ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా కలిసి పనిచేయండి

మీలో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా కలిసి పనిచేయండి అని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారు.


ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా కలిసి పనిచేయండి
x
Janke Venkatareddy and Nagarjuna Reddy

తాడేపల్లి సీఎం జగన్‌ నివాసంలో ఏమి జరుగుతున్నది. ఎందుకు ఈ బుజ్జగింపులు, టిక్కెట్లు రాని వాళ్లను పిలిచి సీఎం మాట్లాడకుండా అక్కడ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారి ధనుంజయ్‌రెడ్డితో మాట్లాడించి ఎందుకు పంపించాల్సి వస్తోంది. టిక్కెట్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాం. మాతో ఎందుకు మాట్లాడటం లేదు. మేము చేసిన పాపమేంటని ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. ఆ బాధ ముఖ్యమంత్రికి పట్టడం లేదు. నేను వద్దనుకున్నాను. నాసర్వేలో వారికి టì క్కెట్‌ ఇస్తే ఓడిపోతారని తేలింది. అందుకే వారిని దూరం నుంచే పంపించడం మంచిదనే భావనలో సీఎం ఉన్నారు.

కలిసి పనిచేయాలి
ఆదివారం చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పిలిపించి సీఎం జగన్‌ కొందరితో, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్‌రెడ్డిలు కొందరితో మాట్లాడి పంపిస్తున్నారు. కొందరికి టిక్కెట్‌ లేదని క్లారిటీ ఇస్తున్నారు. మరికొందరికి కలిసి పనిచేసుకోమని సర్థిచెప్పి పంపిస్తున్నారు. వారు వినకుంటే తర్వాత రమ్మని పంపిస్తున్నారు. తర్వాత వచ్చినప్పుడు వారిలో ఎవరు పోటీలో ఉంటారో చెప్పేస్తున్నారు. ఇదీ సీఎం ఇంట్లో జరుగుతున్న తంతు.
ఆదివారం పిలిపించిన వారిలో మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని ఉన్నారు. వీరిద్దరిలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని సీఎం ఇంట్లోకి పిలిచి మీలో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా కలిసి చేసుకోవాలని చెప్పారు.
నేను అంగీకరించను..
అందుకు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అంగీకరించలేదు. నేను ఐదేళ్లు కష్టపడి నియోజకవర్గంలో అందరి మన్నన పొందాను. ఇప్పుడు కాదంటే ఎలా అని సీఎంను ప్రశ్నించారు. అయితే రేపు మాట్లాడదాం వెళ్లు అని చెప్పి నాగార్జునరెడ్డిని పంపించారు. ఇక జంకె వెంకటరెడ్డిని సీఎం మాట్లాడేందుకు పిలవలేదు.
ఈసారి నాకే టిక్కెట్‌ అన్నారు
వైఎస్సార్‌సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారి ధనుంజయ్‌రెడ్డిలు జంకెతో మాట్లాడారు. మీ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేయాలని చెప్పారు. అందుకు జంకె వారికి బదులిస్తూ 2014లో నేను గెలిచాను. 2019లో నాకు టిక్కెట్‌ ఇవ్వలేదు. 2024తో తప్పకుండా టిక్కెట్‌ ఇస్తామని చెప్పి ఒప్పించి అప్పుడు నేను ప్రస్తుత ఎమ్మెల్యే నాగార్జునరెడ్డికి సహకరించాలని చెప్పారు. మీరు చెప్పినట్లు చేశాను. ఇప్పుడు టిక్కెట్‌ విషయం తేల్చకుంటే ఎలాగని ప్రశ్నించారు. ఏమి చెప్పాలో తెలియన తర్వాత పిలిపిస్తామని పంపించారు.
మీలో ఎవరికి సీటు ఇచ్చినా కలిసి చేసుకోవాలని చెప్పడం ఏమిటి? పార్టీలోని పెద్దలకు క్లారిటీ లేదా? అన్నీ ఉన్నా ఏమి చెప్పాలో తెలియడం లేదా? ఎందుకు తెలియదూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జంకె పక్కకు పోతారేమో. తిగిరి టిక్కెట్‌ నాగార్జునకు ఇవ్వకపోతే పక్కకు పోతాడేమో.. ఇదీ పార్టీ పెద్దల తొలుస్తున్న సందేహం.
జంకెకు బాలినేని మద్దతు
జంకె వెంకటరెడ్డి మంచి నాయకుడు. రాజకీయ నేపథ్యం ఉంది. టీడీపీ, వైఎస్సార్‌సీపీల్లో ఎమ్మెల్యేగా పనిచేశారు. జనం మధ్య మంచి మనిషని పేరు సంపాదించుకున్నారు. ఎవరు ఎప్పుడు పిలిచినా పలికే నాయకుడయ్యాడు. ఈయన తండ్రి కూడా పూర్వపు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఈయనకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతు ఉంది.
మొదటి సారి ఎమ్మెల్యే..
నాగార్జునరెడ్డి కొత్తగా వచ్చిన యువ నాయకుడు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తండ్రి కాంగ్రెస్‌ పార్టీలో చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో చైర్మన్‌గా పనిచేశారు. ఆయన ఆరోగ్య రిత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు నాగార్జునరెడ్డికి పార్టీలోని కొందరు పెద్దల వత్తిడితో సీటు ఇచ్చారు. ఇప్పుడు తాను తిరిగి పోటీచేయాల్సిందేనంటున్నారు.
నాగార్జునరెడ్డి కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డికి అల్లుడు. కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డిలు చక్రం తిప్పి గత ఎన్నికల్లో సీటు ఇప్పించుకోగలిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నేను పోటీ నుంచి తప్పుకున్నానని, తిరిగి ఇప్పుడు నాకు టిక్కెట్‌ ఇస్తానని ఏదీ తేల్చడం లేదని జంకె అంటున్నారు.
జగన్‌ ఇంట్లో జరిగిన వ్యవహారంపై జంకె వెంకటరెడ్డిని ఫెడరల్‌ ప్రశ్నించగా నాకు టిక్కెట్‌ తప్పకుండా వస్తుందనే నమ్మకం ఉందన్నారు. గత ఎన్నికల్లో సీఎం హామీ ఇచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నాకే టిక్కెట్‌ ఇస్తారని చెబుతున్నారని చెప్పారు.
రెడ్డి సామాజికవర్గంలో ఇద్దరూ బలమైన నాయకులే. పార్టీ నాయకత్వం ఎవరిని బరిలోకి దించుతుందో వేచి చూడాల్సిందే.
Next Story