
హిడ్మా
మావోయిస్టు నేత హిడ్మాను ఇంత దారుణంగా చంపేస్తారా?
చంద్రబాబూ, ఇంత అన్యాయంగా చంపిస్తారా అని ప్రశ్నించిన సీపీఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ
సిపిఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు, ఒకటవ బెటాలియన్ కమాండర్ హిడ్మాను కాల్చిచంపారే తప్ప అది ఎన్‌కౌంటర్ కాదని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అభిప్రాయపడింది. హిడ్మాను, ఆయన సహచరి రాజక్క, మరో నలుగుర్ని మారేడుమిల్లీ అటవీ ప్రాంతంలో బూటకపు ఎదురు కాల్పులు పేరుతో కాల్చి చంపారని న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు పి.ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఖండించారు.
ఇది దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాల్లో రక్షణ తీసుకుంటున్న కొంతమంది మావోయిస్టు పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకొంటున్నారని, వారందర్నీ తక్షణమే కోర్టుకు హాజరుపరచాలని డిమాండ్ చేశారు.
2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత నిర్మిస్తానని, ఆపరేషన్ కగార్ పేరుతో అమిత్ షా రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ మానవ హన నానికి పాల్పడుతున్నదని ప్రసాద్, చిట్టిపాటి ఆరోపించారు. "మావోయిస్టు పార్టీ నాయకులను బూటకపు ఎన్‌కౌంటర్లు పేరుతో కాల్చి చంపడంలో కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కయింది. ఫలితంగా ఆంధ్రాలో వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసిన వారిని బూటకపు ఎదురు కాల్పులకు పాల్పడింది. మావోయిస్టు పార్టీ సానుభూతి పరులను, కార్యకర్తలను నాయకులను వెంటనే కోర్టులో హాజరు పరచాలి" అని న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది.
మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నట్టు పి ప్రసాద్,
చిట్టి పాటి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిప్పిరి తిరుపతిని కోర్టులో హాజరుపర్చండి..
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకులు తిప్పరి తిరుపతి(దేవ్ జి)నీ పోలీసుల అదుపులో ఉన్నారని ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయనకు ప్రాణహానీ ఉన్నందున తక్షణమే కోర్టులో హాజరు పరచాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. ఆయనతోపాటు మరో 50 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ లో వివిధ సెంటర్లలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసిందని, వారందర్నీ కోర్టులో హాజరు పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లాకు సమీపంలోని సుక్మా అటవీ ప్రాంతంలో మరణించినట్టు పోలీసులు ప్రకటించారు. ఆయన్ను పట్టుకుంటే ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టుల ఉనికిని రూపుమాపినట్టేనన్న భద్రతా దళాల అంచనా నేపథ్యంలో హిడ్మా మరణించారు. మేలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ చనిపోవడం, అక్టోబర్‌లో మల్లోజుల వేణుగోపాల్ రావు (ఎలియాస్ భూపతి) లొంగిపోయారు. ఇవి జరిగిన కొద్ది నెలల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
హిడ్మాతో పాటు అతని భార్య రాజే, కొంతమంది అనుచరులు కూడా చనిపోయారు.
Next Story

