ఏపీ రాజధాని అమరావతిలో ఆర్థిక అవసరాలు తీర్చేందుకు కొంత భూమిని కేటాయించారు. ఈ భూమిని ఏ విధంగా ఉపయోగించి ఆర్థిక అవసరాలు తీరుస్తారో ప్రభుత్వం స్పష్టం చేయలేదు.


అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి పడరాని పాట్లు పడుతున్నారు. అమరావతిని రాష్ట్ర వ్యాప్తంగా అనుసంధానిస్తూ తయారు చేసిన రహదారుల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర నిధులతో ఈ రహదారులు నిర్మించేందుకు అంగీకరించడం అమరావతి చరిత్రలో చెప్పుకోదగ్గ అంశం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై రాష్ట్రాల నుంచి కూడా నేరుగా అమరావతికి చేరుకునే విధంగా రహదారి సౌకర్యం ఏర్పడ నుంది.

ప్రభుత్వం సేకరించిన భూమిలో అన్ని అవసరాలకు పోను 8,284 ఎకరాలు మిగులుతుంది. ఈ భూమిని ఉపయోగించి అమరావతి ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ప్రభుత్వం పలు ఆలోచనలు చేస్తోంది. ఏ విధంగా ఈ భూమిని ఉపయోగించి నిధులు రాబట్టాలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ భూమిని ప్రభుత్వేతర సంస్థలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసుకునేందుకు లీజు లేదా ధర ప్రాతిపదికన ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అన్ని అవసరాలకు పోను మిగులు భూమి ద్వారా డబ్బు రాబట్టి అమరావతిలో సగం నిర్మాణాలు పూర్తి చేయాలని గతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం భావించింది. ఆ తరువాత ప్రభుత్వం మారటంతో ప్రయారిటీలు మారిపోయాయి. మిగులు భూమి ద్వారా ఆర్థిక అవసరాలు తీరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన స్వేతపత్రంలో పేర్కొన్నారు.
ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించిన భూమి నుంచి వచ్చే ఆదాయం ద్వారానే అమరావతి నిర్మించ వచ్చని టీడీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. మిగులు భూమి అంత ఎందుకని అప్పట్లో పలువురు ప్రశ్నించారు. ఇపటటికీ అదే భూమి అలాగే మిగిలి ఉంది. మొత్తం 53,748 ఎకరాల్లో రోడ్లు, ఇతర సదుపాయాల కోసం 27,855 ఎకరాలు, రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు 11,826 ఎకరాలు, ఇతర అవసరాల కోసం 14,037 ఎకరాలు కేటాయించినట్లు ఇటీవల ప్రకటించిన స్వేతపత్రంలో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇతర అవసరాలు అంటే ఏమిటనే విషయాన్ని మాత్రం అయన స్వేతపత్రంలో స్పష్టం చేయలేదు. ఇవన్నీ పోను మిగిలిన 8,274 ఎకరాల భూమిని మానిటైజేషన్‌ (నిధుల రూపంలోకి మార్చుకోవడం) కోసం అందుబాటులో ఉంచినట్లు స్వేతపత్రంలో వివరించారు.
ప్రస్తుతం అమరావతి ర్యాకింగ్‌ దెబ్బతిన్నది. అందువల్ల ఈ భూమిని ఏ విధంగా ఉపయోగించుకుంటారనే చర్చ మొదలైంది. చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని స్వేతపత్రం విడుదల సందర్భంగా ప్రస్తావించారు. అన్ని విధాలుగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ర్యాకింగ్‌ లేకపోతే పెట్టుబడి సంస్థలు, బ్యాంకులు ముందుకు రారనే విషయం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు. సింగపూర్‌ వాళ్లు స్విస్‌ ఛాలెంజ్‌ పద్దతిలో అమరావతి నిర్మించేందుకు ముందుకు గతంలో వచ్చారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక వారిని వెనక్కి పంపించారు. తిరిగి ఇప్పుడు వారు ముందుకు వస్తారా? రారా? అనే అంశంపై చర్చించాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మిగులు భూమి నుంచి నిధులు ఎలా సేకరిస్తారో, అభివృద్ధి పథంవైపు ఎలా పయనిస్తారో వేచి చూడాల్సిందే.
Next Story