వైసిపిలో సునామీ : 13 మంది ఎమ్మెల్యేలు కొట్టుకుపోయినట్లేనా
వైసిపి ఇన్ చార్జ్ ల పేరుతో విడుదల చేస్తున్న జాబితాలు సునామీ సృష్టిస్తున్నాయి. ఇప్పటికి రెండు జాబితాలొచ్చాయి...
అసెంబ్లీల నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం పరుతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేస్తున్న జాబితా సునామీ సృష్టిస్తోంది. ఇందులో పేర్లు మాయ మయిన ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలను డ్రాప్ చేయవచ్చా అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు వైసిపి రెండుజాబితాలువిడుదల చేసింది.
13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఒక ఎంపీకి సీటు కొత్త అభ్యర్థులను ఎంపిక చేసింది. అంటే అక్కడ సిటింగ్ ఎమ్మెల్యేలకు సీటురాదనే అర్థం వాళ్ల పేర్లవి. ఇంతవరకు వరకు ఒక ఎంపి పేరు కూడా ఎగిరిపోయింది. ఆయన ఎవరో కాదు, ఫైర్ బ్రాండ్ అనుకున్న మాజీ సిఐ గోరంట్ల మాధవ్. హిందూపూరం నుంచి ఎంపి అయ్యారు.
* ఫస్ట్ లిస్ట్‌లో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దక్కని సీటు
* సెకండ్ లిస్ట్‌లో 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి దక్కని సీటు
మొదటి లిస్ట్‌లో సీటు రాని ఎమ్మెల్యేలు...
1. సంతనూతలపాడు: TJR సుధాకర్ బాబు
2.గుంటూరు వెస్ట్: మద్దాలి గిరిధర్
3. మంగళగిరి : ఆళ్ల రామకృష్ణారెడ్డి
రెండో లిస్ట్‌లో సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు
1.గోరంట్ల మాధవ్ - హిందూపురం ఎంపీ
2.గుడివాడ అమర్నాథ్ - అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి
3. గొల్ల బాబురావు - పాయకరావుపేట ఎమ్మెల్యే
4. కొండేటి చిట్టిబాబు - పి.గన్నవరం ఎమ్మెల్యే
5.పెండెం దొరబాబు - పిఠాపురం ఎమ్మెల్యే
6. జ్యోతుల చంటిబాబు - జగ్గంపేట ఎమ్మెల్యే
7. పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ - పత్తిపాడు ఎమ్మెల్యే
8. సిద్దారెడ్డి, కదిరి ఎమ్మెల్యే
9. చెన్నకేసవరెడ్డి- ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
10.చిట్టి ఫల్గుణ - అరకు ఎమ్మెల్యే
11. మల్లాది విష్ణు - విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే