్తికాని పంపకాలు

ఆంధ్ర, తెలంగాణ విభజన సమయంలో చేసుకున్న చట్టం ప్రకారం జరగాల్సిన ఆస్తుల పంపకాలు ఇప్పటివరకు జరగలేదు. దీనిపై ఇప్పటికే ఆంధ్రలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకున్నట్లు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఉమ్మడి రాజధాని హోదా కూడా హైదరాబాద్‌కు తొలగనుంది. విభజన చట్టంలో చెప్పుకున్న ఆస్తుల పంపకానికి పెట్టుకున్న గడువు కూడా జూన్ 2తో ముగియనుంది. ప్రస్తుతం ఆంధ్రలో ఎన్నికల పోలింగ్ జరిగి ఉండటం.. జూన్ 4న ఫలితాలు రానుండటంతో ఈ విషయంపై అంతా సందిగ్దత ఏర్పడి ఉంది. ఇప్పుడు ఆంధ్ర నేతలు ఏం చేస్తారు అన్నది అర్థంకాకున్నాది.

కొత్త సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో?

జూన్ 4న విడుదలయ్యే ఫలితాల్లో తాము మెజార్టీ సాధిస్తామంటూ తాము గెలుస్తామంటూ ఆంధ్రలో వైసీపీ, టీడపీ కూటమి పార్టీలు జబ్బలు చర్చుకుంటున్నాయి. ఇంతలోనే ఉమ్మడి రాజధాని చేజారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ నిర్ణయం తీసుకుంటారా? లేకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత రాష్ట్ర కొత్త సీఎం ఈ అంశంపై ఆలోచన చేస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానుండటం.. జూన్ 2న ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియనుండటంతో ఈ విషయంలో అంతా అయోమయమే కమ్ముకుని ఉంది.

ఏపీ నేతల డిమాండ్ ఇది

ఈ నేపథ్యంలో మరికొన్నాళ్ల పాటు హైదరాబాద్‌ను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఆంధ్ర నేతలు కోరుతున్నారు. ఆ దిశగానే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఆంధ్రకు కొత్త సీఎం వచ్చే వరకు హైదరాబాద్‌ను ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉంచాలని వీవీ లక్ష్మీనారాయణ.. కేంద్రాన్ని కోరుతున్నారు. ఆంధ్రలో కొత్త సీఎం ఎవరన్నది తేలిన తర్వాత.. రాజధాని అంశంపై వారు నిర్ణయాలు తీసుకుంటారని, అప్పటివరకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండటానికి హైదరాబాద్‌నే రాజధానిగా కొనసాగించాలని ఆయన వివరించారు. ఈ సందర్భంగానే హైదరాబాద్‌ను మరో 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ ఇటీవల డిమాండ్ చేశారు.

Read More
Next Story