ముద్రగడ పద్మనాభ రెడ్డి అవుతాడా?
x

ముద్రగడ పద్మనాభ రెడ్డి అవుతాడా?

పవన్‌ కల్యాణ్‌ ఖచ్చితంగా ఓడి పోతారని ముద్రగడ అనడానికి కారణాలేమిటి? పవన్‌ గెలిస్తే పేరు మార్చుకుంటారా?



వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పిఠాపురంలో ఓడించకుంటే తన పేరు మార్చుకుంటానని, పద్మనాభరెడ్డిగా పేరును మార్చుకుంటానని శబధం చేశారు. ఇప్పుడు అదే మాట రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడు, ఎందుకు అనాల్సి వచ్చింది అనే కాపు సామాజిక వర్గంలో ప్రధాన చర్చకు దారి తీసింది. ముద్రగడ పద్మనాభం ఒక మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. మంత్రిగా కూడా పని చేశారు. పార్టీల్లో వస్తున్న మార్పులు, పరిణామాలు కారణంగా కొంత కాలం రాజకీయాలకు దూరమై కాపు ఉద్యమాన్ని నడిపారు. కాపులకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోను రిజర్వేషన్లు ఉండాలని కోరుకున్న వారిలో ముద్రగడ ఒకరు.

చంద్రబాబుపై ఈర్ష్యతోనే
2014లో కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించి మోసం చేశారని, కాపు రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని చేసిన ఉద్యమంలో తనను ఫెయిల్‌ చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని కాపు నేతల మధ్య తనను చులకన చేశారనే ఈర్ష్య ఆయనలో ఉంది. ఆ ఉద్యమం సందర్భంగా పలు కేసులు ముద్రగడపై నమోదు కావడం, రైలు ధగ్దం కేసులో అరెస్టు చేయడం, పోలీసులతో ఇంటి దిగ్బంధించి ముద్రగడను అవనానికి గురి చేశారని అప్పట్లో కాపు వర్గం అంతా మండి పడింది. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేనలో చేరాలని ముద్రగడ భావించారు. ఆ దిశగా పావులు కదిపారు. చంద్రబాబు జనసేనలోకి రాకుండా అడ్డుపడ్డారనే ఆలోచనకు వచ్చిన ముద్రగడ పవన్‌ కల్యాణ్, చంద్రబాబుపై విమర్శిలు గుప్పించి పాలకులుగా పనికి రారనే సంచలన వ్యాఖలు కూడా చేశారు. కొందరు కాపు నేతల నుంచి ఈ కారణంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. నాయకుడిగా తన సత్తా ఏమిటో తెలియ జెప్పాలని అనుకున్న ముద్రగడ ఏ షరతులు లేకుండా ఏ పదవి ఆశించకుండా వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను ఓడించి తీరుతానని సవాల్‌ విసిరారు.
ముద్రగడ ఇంటికి పోలీసులు రక్షణ
ముద్రగడ కుమార్తె క్రాంతి భారతి జనసేనకు మద్దతు ఇస్తు మాట్లాడటం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. టీడీపీ, జనసేన నాయకులు కక్ష కట్టి ముద్రగడ కుటుంబాన్ని విడదీసి ఇబ్బందుల పాలు చేస్తున్నారనే విమర్శలు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఉన్నాయి. ఇటీవల కొందరు కాపు నేతల మాటల దాడి కూడా ముద్రగడపై పెరిగింది. ప్రభుత్వం ఆయన ఇంటికి రక్షణ కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముద్రగడ వ్యాఖ్యల వల్ల జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను గెలిపించేందుకు కాపులు మరింత పట్టుదలతో అడుగులు వేస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. నిజానికి పవన్‌ కల్యాణ్‌ను కాపులు గెలిపించి అసెంబ్లీకి పంపితే ముద్రగడ తన పేరును రెడ్డిగా మార్చుకుంటాడా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ముద్రగడ కుమార్తె క్రాంతి భారతి మాటలు
క్రాంతి భారతి తన తండ్రి ముద్రగడ తీరుపై మండిపడ్డారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం కోసం తన తండ్రి పనిచేయొచ్చు, కష్ట పడొచ్చు తప్పు లేదు. కానీ జగన్‌ మెప్పు కోసం పవన్‌ కల్యాణ్‌ మీద మాట్లాడుతున్న భాష మాత్రం సరికాదని అన్నారు.
Read More
Next Story