రిమాండ్ కు వెళుతున్న గోరంట్ల మాధవ్

రాజకీయ గుర్తింపు కోసమే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ జైలు పాలయ్యారు? దీనిని మాజీ సీఎం జగన్ ఎలా సమర్థిస్తారనే చర్చ మొదలైంది.


మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చర్యలు రాజకీయ ఆత్మరక్షణ లేదా గుర్తింపు కోసం చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అతని రాజకీయ భవిష్యత్తును బలోపేతం చేయడానికి బదులు, మరింత దిగజార్చే అవకాశం ఉంది. జగన్ నాయకత్వం ఇలాంటి వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. మాధవ్ ఈ ఘటన ద్వారా తన రాజకీయ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అతని సామాజిక వర్గంలో కొంత సానుభూతి లభించినప్పటికీ, దీర్ఘకాలంలో ఈ ఘటన అతని విశ్వసనీయతను కోల్పోయే చేస్తుందనటంలో అతిశయోక్తి లేదు.

మాధవ్ వ్యూహం స్పష్టమైన దీర్ఘకాల లక్ష్యం కంటే, స్వల్పకాలిక దృష్టి, రాజకీయ ఉనికిని కాపాడుకోవడం చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. మాజీ పోలీసు అధికారి నేపథ్యం ఈ చర్యలను మరింత ఆశ్చర్యకరంగా చేస్తుంది. ఎందుకంటే అతను చట్టపరమైన పరిణామాల గురించి బాగా తెలుసుకొని ఉండాలి. ఈ ఘటన అతని రాజకీయ అననుభవం లేదా భావోద్వేగ నిర్ణయాల ఫలితంగా కనిపిస్తుంది.

నేపథ్యానికి విరుద్ధంగా మాధవ్ చర్యలు

సోషల్ మీడియా యాక్టివిస్ట్ చేబ్రోలు కిరణ్ పోలీస్ కష్టడీలో ఉండగా గోరంట్ల మాధవ్ ఆ వ్యక్తిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడం, పోలీసు విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలు అతని మాజీ పోలీసు అధికారి నేపథ్యానికి విరుద్ధంగా కనిపిస్తాయి. అతనికి చట్టం, పోలీసు విధానాలపై అవగాహన ఉన్నప్పటికీ, ఈ ఘటనలో అతను భావోద్వేగంతో, రాజకీయంగా ప్రేరేపితమై ఈ విధంగా వ్యవహరించినట్లు చెప్పొచ్చు. ఈ ఘటన వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినది. ఇది వైఎస్సార్సీపీ నాయకత్వానికి సమీపంగా ఉన్న విషయం. మాధవ్ ఈ సందర్భంలో తన విధేయతను, పార్టీ పట్ల తన నిబద్ధతను చూపించాలని భావించి ఉండటం వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయనే చర్చ జరుగుతోంది.

మాధవ్ చర్యల వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు...

మాజీ ఎంపీగా 2024 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో మాధవ్ రాజకీయంగా అంచనాలు తగ్గిన స్థితిలో ఉన్నారు. ఈ ఘటన ద్వారా తన సామాజిక వర్గం (కురుబ)లో, వైఎస్సార్సీపీ శ్రేణుల్లో తన స్థానాన్ని బలోపేతం చేయాలని భావించి ఉండవచ్చు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి గుర్తింపు పొందేందుకు మాధవ్ ఈ చర్యలకు పాల్పడి ఉంటాడనే చర్చ కూడా జరుగుతోంది.

జగన్ కుటుంబానికి సంబంధించిన వివాదంలో జోక్యం చేసుకోవడం ద్వారా, అతను తన విధేయతను నిరూపించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందనే చర్చ కూడా ఉంది. పెద్ద కారణం లేకుండా జైలు గోడల మధ్యకు వెళ్లాలని ఎవ్వరూ భావించరు. తాను మాజీ పోలీసు అధికారినని, పైగా మాజీ ఎంపీ ననే అహంతో పోలీసులపై మాధవ్ తిరగబడి ఉంటాడనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. తన సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా కనిపించాలని కోరుకున్నాడు. ఈ ఘటన ద్వారా అతను తన సమాజంలో "రక్షకుడు" లేదా "నాయకుడు" ఇమేజ్‌ను సృష్టించడానికి ప్రయత్నించి నందునే ఈ పరిస్థితి ఎదురై ఉంటుందనే చర్చ కూడా ఉంది.

జైలుకు వెళ్లడం వల్ల రాజకీయ ఉన్నతి?

