విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం.. జోస్యం చెప్పిన బొత్స
x

విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం.. జోస్యం చెప్పిన బొత్స

2024 ఆంధ్ర ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మరోసారి సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు.


ఆంధ్రలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, మరోసారి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయడం తథ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారని, జగన్‌తో రాష్ట్ర, ప్రజల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన పోలింగ్‌లో మహిళా ఓటర్లు చురుగ్గా పాల్గొన్నారని అధికారులు చెప్పారని, ఆత్మగౌరవం కాపాడరన్న అభిమానం సీఎంపై ఉండటమే అందుకు కారణమని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్లే రాష్ట్రంలో పెద్దఎత్తున ఓటింగ్ జరిగిందని, ఇది మరోసారి వైసీపీ ప్రభంజనానికి ప్రతీక కానుందనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజేతపై ప్రజల మౌనం.. వైసీపీ సునామీ ముందు నిశ్వబ్దమంటూ కీలకంగా వ్యాఖ్యానించారు.

టీడీపీవన్నీ మోసాలు, కుయుక్తులే

ప్రజలకు టీడీపీ ఇచ్చే హామీలన్నీ ఎన్నికల్లో గెలవాడానికి వారు చేస్తున్న కుయుక్తేలనని, వారికి ప్రజలను మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అంటూ బొత్స మండిపడ్డారు. ‘‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ ఎంత గొంతుచించుకుని అబద్దాలను అరిచి చెప్పినా రైతులు, ప్రజలు ఎవరూ నమ్మలేదు. రాజకీయాల్లో చిత్తశుద్ది ముఖ్యం. వైసీపీకి ఉన్న చిత్తశుద్దిరిని చూసే ప్రజలు పెద్దఎత్తున మా పార్టీకి మద్దతు పలికారు. కానీ ఎలాగైనా ఎలవాలనుకున్న ప్రతిపక్షం మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. వారి చేష్టలన్నీ రెచ్చగొట్టేలా ఉన్నాయి’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్సా సత్యనారాయణ.

విశాఖలోనే ప్రమాణ స్వీకారం

‘‘జూన్ నాలుగున ఘన విజయం సాధించి విశాఖలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పండగలాంటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో ఫ్యాన్ జెండ్ ఎగరనుంది. ఫ్యాన్ హవాకి సైకిలు, గాజు క్లాసు ఎగిరిపోతాయి. 2019 ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా 2024లో ప్రతిపక్షాలకు గతిఉండవు. మరోసారి జగన్‌నే సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని రాష్ట్రంలోని మహిళలు ఫిక్స్ అయిపోయారు. వారు కోరుకున్న విధంగా ఫలితాలు వస్తాయన్న నమ్మకం నాకు ఉంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

Read More
Next Story