నువ్వే కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ జగన్!
x

నువ్వే కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ జగన్!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంతనే స్థాయిలో ఈ మాటలు ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్ లో ఎండలతో పాటే రాజకీయ వాడీ వేడీ పెరిగింది. వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేన పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంతనే స్థాయిలో ఈ మాటలు ఉన్నాయి. వచ్చే ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై మార్చి 5న తాడేపల్లిలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మధ్యలో పవన్ కల్యాణ్ ప్రస్తావన తెచ్చారు. ఆయన్దేముందీ.. కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. దానికి జనసేన నాయకుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కు పడిపోవడంతో మతి భ్రమించినట్టుంది జగన్ కి.. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. జర్మనీ చట్టాలు ఏపీలో అమలు చేస్తానంటే ఎలా?' అని ప్రశ్నించారు. తాడు బొంగరం లేని పార్టీ వైసీపీ అని సెటైర్లు వేశారు. ఇంగిత జ్ఞానం లేదు కాబట్టే తనకు తాను శాశ్వత పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారన్నారు. తన ప్రజా జీవితంలో ఒక్క రూపాయి అయినా ఇచ్చి దాతగా జగన్ నిలబడ్డారా? మా అధినేత పవన్ కళ్యాణ్ వేలాదిమందికి ఆర్ధిక సాయం చేశారని చెప్పుకొచ్చారు.
నీకు నిజాయితీ ఉందా జగన్న?
నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది యువత కాదా? సూపర్ 6 గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటకు కట్టుబడి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయటం జగన్ అలవాటు చేసుకోవాలన్నారు. రైతులకు ధాన్యం కొనుగోళ్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన వారు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఒక్కరోజైనా జగన్ పనిచేశారా? అని ప్రశ్నించారు.
కోడికత్తికి ఎక్కువ.. గొడ్డలికి తక్కువ..
అధికారంలో ఉండగా వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రిగా ముద్రపడిన వ్యక్తి, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ బెంగుళూరు ఎమ్మెల్యేగా మారాడని ఎద్దేవ చేశారు. జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని మేం అనలేక కాదు, మాకు సభ్యత ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరుతుందని మంత్రి నాదెండ్ల వ్యాఖ్యానించారు.
మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ చర్చకు దారితీశాయి. ఇటీవల ఏపీ చంద్రబాబు సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంత తప్పుల తడకగా ఉందని మాజీ సీఎం జగన్ అన్నారు. దీనిలో ఆత్మస్థుతి, పరనిందలు మాత్రమే ఉన్నాయన్నారు. అంతే కాకుండా.. ఎన్నికలలో ఇచ్చిన హమీలను కూడా నెరవేర్చకుండా.. అమలు చేసినట్లు, అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు సామాజిక ఆర్థిక సర్వేలో గణాంకాలలో సహా ఇచ్చి ఏకంగా గవర్నర్ తో అసెంబ్లీలో చదివించారన్నారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ లపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను కార్పోరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ సెటైర్ లు వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీ, జనసేనల మధ్య వివాదాన్ని రాజేశాయి. ఈ క్రమంలో దీనిపై జనసేన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీకి వచ్చి ప్రజల గొంతుక విన్పించాల్సింది పోయి.. మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఏదో ఒక వివాదానికి కారణమవుతున్నారన్నారు.
Read More
Next Story