అవును, నిజమే.. ఆయనకూ ఓ లెక్కుంది..

"అవును నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది" గబ్బర్‌ సింగ్‌ సినిమా డైలాగ్‌. నిజమే ఆయనకోలెక్కుందని రాజకీయ పరిశీలకులు పవన్‌కళ్యాణ్‌పై సెటైర్లు వేస్తున్నారు.


అవును, నిజమే.. ఆయనకూ ఓ లెక్కుంది..
x
Pavan Kalyan

గబ్బర్‌ సింగ్‌ సినామాలో ఒకడు తప్పించుకని వెళుతుంటాడు. వాడిని పిలుస్తూ ఓయ్‌ అక్కడే ఆగురా వెదవా అంటాడు హీరో పవన్‌కళ్యాణ్‌. వాడు వెనక్కి చూసి ఏ.. అంటాడు. నాగన్‌కు అంతకంటే ఎక్కువ రేంజ్‌లేదురా వెదవా అంటూ కాలుస్తాడు. అప్పుడు ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అంటూ డైలాగ్‌ చెబుతాడు. దానికి సరిగ్గా ‘అవును.. నిజమే.. ఆయనకో లెక్కుంది’ అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమిటా లెక్క.. ఎందుకు పరిశీలకులు ఇలా అంటున్నారు. ఒకసారి పరిశీలిద్దాం..

తప్పుల పట్ల క్లారిటీ ఉన్నట్లేనా?
పవన్‌ కళ్యాణ్‌ తాను చేస్తున్నవి కొన్ని తప్పులని భావిస్తున్నారా? అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు. ఎందుకు వారు అలా అంటున్నారంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తుతో ముందుకు పోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. బీజేపీని టీడీపీ ఇప్పటి వరకు వ్యతిరేకిస్తూనే వస్తున్నది. ఏమైనా మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి వెళ్లాలనే క్లారిటీ పవన్‌లో ఉన్నట్లేనా? బీజేపీతో టీడీపీ పొత్తుకు పావులు కదుపుతున్నది. ఇప్పటికి ఒకసారి పొత్తుల విషయమై ఇరుపార్టీలు చర్చించుకున్నట్లు సమాచారం.
తన బలమెంతో తనకు తెలుసు!
జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ తన బలం ఎంతో తనకు తెలుసని స్పష్టం చేశారు. పలుసార్లు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక్కడ మాట్లాడేవారంతా గత ఎన్నికల్లో నన్నెందుకు గెలిపించలేకపోయారు. అంటే మీది కపట ప్రేమేనంటూ.. ఉండాలనుకునేవాళ్లు పార్టీలో ఉండండి. వద్దనుకునే వాళ్లు వెండిపోండని ఇటీవలే సెలవిచ్చారు. అంటే ఆయనకున్న బలమెంతో పిచ్చ క్లారిటీలో ఉన్నారు.
కమ్యునిటీ ఎందుకు ఓన్‌ చేసుకోవడం లేదు
ఇప్పటి వరకు పవన్‌ కళ్యాణ్‌ తన కమ్యునిటీ బలంపై ఉన్నారని అందరూ భావించారు. అయితే జనసేనను కాపు కమ్యునిటీ పూర్తి స్థాయిలో ఓన్‌ చేసుకోవడం లేదు. కమ్యునిటీలో ఒక వర్గం వైఎస్సార్‌సీపీని బలపరుస్తోంది. మరో వర్గం టీడీపీ వైపు ఉంది. మరి పవన్‌కళ్యాణ్‌వైపు ఉన్న వర్గం ఎవరనే చర్చ కూడా సాగుతున్నది. పవన్‌ కళ్యాణ్‌పై కాపు యువత నమ్మకంతో ఉంది. తప్పకుండా పవన్‌ విజయం సాధించి ఎప్పటికైనా ముఖ్యమంత్రవుతాడనే నమ్మకంలో వారు ఉన్నారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంతవరకు తన మద్దతు ఎవరికనే విషయాన్ని ప్రకటించలేదు. ఆయన మద్దతు ఎవరికి ఉంటే ఆ పార్టీకి ఎక్కువగా కాపు ఓట్లు వస్తాయనే చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది.
పార్టీలో నాగబాబు పాత్ర ఎలా ఉండబోతోంది?
పార్టీలో కొణిదెల నాగబాబు పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఈ మాటలు వస్తున్నాయంటే టిక్కెట్ల కేటాయింపు విషయంలో కుటుంబ సభ్యుల పాత్ర ఉంటుందనే ఆలోచనలో టిక్కెట్లు ఆశించే వారు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల బరిలోకి వెళ్లేటప్పుడు కూడా కుటుంబ సభ్యుల ప్రోద్బలంతోనే ఎక్కువ మందికి సీట్ల కేటాయింపు జరిగింది. అందుకే ఈ విషయంలోనూ పవన్‌ కళ్యాణ్‌ పూర్తి క్లారిటీగా ఉన్నాడని, ఆయన అన్నకు బాధ్యతలు ఆల్‌రెడీ అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story