మాధవ్ జైలుకు వెళ్లడం వల్ల ఆయన రాజకీయ కెరీర్‌కు ఉన్నతి లభిస్తుందా? అనేది సందర్భంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రాజకీయ నాయకులు వివాదాస్పద చర్యల ద్వారా, చట్టపరమైన చిక్కుల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించడం భారత రాజకీయాల్లో అసాధారణం కాదు. అయితే మాధవ్ విషయంలో ఈ విషయాన్ని కొన్ని కోణాల్లో పరిశీలిస్తే... పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, చట్టాన్ని అతిక్రమించడం వంటి చర్యలు అతని ఇమేజ్‌ను దెబ్బతీస్తాయి. మాజీ పోలీసు అధికారిగా, అతని నుంచి ఉన్నత ప్రమాణాలు ఎవరైనా ఆశిస్తారు. కానీ ఈ ఘటన అతని విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

2024 ఎన్నికల్లో టికెట్ రాకపోవడం వల్ల మాధవ్ ఇప్పటికే వైఎస్సార్సీపీలో అంచనాలు తగ్గిన స్థితిలో ఉన్నారు. ఈ ఘటన అతని రాజకీయ భవిష్యత్తును మరింత దిగజార్చవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే జగన్ ఇలాంటి వివాదాస్పద చర్యలను సమర్థించే అవకాశం తక్కువగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

జగన్ దృష్టిలో పడాలనే తాపత్రయం...

మాధవ్ జగన్ దృష్టిలో పడాలని తాపత్రయ పడటం వెనుక అతని రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి. వైఎస్సార్సీపీలో జగన్ ఏకైక నిర్ణయాత్మక శక్తి. ఆయన గుర్తింపు లేకుండా రాజకీయంగా ఎదగడం కష్టం. మాధవ్ ఈ ఘటన ద్వారా జగన్‌కు తన విధేయతను నిరూపించడానికి ప్రయత్నించి ఉండవచ్చు. జగన్ పట్టించుకోక పోవడం, టికెట్ ఇవ్వకపోవడం వల్ల మాధవ్ ఒక రకమైన రాజకీయ నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ, అతను ఈ చర్యల ద్వారా పార్టీలో తన స్థానాన్ని తిరిగి పొందాలని, కనీసం జగన్ దృష్టిని ఆకర్షించాలని భావించి ఈ విధంగా చేశారని పలువురు భావిస్తున్నారు. ఇటువంటి ట్రిక్కులు జగన్ తెలుసుకోలేని స్థితిలో ఉంటారని భావించడం కూడా తెలివి తక్కువ తనమే అవుతుంది.

స్నేహితులతో కలిసి జైలుకు వెళ్లడం...

మాధవ్ తన అనుచరులతో కలిసి ఈ ఘటనలో పాల్గొనడం, వారు కూడా జైలుకు వెళ్లేలా చేయడం అతని నాయకత్వ శైలి, రాజకీయ వ్యూహం గురించి చెబుతోంది. ఇది ఒక సమూహ చర్యగా కనిపించడం వల్ల, అతను తన అనుచరులను ఉత్సాహపరిచి, వారిని ఈ చర్యలో భాగం చేయడం ద్వారా తన బలాన్ని చూపించాలని భావించి నట్లున్నారు. ఇది అతని నిర్ణయాలలో లోపం, రాజకీయ అనుభవ రాహిత్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఇలాంటి చర్యలు చట్టపరమైన పరిణామాలకు దారితీస్తాయని అతనికి తెలిసి ఉండాలి.

మాధవ్ కు ఏదైనా వ్యూహం ఉందా?

మాధవ్ వ్యూహం స్పష్టమైన రాజకీయ లక్ష్యం కంటే ఎక్కువ భావోద్వేగ, స్వల్పకాలిక దృష్టిని ఆకర్షించే దిశగా ఉన్నట్లు కనిపిస్తుంది. అతని చర్యల వెనుక కొన్ని వ్యూహాలు ఉన్నట్లు చెప్పొచ్చు. మాధవ్ తన కురుబ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా స్థిరపడాలని కోరుకుంటున్నాడు. గతంలో అతను కుల రాజకీయాలను ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఘటన కూడా అలాంటి ప్రయత్నంలో భాగం కావచ్చు.

జగన్ దృష్టిని ఆకర్షించడం, భవిష్యత్ ఎన్నికల్లో అవకాశాలను పొందడం కోసం అతను ఈ వివాదాన్ని సృష్టించి ఉండవచ్చు. జగన్ ఇలాంటి చర్యలను సమర్థించే అవకాశం తక్కువ. కాబట్టి ఇది ఒక తప్పిదంగా మారే అవకాశం ఉంది. అధికార కూటమి పై ఒత్తిడి తీసుకురావడానికి, వారిని విమర్శించడానికి ఈ ఘటనను ఉపయోగించాలని మాధవ్ భావించి ఉండవచ్చు. అతను ఈ సంఘటనను "రాజకీయ హింస"గా చిత్రీకరించి సానుభూతి పొందే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

గోరంట్ల మాధవ్ వివాదాస్పద చర్యలు అతని రాజకీయ భవిష్యత్తును మరింత సంక్లిష్టం చేసే అవకాశం ఉంది. మాధవ్ రాజకీయ వ్యూహం స్వల్పకాలిక దృష్టిని ఆకర్షించినప్పటికీ, దీర్ఘకాలంలో అతని స్థానాన్ని బలోపేతం చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉంది.

Next Story