‘మాది తప్పే.. క్షమించండి’.. క్షమాపణ చెప్పిన యూట్యూబర్
x

‘మాది తప్పే.. క్షమించండి’.. క్షమాపణ చెప్పిన యూట్యూబర్

టీటీడీ తన స్నేహితుల కలిసి చేసిన ప్రాంక్ వీడియోపై తమిళనాడు యూట్యూబర్ వాసన్ స్పందించాడు. భక్తుల ఇబ్బందులను తెలపడానికే వీడియో తీశామని చెప్పాడు.


టీటీడీ శ్రీవారి దర్శనానికి వెళ్లే క్యూలైన్ కాంప్లెక్స్‌లో ఇటీవల కొందరు ఆకతాయిలు ప్రాంక్ వీడియో చేయడం తీవ్ర కలకలం రేపింది. వారిపై దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా క్యూలైన్లలోకి ఫోన్లు తీసుకెళ్లడం అసాధ్యంలా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని టీటీడీని కోరుతున్న వారు ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన టీటీడీ కూడా సదరు ఆకతాయిలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పింది. ఈ క్రమంలోనే వారిలో తమిళ యూట్యూబర్ వాసన్ కూడా ఉండటంతో తమిళనాడుకు ప్రత్యేక విజిలెన్స్ సైబర్ వింగ్ బృందాన్ని కూడా పంపి అతడి కోసం గాలింపులు ముమ్మరం చేసింది. దీంతో తాము చేసిన తప్పును గ్రహించిన యూట్యూబర్ వాసన్.. తాజాగా క్షమాపణలు చెప్తూ మరో వీడియో చేసి అప్‌లోడ్ చేశాడు.

వీడియో చేయడానికి అసలు కారణం అదే!

తిరుమల తిరుపతి దేవస్థానంలో తాము వీడియో తీయాలనుకున్న కారణం వేరని వాసన్ తన వీడియోలో వివరించాడు. శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు పడుతున్న ఇబ్బందులను చూపించాలన్న ఉద్దేశంతో వీడియో తీశాం. అంతేకానీ వారిని ఆటపట్టించడానికి కాదు. అసలు మాకు ఆ ఉద్దేశం కూడా లేదు. కానీ నా స్నేహితుల్లో కొందరు ప్రవర్తించిన తీరు సరిగా లేదు. వారి చర్యలు కొందరి మనోభావాలు దెబ్బతీశాయి. అందుకు మేము చింతిస్తున్నాము. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కూడా, ఎవరినైనా ఇబ్బంది పెట్టడం కానీ మా ఉద్దేశం కాదు. మేము చేసింది తప్పే.. మమ్మల్ని క్షమించండి’’ అని తన సెల్ఫీవీడియోలో వివరించాడు వాసన్. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇలాంటి వీడియోలు చేయకుండా, వీడియోల్లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా తెలిపాడు.

భద్రత పెంచాల్సిందే!

టీటీడీ కూడా తన భద్రత చర్యలు మరింత పటిష్టం చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భక్తులను స్వచ్చందంగా ఫోన్‌లో ఇవ్వాలని కోరుతుండంతో కొందరు ఇలా దొంగచాటుగా ఫోన్లను లోపలికి తరలించుకుంటున్నారని, అలాంటి వారి వల్లే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని అనేక మంది తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు. వీటిని అరికట్టాలంటే ఫోన్ల‌ విషయంలో టీటీడీ మరింత కఠినతరంగా వ్యవహరించాలని, ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లో లోపలికి అనుమతించకూడదని, అక్కడ ప్రత్యేక చెకింగ్‌ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా దొంగచాటుగా ఫోన్లను లోపలికి తీసుకెళ్లిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ అంశంపై టీటీడీ ఇప్పటివరకు స్పందించలేదు.

Read More
Next Story