రూ. 44 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం
తిరుమలలో దాతలే అన్నదాన సత్రంలో స్వయంగా యాత్రికులకు వడ్డించవచ్చు. దీనికోసం టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్టు కూడా నిర్వహిస్తోంది.
తిరుమలలో ఆకలి అనే పదానికి చోటు లేదు. శ్రీవారిని దర్శనానికి వచ్చే యాత్రికులు కూడా తరిగొండ వెంగమాంట నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేయవచ్చు. ఇక్కడ ఒక రోజు మొత్తం అన్నప్రసాదాలు అందించేందుకు రూ. 44 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ మొత్తం టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్టుకు జమ చేసే దాత కుటుంబం స్వయంగా యాత్రికులకు ప్రసాదాలు వడ్డించవచ్చు. టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
శ్రీవారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి వచ్చే యాత్రికుల కోసం తిరుమలలో టీటీడీ నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తోంది. ఇక్కడ స్టార్ హోటల్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆహార పదార్థాలు వడ్డిస్తారు. ఈ సత్రం నిర్వహణ కోసం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు కూడా ఏర్పాటు చేసింది. యాత్రికులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందుబాటులో ఉంచుతుంది. ఇందుకోసం టీటీడీ విరాళాలు కూడా స్వీకరిస్తోంది. ఇక్కడ ఏ పదార్థాలు వడ్డిస్తారంటే..
ఒక పూటకు విరాళం ఎంతంటే..